S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

04/27/2016 - 22:56

తెలంగాణ ప్రభుత్వం కరవు నివారణ పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండేళ్ల నుంచి కరవు పరిస్థితులు తాండవిస్తున్నాయి. కరవు మండలాలను గుర్తించడంలో ప్రభుత్వం అశాస్ర్తియంగా వ్యవహరించింది. అధికారులు చెప్పేదానికి , చేసేదానికి పొంతన లేదు. జిల్లా కలెక్టర్లు 328 కరవు నెలకొన్న మండలాలు ఉన్నట్లు గుర్తించారు. కానీ ప్రభుత్వం 100 మండలాల్లో మాత్రమే కరవు ఉన్నట్లు ప్రకటించింది.

04/27/2016 - 22:54

కరవు నివారణకు శాశ్వత చర్యలు కనబడ్డం లేదు. కరవును పారద్రోలడమే లక్ష్యమంటూ ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పడం తప్ప కరవు నివారణకు చేపట్టే శాశ్వత పరిష్కార మార్గాలను ఏ ప్రభుత్వాలూ చూపించడం లేదు. ఎల్‌నినో ప్రభావం గత ఏడాది, ఈ ఏడాది కనిపించింది. దీన్నిబట్టి వర్షాలు లేవు, ఎండలు తీవ్రంగా ఉన్నాయని చెప్పి ప్రభుత్వాలు తప్పించుకుంటున్నట్లు కనిపిస్తుంది తప్ప ఇందుకు అనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు.

04/27/2016 - 22:53

కరవు కోరల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది. కరవు అంచనా, కరవు మండలాల ప్రకటన, కేంద్రం నుంచి సహాయం పొందడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఇంతగా కరవు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా రాజకీయ క్రీడలకు పాల్పడుతున్నది. కరవు నివారణకు చర్యలు చేపట్టకుండా, ప్రతిపక్షాలను అణచి వేయడమే పనిగా పెట్టుకున్నది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రతిపక్షాలే లేకుండా చేయాలన్న కుట్ర చేస్తోంది.

04/27/2016 - 22:51

తెలుగు రాష్ట్రాల్లో కరవు తాండవిస్తోంది. నివారణకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు అనాలోచితమైనవి. ప్రభుత్వాలు ఏవైనా సందర్భాన్నిబట్టి నిర్ణయాలు తీసుకోవాలి. మండుటెండలు, అడుగంటుతున్న భూగర్భ జలాలు, గుక్కెడు నీరు దొరకక పల్లెజనం విలవిల్లాడుతుంటే ఇంకుడు గుంతల తవ్వకాలు చేపట్టడం ప్రజల సొమ్ము వృథా చేయడమే. వర్షాలే లేవు.. ఇంకుడు గుంతలు దేనికోసమో?

04/27/2016 - 22:50

రైతులు ఎదుర్కొంటున్న దుర్భిక్ష సమస్యలు, కొనసాగుతున్న ఆత్మహత్యలకు ఉన్న కారణాలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకుంటున్నట్టు లేదు. రుణమాఫీ అమలుచేస్తున్న తీరు రైతు రుణ కష్టాలను పెంచుతుందే తప్ప ఏమాత్రం తగ్గించడం లేదు. ప్రభుత్వం దఫదఫలుగా రైతుల బాకీలను బ్యాంకులకు చెల్లిస్తుండటంతో వచ్చే సంవత్సరం కూడా మరో నాలుగో వంతు రుణాన్ని మాత్రమే ఇస్తామని ఇటీవల శాసనసభలో గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

04/27/2016 - 22:48

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు కరవుతో విలవిల్లాడుతున్నాయి. ఈ పరిస్థితి దేశమంతా ఉంది. రెండు రాష్ట్రాల్లో దాదాపు 600 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లో కరవు సహాయక చర్యలు అంతంత మాత్రమే. రాయలసీమ, ఉత్తరాంధ్రతోపాటు తొలిసారిగా కృష్ణా, గుంటూరు జిల్లాలు కూడా కరవుబారినపడి కొట్టుమిట్టాడుతుంటే ప్రభుత్వం రైతులకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోలేదు. ఈ కరవును జాతీయ విపత్తుగా ప్రకటించాలి.

04/20/2016 - 21:45

విద్యను కొంత మంది వ్యాపారం చేశారు. విద్యా రంగం మొత్తాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. విద్యపై ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అయితే దీన్ని ప్రభుత్వం ఖర్చుగా భావించడం లేదు. మానవ వనరుల అభివృద్ధికి పెట్టుబడిగా భావిస్తోంది. అలాంటప్పుడు విద్యార్థులకు సరైన విద్య అందాలని ప్రభుత్వం కోరుకోవడంలో తప్పు లేదు. ఉద్యమ కాలం నుంచి కూడా టిఆర్‌ఎస్ విద్యారంగంపై ప్రత్యేకంగా దృష్టిసారించింది.

04/20/2016 - 21:42

తెలుగు రాష్ట్రాలతోపాటు దేశమంతా పాఠశాల విద్య నుంచి విశ్వవిద్యాలయాల వరకు యాజమాన్యాలు ఫీజులకోసం విద్యార్థుల తల్లితండ్రులను జలగల్లా పీక్కుతింటున్నాయి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తక్షణమే ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఫీజు నియంత్రణ సంఘాలను నియమించాలి.

04/20/2016 - 21:38

తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టిన తర్వాత విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తోంది. విద్యా ప్రమాణాలను పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అయితే తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఈ నెపాన్ని విద్యా సంస్ధలపై మోపి వేధింపులకు పాల్పడుతున్నది.

04/20/2016 - 21:30

కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలను అరికట్టే విషయంలో ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో వ్యవహరించాలి. ఎవరి వత్తిళ్లకు లొంగకుండా ప్రభుత్వం వీటిపై ఉక్కుపాదం మోపాలి. డబ్బులు దండుకోవడం మినహా ఇతరత్రా విద్యార్థుల బాగోగులు ఎంతమాత్రం పట్టని ప్రైవేట్ విద్యాసంస్థలను ఇప్పటికైనా ఒక దారిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Pages