S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

08/11/2016 - 04:48

ధర్మమనుడు, యోగమనుడు, తత్వమనుడు
ప్రాణి సాధింపగల సకల పరమార్థములకు
తల్లిభాష ప్రధాన సూత్రంబుయగుట..
భాష కంటే నవ్యులకు తపస్సు లేదు

08/11/2016 - 04:46

పదవ తరగతి వరకు మాతృభాషలోనే విద్యా బోధన జరగాలి. కావాలంటే ఇంటర్ నుంచి ఇంగ్లీష్‌లో ఆయా శాస్త్రాల గురించి నేర్పించవచ్చు. మూడవ తరగతి, నాలుగవ తరగతి నుంచి ఇంగ్లీష్ ఐచ్చికంగా చెప్పవచ్చు. కానీ బోధనా మాధ్యమం మాత్రం తెలుగులోనే ఉండాలి. ప్రపంచంలో అనేక దేశాల్లో మాతృభాషలోనే విద్యా బోధన జరుగుతోంది. చెకోస్లవేకియా కోటి మంది జనం ఉన్న దేశం. మాతృభాషలోనే విద్యా బోధన జరుగుతోంది.

08/11/2016 - 04:45

ఇపుడున్న పరిస్థితుల్లో తెలుగు భాషను ఎందుకు కాపాడుకోవాలి, ఎట్లా కాపాడుకోవాలి, ఇంగ్లీషు చదువులకు వ్యతిరేకం కాదు, ఇంగ్లీషు మామూలుగా చదువుకోవడం కాదు, బాగా చదువుకోవాలి, పది భాషలు రావడం వల్లనే పివి నర్సింహరావు ప్రధాని కాగలిగారు, లేకపోతే ఆ అవకాశం వచ్చేదికాదు, తెలుగు భాషగా మాత్రమే ఉంటే నిలవదు, తెలుగు ఊరికే నేర్చుకోమంటే నేర్చుకోరు, ఉద్యోగాలు ఇస్తామంటే నేర్చుకుంటారు.

08/11/2016 - 04:45

నాగరిక సమాజం మాతృభాషలో మాత్రమే మాట్లాడుతుంది - అనే ఇంగ్లీషు సామెత ఒకటుంది. మాతృభాషకు పాతరవేసే విధానాలవల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత లోపిస్తోంది. విషయాన్ని ఇతరులకు అర్థమయ్యే విధంగా మాట్లాడలేకపోతున్నారు. భావ వ్యక్తీకరణలో లోపం కొట్టుచ్చినట్లు కనపడుతోంది. అదే మాతృభాషలో పట్టుంటే, అన్ని భాషల్లో సులువుగా మాట్లాడవచ్చు. నేర్చుకుని రాయవచ్చు. బంగ్లాదేశ్ ఆవిర్భవించడానికి కారణమేంటి?

08/04/2016 - 01:14

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై మరోమారు విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రం కట్టుబడి ఉందని, సమస్యలను అర్థం చేసుకుంటామని, పరిష్కారానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెబుతున్నారు. ప్రత్యేక హోదాకు మరో ప్రత్యామ్నాయం లేదని తెలుగుదేశం, వైకాపా, కాంగ్రెస్, వామపక్షాల నాయకులు వాదిస్తున్నారు.

08/04/2016 - 01:12

పార్లమెంట్ వేదికగా ప్రధాన మంత్రి ఇచ్చిన హామీనుంచి కేంద్ర ప్రభుత్వం తప్పించుకోలేదు. ప్రభుత్వం ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే దేశ సమగ్రత, ఐక్యతకు ప్రమాదం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై 2014 ఫిబ్రవరిలో రాజ్యసభలో ప్రధాని స్వయంగా ఇచ్చిన హామీ చట్టంతో సమానమే. ఏపి మొత్తానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఇతర రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వస్తాయనుకుంటే, అదేస్థాయి సాయానికి మరో పరిష్కారం ఆలోచించాలి.

08/04/2016 - 01:11

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వం ఉదారంగానే అనేక ప్రాజెక్టులను మంజూరు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా, రాష్ట్ర విభజన చట్టంలో ప్రత్యేక హోదాను చేర్చకపోవడానికి బలమైన కారణాలున్నాయి. రాజ్యాంగపరంగా ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే, దాని పరిణామాలు అనేకం ఉంటాయి.

08/04/2016 - 01:10

ప్రపంచంలోనే అతి బలమైన ప్రజాస్వామ్య దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పార్లమెంట్‌లో ఇచ్చిన మాటకు విలువలేక పోవడం దారుణం. మేము కోరుకోని విభజనను బలవంతంగా చేసిన సమయంలో సాక్షాత్తూ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై ప్రకటన చేశారు. ఆయన ఐదేళ్లు ఇస్తామంటే, కాదు.. పదేళ్లు ఇవ్వాలని వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ గట్టిగా తమ వాదనలు వినిపించారు.

08/04/2016 - 01:09

ప్రత్యేక హోదా సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమయ్యారు. హోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసినా తెలుగుదేశం పార్టీ ఇంకా కేంద్ర మంత్రివర్గంలో కొనసాగడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో హోదా విషయంలో అమీతుమీ తేల్చుకోవాలి. కానీ అలా చేయకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని ఆడిపోసుకుంటున్నారు.

08/04/2016 - 01:08

విభజన సమయంలో అన్ని పార్టీలూ రాజకీయం చేశాయి. రెండు రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, మార్గదర్శకాలు ఏమి చేపట్టాలన్న అంశాన్ని పెడచెవిన పెట్టాయి. అయినప్పటికీ అప్పటి యుపిఎ ప్రభుత్వం బాధ్యతతో వ్యవహారించింది. విభజన బిల్లులో అన్ని అంశాలనూ పేర్కొన్నది.

Pages