S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

06/09/2016 - 04:40

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి రెండేళ్లు, కొత్త రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం, మరోపక్క అవశేష ఆంధ్రప్రదేశ్ విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్నాయి. కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం కూడా రెండేళ్లు పూర్తి చేసుకుంది.

06/09/2016 - 04:39

రెండేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలనా రంగంలో పూర్తిగా విఫలమైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయింది. అవినీతి, అక్రమాలు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ కప్పిపుచ్చుకునేందుకే నవనిర్మాణ దీక్ష పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిమ్మిక్కులు చేస్తూ ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

06/09/2016 - 04:38

కేంద్రంలో బిజెపి, ఏపిలో తెలుగుదేశం ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తూనే అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాం. విభజన తర్వాత తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటూనే సమగ్రాభివృద్ధికి తోడ్పాటునందిస్తోంది. రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం ఇప్పటికే అన్ని చర్యలు తీసుకుంది. ఇక రాష్ట్రంలో అభివృద్ధి పథకాలకు కేంద్రం చేయూత ఎప్పుడూ ఉండనే ఉంటుంది.

06/09/2016 - 04:47

తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే చరిత్ర సృష్టించే విధంగా పాలన సాగిస్తోంది. తెలంగాణ ఏర్పడితే అంతా చీకటే అంటూ పలికిన రాజకీయ నాయకుల జీవితాలు చీకటిమయం అయ్యాయి కానీ తెలంగాణ మాత్రం వెలుగుల్లో ఉంది. ఎండాకాలం వచ్చిందంటే విద్యుత్ కోతతో అల్లకల్లోలంగా మారేది. పరిశ్రమలకు పవర్ హాలిడే ఇచ్చేవాళ్లు. అలాంటిది టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత విద్యుత్ కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతోంది.

06/09/2016 - 04:35

సమైక్యాంధ్రలో అనాదిగా తెలంగాణ అన్యాయానికి, వివక్షకు గురవుతున్నదన్న భావనతో ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. దీంతో ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అప్పటి యుపిఎ ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయంచింది. కానీ రెండేళ్ళ టిఆర్‌ఎస్ పాలన అంతా ఆగమ్యగోచరంగా ఉంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నియంతృత్వ పోకడతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరగడం లేదు.

06/09/2016 - 04:34

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి రెండేళ్లయింది. పార్లమెంటు సాక్షిగా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలు కల్లలయ్యాయి. ఆరువందలకుపైగా వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అన్ని రంగాల్లోనూ విఫలమయ్యారు. తెలంగాణలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా మాటలకే పరిమితమైంది. ధనిక రాష్టమ్రంటూ ప్రకటనలేకాని వాస్తవంలో అభివృద్ధి మందగించింది. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు రాజధాని తరలింపుపై స్పష్టత లేదు.

06/09/2016 - 04:33

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలో తెలంగాణలోకుటుంబ పాలన సాగుతున్నది. మంత్రులూ ప్రేక్షకులే. ఎవరికీ అధికారాలు లేవు. మొత్తం వ్యవస్థను కెసిఆర్ తన గుప్పిట్లో పెట్టుకుని పాలన సాగిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ ఇలా వివిధ కీలకమైన శాఖలన్నింటినీ తమ ఆధీనంలో పెట్టుకుని పాలన చేస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, తనయుడు కె. తారక రామారావు కలిసి అధికారులను శాసిస్తున్నారు. కుటుంబానిదే పెత్తనం.

06/09/2016 - 04:32

తెలంగాణ ప్రజల్లో నేటికీ సెంటిమెంట్ బలంగా ఉంది. దాంతో టిఆర్‌ఎస్ గత రెండేళ్లలో జరిగిన దాదాపు అన్ని ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తోంది. అంతేకాని ముఖ్యమంత్రి కెసిఆర్ పరిపాలన అద్భుతంగా ఉందన్న భ్రమలు ప్రజల్లో లేవు. కెసిఆర్ ఏకపక్ష నిర్ణయాలు, నియంతృత్వ ధోరణిని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విపక్షాలను పరిగణనలోకి తీసుకోకపోవడం, ఉద్యమాలను అణచివేయడం బాహాటంగా కనిపిస్తున్న అంశాలు.

06/09/2016 - 04:31

తెలుగు రాష్ట్రాల్లో రెండేళ్ల పాలన ప్రకటనలకే పరితమైంది. మిగులు రాష్ట్రంగా తెలంగాణ రైతులకు, ప్రజలకు ఇచ్చిన హామీలు 90 శాతం నెరవేర్చామని చెబుతోంది. కానీ హామీల అమలును పరిశీలిస్తే 35 శాతం కూడా నెరవేర్చలేదు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి ఏర్పాటుకే సమయమంతా సరిపెట్టుకుంటోంది. హామీలు అమలు పరుస్తున్నామంటూ, కొత్త పథకాలు సత్ఫలితాలిస్తున్నాయంటూ ప్రచారానికే పరిమితమవుతున్నారు.

06/09/2016 - 04:28

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పాలనపై సాధారణ ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉంది. 2014 సాధారణ ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చేందుకు టిడిపి అధినేత చంద్రబాబు అనేక హామీలిచ్చారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని, నిరుద్యోగులకు భృతితోపాటు అనేక పథకాలు, కార్యక్రమాలు చేపడతానంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయారు.

Pages