S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

05/18/2016 - 23:55

నీట్ నిర్వహించడం చాలా మంచిది. అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రైవేటు వైద్య కళాశాలల పెత్తనం పోతుంది. మరోవైపు విద్యార్థుల్లో జాతీయభావం పెంపొందుతుంది. జాతీయ స్థాయిలో జరిగే ‘నీట్’తో విద్యార్థులు ఎక్కడైనా అంటే ఏ రాష్ట్రంలోనైనా సీటు సాధించవచ్చు. ఫలితంగా మిశ్రమ కలయిక ఏర్పడి, మీ, మా అనే భేద భావం లేకుండా జాతీయవాదం బలపడుతుంది. దేశంలోని విద్యార్థులంతా ఒక్క ‘నీట్’ పరీక్షకే హాజరవుతారు.

05/18/2016 - 23:54

దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లోని మెడిసిన్, బిడిఎస్ సీట్ల భర్తీ కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జూలై 24న రెండో విడతగా జరగబోయే నీట్ పరీక్ష నుంచి ఏదోవిధంగా ఆంధ్రప్రదేశ్‌కు మినహాయింపు కోసం ఆఖరి క్షణం వరకు రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతుంది. ఈ మేరకు ఇప్పటికే అభ్యర్థనలు పంపాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా ప్రధాని, కేంద్ర మంత్రులతో సంప్రదింపులు సాగిస్తున్నారు.

05/18/2016 - 23:53

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి ఎమ్సెట్ చెల్లదని, నీట్-2 రాసి తీరాల్సిందేనని ఈ నెల 9వ తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన తీర్పు తెలుగు విద్యార్థులకు పిడుగుపాటే.

05/18/2016 - 23:52

జాతీయ స్థాయిలో వైద్య కళాశాలల్లో నీట్ పరీక్షను నిర్వహించాలనే ఆలోచన మంచిదే. కాని ఒక ఏడాది ముందుగా దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తే బాగుండేది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. నీట్ పరీక్ష సిబిఎస్‌ఇ సిలబస్‌లో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ప్రాంతీయ మీడియంలో ఇంటర్‌ను చదువుతారు. వారికి జాతీయ స్థాయిలో పోటీని ఎదుర్కొనే సత్తా ఉండదు.

05/18/2016 - 23:06

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైద్య విద్యను అభ్యసించాలనుకునే వారికి నీట్ వల్ల నష్టమే జరుగుతుందని చెప్పాలి. నీట్ ఏర్పాటు చేయడం అనేది తాత్కాలిక నిర్ణయమైనా, శాశ్వత నిర్ణయమైనా తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు పెద్ద శాపంగానే చెప్పాలి. ఇప్పటికే వైద్య విద్యలో ప్రవేశానికి రాష్ట్రాలు పెట్టే ఎంసెట్ పరీక్షకు లక్షలు గుమ్మరించి ప్రిపేర్ అయ్యారు. ఆ ప్రిపరేషన్ కాస్త నీట్ ప్రకటనతో నీరుగారిపోయింది.

05/18/2016 - 23:05

మెడికల్ ఎడ్యుకేషన్ కోర్స్‌ల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా ఒకే విధమైన ఎంట్రెన్స్ టెస్ట్ ‘నీట్’ ఉండాలని అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను స్వాగతించాల్సిందే. వైద్య విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ కళాశాల ఆగడాలకు నీట్‌వల్ల తెరదించవచ్చు. వైద్య కోర్స్‌ల్లో యూనిఫామిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, యూనిఫామిటీ ఆఫ్ సిలబస్, యూనిఫామిటీ ఆఫ్ స్టాండర్డు నీట్ వల్లనే సాధ్యం అవుతుంది.

05/18/2016 - 23:04

నీట్ ద్వారా మాత్రమే దేశవ్యాప్తంగా మెడికల్ సీట్లను భర్తీ చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారనేది సుస్పష్టం. ఈ నిర్ణయంతో తెలుగులో చదువుతున్న గ్రామీణ ప్రాంత దళిత, గిరిజన వెనుకబడిన మైనార్టీ విద్యార్థులకు నష్టం వాటిల్లుతుంది.

05/11/2016 - 21:20

అత్యధిక సంఖ్యలో యువత ఉన్న దేశంగా భారత్ ప్రపంచాన్ని శాసించనుంది. రానున్న రోజుల్లో యువత ఎక్కువగా ఉన్న దేశంగా చైనా, జపాన్, అమెరికా, బ్రిటన్‌లను కూడా దాటిపోనుంది. పనిసామర్థ్యం ఎక్కువగా ఉన్నవారు, మానసికంగా బలవంతులైన యువతీ యువకులు ఈ దేశాన్ని అగ్రగామి దేశంగా కూర్చోబెట్టే గొప్ప అవకాశం రాబోతోంది. ఇప్పటికే భారతీయులు ప్రపంచంలో అన్ని రంగాల్లో ముందుంటూ, గొప్ప విజయాలను ఆవిష్కరిస్తున్నారు.

05/11/2016 - 21:20

సమాజంలో ఎలా బాధ్యతలతో, నీతి నిజాయితీగా బతకాలి అని నైతిక విలువల గురించి ప్రభోదించాల్సిన బాధ్యత మొదట తల్లిదండ్రులపైనే ఉంది. అవి నేర్పించకుండా మన పిల్లలు ఎంతో గొప్పగా, లగ్జరీగా బతుకుతున్నారంటూ సంతోషిస్తే సరిపోదు. వారి ప్రతి కదలికను ఒకకంట కనిపెడుతూ ఉంటేనే అనర్థాలు జరగవు. పిల్లలపట్ల తల్లిదండ్రులు అటువంటి జాగ్రత్తలు తీసుకుంటేనే వారూ పెద్దయ్యాక, వారి పిల్లలకూ నేర్పిస్తారు.

05/11/2016 - 21:19

ఇటీవల కాలంలో సినిమా సెలబ్రిటీలు, ఐటి రంగంలో ఉద్యోగులు, కార్పొరేట్ దిగ్గజాలు, ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల జీవితాలు చెడుకోణంలో బహిర్గతమవుతున్న సంఘటనలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. దీనికి కారణం చిన్నప్పటి నుండి ఆడంబర జీవితాలు గడపాలనే ఆకాంక్ష, వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ లేకపోవడం, నీతివంతమైన చదువులు చదవకపోవడం, తప్పుడుదారుల్లో డబ్బు సంపాదించాలన్న తాపత్రయం కారణం.

Pages