S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

08/24/2016 - 23:16

ఎన్నో దశాబ్దాలుగా అసంపూర్తిగా నిలిచిన వివిధ సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించకుండా అసాధ్యభరితమైన సరికొత్త ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాలు పోటీతత్వంతో ముందుకు సాగుతుండటం ప్రజాధనం దుర్వినియోగం మినహా రైతాంగానికి ఉపకరించడం అనేది శూన్యం. పట్టిసీమ ద్వారా గోదావరి నుంచి 80 టిఎంసిల నీటిని మళ్లిస్తామని చెబితే ప్రస్తుతం మూడు లేదా నాలుగు వేల క్యూసెక్కులకు మించినీటి సరఫరా జరుగటం లేదు..

08/24/2016 - 23:16

కెసిఆర్ ఎక్కువ మాట్లాడతాడు.. తక్కువ పనిచేస్తాడు. నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో కూడా అంతే. గత ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టులను యథాతథంగా ఎందుకు కొనసాగించడం లేదు? అవి పూర్తయితే గత పాలకులకు పేరు వస్తుందనే కదా! ప్రజల సంక్షేమం, సామాజిక అభివృద్ధి విషయంలో రాజకీయాలు పనికిరావు. కూచుంటే, నిలబడితే కెసిఆర్ కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తామంటున్నాడు.

08/24/2016 - 23:15

ఆంధ్రప్రదేశ్‌లో అన్ని సాగునీటి ప్రాజెక్టుల కంటే చాలా కీలకమైనది పోలవరం. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును గురించి ‘ఎక్స్‌పిడి’ అనే పదం వినియోగించి పోలవరం త్వరితగతిన పూర్తిచేయాలని పెట్టారు. అంటే నియమ నిబంధనలను పక్కనబెట్టి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని చట్టంలోనే పొందుపర్చిన పథకానికి ప్రస్తుతం అతీగతీ కన్పించడం లేదు.

08/24/2016 - 23:14

సాగునీటి ప్రాజెక్టులంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ఇప్పుడు తెలంగాణలో అందరికీ గుర్తుకు వచ్చేది వైఎస్ పేరు మాత్రమే. వైఎస్‌ఆర్ ఆధునిక కాటన్. ఈ విషయాన్ని మర్చిపోయి టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకరిని ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ ప్రజల దృష్టిలో చులకన అవుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టును ఎవరు రూపొందించారు? ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చడం ఎందుకు?

08/24/2016 - 23:13

ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే భారీ నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టాల్సిందే. ఈ తరహా ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి. నీటి పారుదల ప్రాజెక్టు అంటే.. అవినీతికి చిరునామాగా మారింది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రాజెక్టుల్లో అవినీతి ఏరులై పారింది. అక్రమాలకు నీటి పారుదల ప్రాజెక్టులు చిరునామాగా మారాయి. అదే విధానం టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో కూడా కొనసాగుతోందనిపిస్తోంది.

08/17/2016 - 23:41

స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత చేపట్టిన అతి పెద్ద పన్నుల సంస్కరణలకు ప్రతి రూపమే జిఎస్‌టి- అంటే వస్తు సేవల పన్ను విధానం. ఈ విధానంతో దేశం ఆర్థిక శక్తిగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

08/11/2016 - 04:51

ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యా చదువులు కనీసం తెలుగు ఒక బోధనాంశంగా కూడా లేకుండానే గడచిపోయే పరిస్థితుల్లో భాషాభిమానుల ఒత్తిడితో ఇటీవలె తెలుగును నిర్బంధ భాషాంశంగా ప్రభుత్వం చేర్చింది. తాజాగా అన్ని స్కూళ్లను దశలవారీ ఆంగ్ల మాధ్యమంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు రెండు రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి కేంద్రంలో 2000 సంవత్సరం నుండే ప్రయత్నాలు మొదలయ్యాయి.

08/11/2016 - 04:50

పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఎందుకు ప్రవేశపెడుతున్నారు? టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు ఇంగ్లీషు మీడియం కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఈ ప్రశ్నలన్నీ ప్రతీచోటా వేయాలి. 2010లో ఎల్లారెడ్డి మండలంలో టీచర్లు వచ్చి ఇంగ్లీషు మీడియం ప్రారంభించాలని కోరారు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను కాపాడుకోవాలంటే ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాల్సిందేనని వారు చెప్పారు.

08/11/2016 - 04:49

ఇరవై ఒకటవ శతాబ్దాన్ని డిజిటల్ యుగంగా పరిగణిస్తారు. కొన్ని దేశాలు ఇతర దేశాలు మిగిలిన దేశాల కన్నా ఎందుకు తొందరగా అభివృద్ధి చెందుతున్నాయి? ఈ అభివృద్ధి ఏ అంశాల ఆధారంగా జరుగుతోందో కూడా పరిశోధనలు జరుగుతున్నాయి.

08/11/2016 - 04:48

మాతృభాషను వదిలి ఆంగ్లమోజులో పడిపోవడానికి కారణమైన మూలాలలను అనే్వషించే తపన ప్రభుత్వానికి గాని, మేథావులకు గాని లేకుండా పోయింది. అందరూ డిమాండ్ చేయడమే తప్ప ఈ పరిస్థితికి వాస్తవిక కారణాలు ఏమిటో అధ్యయనం చేసే ఓపిక లేదు, ఇంగ్లీషులో చదవడం అంటే అదో సామాజిక హోదాగా భావిస్తున్నారు. ఇంగ్లీషే ఒక గీటురాయిగా మారిందనే అపోహ నుండి తల్లిదండ్రులు బయటపడాలి.

Pages