S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

07/13/2016 - 21:20

తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా విధానం పూర్తిగా దిగజారిపోయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పేద, మద్య తరగతి విద్యార్థులకు గొప్ప వరం అని ప్రచారం కెజి టు పిజి జాడ లేకుండా పోయింది. వాటి స్థానంలో తీసుకుని వచ్చిన గురుకుల, మైనారిటీ పాఠశాలల పరిస్థితి వర్ణనాతీతం. దేశంలో రెండో ధనిక రాష్ట్రంగా తెలంగాణ అని చెప్పిన ముఖ్యమంత్రి కె.

07/13/2016 - 21:18

నర్సరీ నుంచి పిజి వరకు అధిక ఫీజుల సమస్య మధ్యతరగతి కుటుంబీకులను వేధిస్తోంది. ఓ వైపు ప్రభుత్వం, మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించండి..ప్రాథమిక విద్యకు ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నాం.. ఇంటర్, డిగ్రీ, పిజి విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్ ఇచ్చాం అంటూ ప్రకటనలు గుప్పిస్తూనే ప్రైవేటు పాఠశాలల నిర్వహణకు ప్రోత్సహిస్తుంది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై చర్యలు తీసుకోవడం లేదు.

07/07/2016 - 04:32

తెలంగాణ విభజన సెగ న్యాయస్థానాలకూ తాకింది. న్యాయాధికారుల విభజనలో తమకు అన్యాయం జరిగిందని న్యాయాధికారులు, న్యాయవాదులు రోడ్డెక్కి ధర్నాలకు దిగడంతో వ్యవహారం పీటముడివేసుకుంది. న్యాయ నియమ నిబంధనలకు విరుద్ధంగా న్యాయాధికారులు ధర్నాలకు దిగడం సరికాదని రెండు దశల్లో 13 మంది న్యాయాధికారులను హైకోర్టు సస్పెండ్ చేసింది. దాంతో నిరసనలు కాస్తా ఉద్యమరూపాన్ని సంతరించుకున్నాయ.

07/07/2016 - 04:29

తెలంగాణలో న్యాయాధికారులు న్యాయం కోసం గళమెత్తారు. తమకు జరుగుతున్న అన్యాయం గురించి చెప్పినా స్పందన లేనప్పుడు న్యాయాధికారులు గళం విప్పడం మినహా మరో మార్గం కనిపించలేదు. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా న్యాయాధికారులకు అన్యాయం జరుగుతోంది. ప్రధానంగా హైకోర్టు విభజన, న్యాయాధికారుల కేటాయింపు ఆందోళన కలిగిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్ర న్యాయాధికారులను తెలంగాణకు కేటాయించారు.

07/07/2016 - 04:28

ఉమ్మడి హైకోర్టు విభజన, జ్యుడిషీయరీ విభజన అంశాలను కావాలనే పరిష్కారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. ఈ అంశాలను పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ, కేంద్రాన్ని ఏదోరకంగా విమర్శించడానికి, కేంద్రంపై బురద జల్లడానికి ఈ వివాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటోంది. ప్రస్తుతం నెలకొన్న వివాదం పరిష్కారం కావాలన్న చిత్తశుద్ధి ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు లేదనే చెప్పవచ్చు.

07/07/2016 - 04:27

హైకోర్టు విభజనకు అడ్డంకి ఏమిటో ఉన్నతస్థాయి న్యాయమూర్తులే చెప్పాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఎపిలుగా విడిపోయిన తర్వాత అన్ని శాఖలు కూడా సామరస్యంగా విడిపోతే ఎలాంటి సమస్యా ఉత్పన్నం అయ్యేది కాదు. హైకోర్టును విభజించి రెండు రాష్ట్రాల హైకోర్టులను హైదరాబాద్‌లోనే కొనసాగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గతంలోనే ప్రతిపాదించారు.

07/07/2016 - 04:26

టిఆర్‌ఎస్ అధికారం చేపడితే ఉద్యోగులకు, న్యాయాధికారులకు ఆప్షనే్ల ఉండవని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారు. కానీ అధికారం చేపట్టిన తర్వాత ఆ మాటే మరిచారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్పన్లు కల్పించారు. ఇప్పుడు తాజాగా న్యాయాధికారుల విషయంలో వివాదం నెలకొంది.

07/07/2016 - 04:26

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కోర్టులకు సంబంధించి నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చొరవ చూపాలి. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబులను కూచోబెట్టి ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గం చూడాలి. ప్రస్తుతం రగులుతున్న న్యాయవాదులు, న్యాయమూర్తుల ఆందోళనకు ఇదే తుదిపరిష్కారం. దేశంలో జుడిషియరీ ఆఫీసర్లు రోడ్డు ఎక్కడం ఇదే మొదటిపర్యాయం.

07/07/2016 - 04:25

న్యాయవాదుల సమస్యలు, న్యాయాధికారుల అధికారాలు సమన్వయ పరచేది న్యాయస్థానాలే. అలాంటి న్యాయ వ్యవస్థలో ఆందోళనలు, సస్పెన్షన్లు జరగడం దురదృష్టకరం. సమాజంలోని ఏ వ్యవస్థనైనా చివరకు ఆశ్రయించేది న్యాయవ్యవస్థనే. అలాంటి న్యాయ వ్యవస్థ రోడ్డెక్కడం విస్మయానికి గురిచేస్తోంది. ఉన్నత న్యాయస్థానం పరిష్కరించాల్సిన అంశాలను బహిరంగమయ్యాయి.

07/07/2016 - 04:24

ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రుల తీరు వల్ల న్యాయ వ్యవస్ధ కూడా రోడ్డెక్కింది. హైదరాబాద్‌ను వదిలిపెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధానికి కదులుతోంది. హైకోర్టును కూడా వీలైనంత త్వరలో ఎటూ ఏర్పాటు చేసుకుంటారు. కేంద్రం కూడా రెండురాష్ట్రాల మధ్య నలుగుతున్న హైకోర్టు అంశాన్ని పరిష్కరించడంలో విఫలమైంది. ఈ మొత్తం గందరగోళానికి కారణం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.

Pages