S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

12/02/2015 - 20:50

ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నా, పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగాలన్నా అందుకు అధికార పక్షం ఎంతో సంయమనంతో వ్యవహరించాలి. ప్రభుత్వం, దానిలోని మంత్రులు, ఎంపీలు ప్రజా సమస్యలను పరిష్కరించాలనే సంకల్పం కలిగి ఉండాలి తప్ప ప్రతిపక్షాలను పక్కదారి పట్టించడం, రెచ్చగొట్టడం వంటి భిన్నపోకలకు పోకూడదు. గత పార్లమెంటు సమావేశాలు ఒక్కరోజు కూడా సరిగ్గా జరగలేదు. ప్రజాధనం, విలువైన పార్లమెంటు సమయం ఎంతో వృథా అయింది.

12/02/2015 - 20:48

చట్టసభల్లో చర్చలు అర్థవంతంగా జరిగినప్పుడే ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. దేశానికి మేలు జరుగుతుంది. అధికార పక్షం, విపక్షం మల్లయుద్ధం చేసుకున్నట్టు మాటల యుద్ధం చేయడానికే చట్ట సభలో పరిమితం కారాదు. క్రమంగా దేశంలోని చట్టసభల్లో చర్చల స్థాయి తగ్గి సభను అడ్డుకోవడమే ప్రధానంగా మారిపోయింది. అధికార పక్షం, విపక్షం స్థానాలు మారవచ్చు కానీ ఈ పరిస్థితి మాత్రం మారడం లేదు.

12/02/2015 - 20:47

భారత్ సెక్యులర్ దేశం, అన్ని మతాలు సామరస్యంతో ఎవరిప్రచారం వారు చేసుకుంటున్నాయి. సెక్యులర్ దేశంలో రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హక్కును ఎవరూ కాలరాయలేరు. దేశంలో ఇటీవలి కాలం నుంచి కొంత మేరకు మతపరమైన అభద్రత, అసహనం కలుగుతుందనే భావన బలంగానే వినబడుతుంది. ఈ ప్రభావం మన దేశంతోపాటు ఇతర దేశాలకు పాకవచ్చు.

12/02/2015 - 20:46

చట్టసభల సభ్యులు ప్రజల కోసం పనిచేస్తేనే వారికి గౌరవం ఉంటుంది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు కానీ రాష్ట్ర శాసనసభ సమావేశాలు కానీ ప్రజాస్వామ్య విలువలను మంటగలిపే విధంగా ఉంటున్నాయి. మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాం. ప్రజల సమస్యలపై విస్తృతంగా చర్చ జరిగితే మంచీ, చెడు ఏమిటో వెల్లడవుతుంది.

12/02/2015 - 20:45

చట్టసభలకు వెళ్లిన ప్రజా ప్రతినిధులు ఎంతో క్రమశిక్షణతో మెలిగి ప్రజల సమస్యలపై ఓపికగా మాట్లాడాలి. ఇతర సభ్యులు మాట్లాడే విషయాలను శ్రద్ధగా వినాలి. సభ జరుగుతున్నంత సేపు 120 కోట్ల మంది భారతీయులు ఒక కంట తమను కనిపెడుతున్నారని అప్రమత్తంగా ఉండాలి. ఇటీవల కాలంలో మన దేశంలో చట్టసభలు రాజకీయ పార్టీ నేతల వ్యక్తిగత అజెండా అమలుకు, ఘర్షణకు వేదికలుగా తయారయ్యాయి. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామమని చెప్పవచ్చును.

12/02/2015 - 21:01

పార్లమెంట్‌లోగానీ, అసెంబ్లీలోగానీ చర్చించాల్సిన అంశాలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కేవలం కాలయాపనతో సరిపెడుతున్నారు. పార్లమెంట్‌లో ప్రస్తుతం 300 మంది కోటీశ్వర్లు సభ్యులుగా ఉన్నారు. అలాంటప్పుడు పార్లమెంట్‌లో అర్థవంతమైన చర్చకు ఆస్కారం లేకుండా పోయింది. జవహర్ లాల్ నెహ్రు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్‌లో సోషలిస్ట్ పార్టీ, కమ్యునిస్ట్ పార్టీ, స్వతంత్ర పార్టీలకు చెందిన సభ్యులు ఉండేవారు.

11/25/2015 - 22:05

ఉగ్రవాదం, తీవ్రవాదం జాతీయ ప్రయోజనాలను విచ్ఛిన్నం చేస్తాయి. అభివృద్ధి కుంటుపడుతుంది. సమాజంలో అశాంతి నెలకొంటుంది. హింసకు ప్రతి హింస సమాధానం కాదు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ఉగ్రవాదం, తీవ్రవాదం కేవలం భారత్ లేదా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సమస్య కాదు. ఇది అంతర్జాతీయ సమస్యగా పరిణమించింది. ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణలో వామపక్ష తీవ్రవాదం మెల్లిమెల్లిగా మళ్లీ విస్తరిస్తోంది.

11/25/2015 - 22:03

ఇస్లాం మతం ఉగ్రవాదాన్ని అంగీకరించదు. ఇస్లాం మతంలో మానవతా విలువలు ఉన్నాయని, ఉగ్రవాదాన్ని ఈ మతం తిరస్కరిస్తుందని మలేషియా ప్రధాన మంత్రి నజీబ్ రజాక్ బహిరంగంగా చేసిన ప్రకటనను మన దేశంలోని ముస్లింలు, మైనారిటీ పార్టీల నేతలు, ముస్లిం మతపెద్దలు గమనించాలి. హైదరాబాద్‌తోసహా తెలంగాణలోని కొన్ని పట్టణాల్లో ఉగ్రవాద నీడలున్నాయి. కరడుగట్టిన ఉగ్రవాదులు పంజావిసురుతున్నారు.

11/25/2015 - 22:01

టైగర్ ఫారెస్ట్, జింకల అటవీప్రాంతం అంటూ మన దేశంలో ప్రత్యేకంగా అడవులు ఉన్నాయి, అలాగే హైదరాబాద్ ‘ఉగ్రవాదుల అడవి’గా మారిపోయింది. దేశంలో ఏ ప్రాంతంలో ఉగ్రవాద దాడి జరిగినా దానికి మూలాలు హైదరాబాద్‌లోనే ఉంటున్నాయి. రాజకీయ కారణాల మూలంగా ఉగ్రవాదులకు ప్రభుత్వం అనుకూలంగా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. అందుకే హైదరాబాద్ ఉగ్రవాదులకు కేంద్రంగా మారిపోయింది.

11/25/2015 - 22:00

హింసకు ఇస్లాం పూర్తిగా వ్యతిరేకం. అన్ని మతాలూ శాంతి సామరస్యాన్ని కోరుకుంటున్నాయి. దురదృష్టవశాత్తు ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా, దానికి ముస్లింలకు ముడిపెడుతున్నారు. తద్వారా ముస్లింలకు చెడ్డ పేరు వస్తున్నది. ముస్లింలు ప్రతి రోజూ నమాజు చేసేందుకు మసీదుకు వెళ్ళినప్పుడు అక్కడ మత పెద్దలు ఎన్నో హిత బోధలు చేస్తారు. అన్ని మతాలనూ గౌరవించాలని చెబుతారే తప్ప ద్వేషించాలని చెప్పరు.

Pages