S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

05/25/2016 - 21:27

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలలో సెక్షన్ 84(3) ప్రకారం కృష్ణా గోదావరి నదులపై నూతన ప్రాజెక్టుల రూపకల్పన ప్రణాళిక, అమలు వంటివన్నీ ఆయా నదీ యాజమాన్య బోర్డు, సిడబ్ల్యుసి అనుమతి, ఆమోదం తర్వాత మాత్రమే జరగాల్సి ఉంటుంది.

05/25/2016 - 21:26

నీరు పల్లమెరుగు... నిజం దేవుడెరుగు.. అన్నట్లు ఎగువ నుంచి వచ్చే నీటిని.. రాష్ట్రాలు.. జిల్లాలు.. ప్రాంతాలు.. చివరకు పొరుగు రైతు కావచ్చు.. ఎవరు అడ్డుకున్నా జల న్యాయసూత్రం ప్రకారం నేరం.

05/25/2016 - 21:25

నదీ జలాల వినియోగం విషయంలో దేశంలోని ఏ రాష్ట్రాల వారికీ అన్యాయం జరగవద్దు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు సఖ్యతతో ఉండాలి. రాష్ట్ర విభజన తర్వాత అనేక వివాదాలు తలెత్తాయ. వాటితోపాటే నదీ జలాల వివాదాలూ ఉన్నాయ. అయతే వీటన్నిటినీ సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఇక కృష్ణా నదీ జలాల విషయానికి వస్తే 2005లోనే అంటే ఉమ్మడి రాష్ట్రంలోనే జలాల పంపకాలకు సంబంధించిన అన్నీ నిర్ణయాలు జరిగాయి.

05/25/2016 - 21:25

ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రం ఒడిశా లేవనెత్తుతున్న అభ్యంతరాలు ఏపీ పాలిట శాపాలుగా మారుతున్నాయి. రాష్ట్రానికి అధికారికంగా కేటాయించిన నీటిని వాడుకునే విషయంలో సైతం ఒడిశా లేవనెత్తుతున్న అంశాలు దశాబ్దాలు గడిచినా ఈ ప్రాంత ప్రాజెక్టులకు మోక్షం కలగకుండా చేస్తోంది.

05/25/2016 - 21:24

జల వివాదాలు కొత్తగా వచ్చినవి కావు. ఈ వివాదాలకు సామరస్యంగా పరిష్కారం కనుగొనాలంటే చర్చలే ముఖ్యమైనవి. రెండు రాష్ట్రాల మధ్య, రెండు జిల్లాల మధ్య, రెండు మండలాల మధ్య, రెండు గ్రామాల మధ్య జలవివాదాలు రావచ్చు. చర్చలద్వారా ఎలాంటి జఠిలమైన అంశాలనైనా పరిష్కరించుకోవచ్చు. జలవివాదాలకు సంబంధించి మూడు అంశాలను ప్రధానంగా గుర్తించాలి.

05/25/2016 - 21:22

జల వివాదాల పరిష్కారానికి జాతీయ స్థాయిలో ఒక శాశ్వత విధానాన్ని కేంద్రం ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎగువన ఉన్న తెలంగాణ కృష్ణా నదిపై నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి పథకం వల్ల దాదాపు 135 టిఎంసి నీటిని శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి తోడుతారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టు సర్వనాశనమవుతుంది.

05/25/2016 - 21:21

నీటి సమస్య ఒక రాష్ట్రానికే సంబంధించింది కాదు. నీరు అందరికీ అవసరమే. దేశ వ్యాప్తంగా మనం పరిశీలిస్తే, ఒక రాష్ట్రానికీ మరో రాష్ట్రానికీ మధ్య నీటి తగాదాలను ఈ మధ్య కాలంలో ఎకుకవగా చూస్తున్నాం. మిగతా అన్ని విషయాల్లోనూ సామస్యంగానే ఉంటున్నప్పటికీ ఒక్క నీటి విషయానికి వచ్చేసరికి ఆ సామరస్యం కనిపించడం లేదు. సమస్యను రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రాలు కూడా సమన్వయంగా, శాంతియుతంగా పరిష్కరించుకోవాలి.

05/18/2016 - 23:58

దేశవ్యాప్తంగా మెడికల్, డెంటల్ కాలేజీల్లో అడ్మిషన్లకు ప్రతి అభ్యర్ధి నీట్ రాయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు . వచ్చే ఏడాది నుండి ఇది నూటికి నూరు శాతం అమలు కావడం ఖాయం. ఈ ఏడాది కొన్ని రాష్ట్రాలు మినహాయింపు కోరుతున్నాయి. ఈ మినహాయింపుపై ఇంకా స్పష్టత లేదు. నేడో రేపో ఈ అంశంపై స్పష్టత వస్తుంది.

05/18/2016 - 23:57

వైద్య విద్యా సంస్థల ప్రవేశ పరీక్ష ఇప్పటికప్పుడు నీట్ ద్వారా నిర్వహించడం వల్ల తెలంగాణకు నష్టం. కనీసం ఒక రెండేళ్ల సమయం ఇచ్చి ఈ నిర్ణయం అమలు చేస్తే బాగుటుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎంసెట్ కోణంలో చదువుకున్నారు. నగరాల్లో కొద్ది మంది మాత్రమే సెంట్రల్ సిలబస్‌లో చదువుకున్న వారు ఉంటారు. వారికి నీట్ ఉపయోగపడుతుంది కానీ గ్రామీణ ప్రాంతం వారికి ఉపయోగడదు.

05/18/2016 - 23:56

వైద్యవిద్యకు సంబంధించి జాతీయ స్థాయిలో నిర్వహించే ‘నీట్’ (నేషనల్ ఎలిజిబిలిటీ-కం-ఎంట్రన్స్ టెస్ట్) వల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు లాభమే చేకూరుతుంది. తెలంగాణ, ఎపికి చెందిన విద్యార్థులు మెడిసిన్, ఇంజనీరింగ్ తదితర పోటీ పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. నీట్‌లో కూడా మంచి ప్రతిభ కనబరుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఎంసెట్‌కు నీట్‌కు కొంత తేడా ఉంది.

Pages