S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

06/23/2016 - 02:56

సెన్సార్ బోర్డుగా అంతా వ్యవహరించే కేంద్ర చలనచిత్ర ధ్రువీకరణ సంస్థ వ్యవహార తీరు మరోమారు ‘ఉడ్తా పంజాబ్’ సినిమాతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇది కేవలం ఏదో ఒక భాషాచిత్రానికి సంబంధించిన వ్యవహారానికే పరిమితమైన విషయం కాదు, దేశంలో అన్ని భాషల్లో ఏదో ఒక చిత్రం సెన్సార్ బోర్డు చట్రంలో నలిగి చిక్కి విడుదలకు సైతం నోచుకోని సంఘటనలు అనేకం. కొన్నిమార్లు ఏళ్ల తరబడి అదృశ్యమైన చిత్రాలు కూడా చాలానే ఉన్నాయి.

06/23/2016 - 02:55

ప్రభుత్వానికి సెన్సార్ చేసే అధికారం లేదు. పూర్వం సెన్సార్ బోర్డ్ ఉండేది. బోర్డును సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసిన తర్వాత ‘కిస్సాకుర్సీకా’ అనే చిత్ర వివాదంతో దాన్ని తొలగించేసారు. అంటే ప్రభుత్వానికి సెన్సార్ చేసే హక్కులేదని.

06/23/2016 - 02:54

సినిమా అనే వ్యవస్థను నియంత్రించడానికి ప్రభుత్వం ఏర్పరచిన ఓ విధానం సెన్సార్. అయితే ఆ వ్యవస్థకు వున్న రూల్స్ రెగ్యులేషన్స్ మాత్రం మంచి సినిమాకు ప్రోత్సాహాన్ని ఇవ్వడంలేదు. సినిమా నిర్మించే ప్రతి కళాకారుడికి, దర్శకుడికి సామాజిక బాధ్యత వుంది. సెల్ఫ్ సెన్సారింగ్ అనేది ప్రతి కళాకారుడికి మైండ్‌లో ఎప్పుడూ ఉండాలి.

06/23/2016 - 02:53

సెన్సార్ అనేది.. ఒక సినిమాకు రేటింగ్ మాత్రమే ఇవ్వాలి. ఈ సినిమాను అందరూ చూడొచ్చు అంటే ‘యు’, పెద్దవాళ్ళు మాత్రమే చూడాలి అంటే ‘ఎ’, లేదు పెద్దవాళ్ళతో కలిసి పిల్లలు కూడా చూడొచ్చు అంటే ‘యు/ఎ’. అంతేకాని వారికి ఇష్టం వచ్చినట్లు సినిమా సెన్సార్ చేస్తే ఎలా? ఇండియన్ రూల్స్ రెగ్యులేషన్ పద్ధతిలో ఈ సినిమాలో ఈ సన్నివేశం ఇలా వుంది, ఆ సన్నివేశంలో మాటలు ఇలా ఉన్నాయి.

06/23/2016 - 02:52

సినిమాలన్నింటికీ ఒక లక్ష్మణరేఖ అవసరం. ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యను కాంగ్రెస్, కమ్యూనిస్టులు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయి. అధికార పక్షం భావ జాలానికి చెందిన వారిని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లకు, సెన్సార్ బోర్డు ఏ సంస్థలో నియామకాలైనా విపక్షాలు అతిగా స్పందిస్తున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి భావ జాలం ఉన్నవారిని నియమిస్తున్నారని అంటున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా చేసేది ఇదే.

06/23/2016 - 02:51

సినిమాటోగ్రఫీ చట్టంలో సమూల మార్పులు చేయాలి. ప్రాంతీయ భాషల్లో నిర్మించే చిన్న సినిమాలకు అవాంతరాలు వస్తున్నాయి తప్ప, భారీ పెట్టుబడితో నిర్మించే సినిమాలకు ఎలాంటి ఆటంకాలు కలగడం లేదు. అరవై ఏళ్ల క్రితం రూపొందించిన చట్టంలో ఉన్న లొసుగులను దర్శక, నిర్మాతలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇందులో సందేహం లేదు.

06/23/2016 - 02:50

సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు, చేర్పులు చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్యాంబెనగల్ కమిటీ సూచనలను యథాతథంగా అమలుచేయాలి. సెన్సార్ బోర్డ్ అనగానే సీన్స్‌ను కత్తిరింపులు చేసే సంస్థ అన్న అపవాదు పోవాలి. ఇందుకు అనుగుణంగా ఫిలిం సర్ట్ఫికేషన్ బోర్డుగా పేరు మార్చాలన్నారు. ఫిల్మ్ సర్ట్ఫికేషన్‌లో కూడా కేవలం ఎ / యు / ఎయు అని కాకుండా మరికొన్ని క్యాటగిరీలు ఉండాలని సూచించారు.

06/23/2016 - 02:49

సెన్సార్ రూల్స్‌లో తప్పకుండా మార్పులు చేయాలి. ఎప్పటినుంచో వున్న రూల్స్‌ని ఇప్పుడు పాటించడం కరెక్టు కాదు. రోజులు మారాయి. ప్రేక్షకుల్లో కూడా చాలా మార్పు వచ్చింది. వారి అభిరుచికి తగ్గట్టుగా ఇప్పుడు సినిమాలు తీయాలి. లేదంటే వారు ఆ సినిమాలు ఎందుకు చూస్తారు చెప్పండి. నిజానికి ఈ రోజుల్లో టీవీల్లో వచ్చే సీరియల్స్, కమర్షియల్ యాడ్స్‌లో వస్తున్న సన్నివేశాలు కూడా సినిమాల్లో ఉండడం లేదంటే..

06/23/2016 - 02:48

ఉడ్తా పంజాబ్ సినిమాకు అనేక కట్స్ చెప్పినందుకే వాళ్లు రివైజింగ్ కమిటీకి వెళ్లారు. అక్కడికి వెళితే 94 కట్స్ చెప్పారు. అంటే 74 సన్నివేశాలు వుంటే అందులో 94 సన్నివేశాలు తీసేయమన్నారు. చాలా ఎక్కువ చెప్పారు. ఉడ్తా పంజాబ్ టైటిల్ పెట్టకూడదన్నారు. గోవా, గోవన్ అనే పేర్లతో డ్రగ్ మాఫియా సినిమాలు ఇదివరకే అక్కడ వచ్చాయి. పంజాబ్‌లో ఏదైతే జరుగుతుందో అదే పేరుతో తీస్తే వద్దని చెప్పడం ఘోరం.

06/23/2016 - 02:47

పైరసీ జరగడానికి వంద రకాల మార్గాలున్నాయి. నేను కూడా ‘ఉడ్తా పంజాబ్’ సినిమా చూడాలని ప్రయత్నించాను. కానీ, పైరసీ దొరకలేదు. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. 1952లో రూపొందించిన సెన్సార్ విధానాలే ఇంకా అమలులో వుండడం శోచనీయం. సెన్సార్‌వారికి మన దేశంలో రకరకాల చట్టాలు ఉండడం విడ్డూరం. అన్ని సినిమాలు అందరూ చూస్తున్నారు. హిందీ సినిమాలు చూస్తున్నారు. మలయాళ సినిమాలు చూస్తున్నారు.

Pages