S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

04/06/2016 - 21:19

వర్శిటీల ఛాన్సలర్, వైస్-్ఛన్సలర్లను ప్రభుత్వమే నియమించాలనుకోవడం నియంతృత్వమే అవుతుంది. ప్రజాస్వామ్యంలో అది సరైన పద్ధతి కాదు. వైస్-్ఛన్సలర్లుగా ప్రభుత్వం సూచించే, సిఫార్సు చేసే వ్యక్తులనే గవర్నర్ నియమిస్తున్నారు. ఇప్పటివరకు అమలులో ఉన్న ఈ విధానం సక్రమంగా లేదు కాబట్టి మారుస్తాం అని రాష్ట్ర ప్రభుత్వం అంటున్నది.

04/06/2016 - 21:18

దేశ వ్యాప్తంగా యూనివర్శిటీల్లో ఆందోళనలు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం విచారకరం. దేశ భక్తి ముసుగులో అరాచకాలు సృష్టించవద్దు. విద్యా సంస్థలకు మతం ముసుగు వేయవద్దు. దేశ భావితరానికి పునాదులు వేసే యూనివర్శిటీల్లో ఎల్లప్పుడూ ప్రశాంత వాతావరణం ఉండాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యూనివర్శిటీల్లో ఏదో రకమైన ఆందోళనలు కొనసాగుతున్నాయి.

03/30/2016 - 21:25

దేశ ఆర్థిక, పారిశ్రామిక , సామాజిక అభివృద్ధికి బాటలు వేసేది విశ్వవిద్యాలయాలే. ఆ మాటకు వస్తే ఆధునిక యుగ ఆవిష్కరణలో యూనివర్శిటీలదే కీలకపాత్ర, కాని ప్రభుత్వాలు మాత్రం ఆదినుండి విశ్వవిద్యాలయాలను అన్ని విధాలా నిర్లక్ష్యం చేస్తున్నాయి.

03/30/2016 - 21:17

యూనివర్శిటీల్లో అలర్లు.. నివారణకు మార్గాలు యువతకు దిశా, నిర్దేశం చేయడానికి విశ్వవిద్యాలయాలు ముందంజలో ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో కొన్ని విశ్వవిద్యాలయాల్లో అలర్లు చోటుచేసుకోవడం శోచనీయం. విద్యార్థులకు, విశ్వవిద్యాలయ అధికారులకు మధ్య అవగాహన లోపం వల్లనే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి.

03/30/2016 - 21:16

విశ్వవిద్యాలయాల్లో రాజకీయాల జోక్యం అధికం కావడంవల్లే అశాంతి చోటుచేసుకుంటోంది. విశ్వవిద్యాలయాలు, అధ్యాపకులు, విద్యార్థులు సమాజంలో భాగస్వాములే. టీచర్లు, విద్యార్థులకు సామాజిక స్పృహ ఉండాలనడంలో భిన్నాభిప్రాయం లేదు. రోజువారీ వ్యవహారాల్లో రాజకీయ పార్టీలు, నేతల జోక్యం ఉండకూడదు. యూనివర్సిటీలు విద్య, అధ్యయనం, పరిశోధనలకు కేంద్రాలుగా ఉండాలి.

03/30/2016 - 21:15

యూనివర్శిటీలు ఎందుకు ఉన్నాయి..?? భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించే దేవాలయాలు విశ్వవిద్యాలయాలు. ఆ దేవాలయాల్లో చదువు అనే ఒక యజ్ఞం సాగాలి. విద్యార్ధులు యూనివర్శిటీల ఔన్నత్యాన్ని, వాటి లక్ష్యాలను అర్ధం చేసుకోవాలి...యూనివర్శిటీలు రాజకీయ పార్టీల వేదికలు, తమ ఇజాలకు వేదికలు కాదు...అందుకు భిన్నంగా యూనివర్శిటీలను వాడుకోవాలని ఒక వర్గం చేసే ప్రయత్నాలను మనం సమర్ధించాలా?

03/30/2016 - 21:14

దేశ వ్యాప్తంగా ఇటీవల కాలంలో వివిధ విశ్వవిద్యాలయాల్లో అశాంతి నెలకొంది. చాలా రాజకీయ పార్టీలకు అనుబంధంగా విద్యార్థి సంఘాలున్నాయి. ఈ రాజకీయ పార్టీలు తమ భావజాల వ్యాప్తికి, ఆధిపత్యానికి యూనివర్శిటీలను వేదికగా చేసుకున్నాయి. దీనివల్ల విద్యార్థుల్లో అశాంతి, ఆందోళన కలుగుతోంది. ఈ వ్యవహారాలన్నింటిపై కేంద్ర మానవవనరుల శాఖ తక్షణమే నిపుణులతో ఒక ఉన్నతస్థాయి కమిటీని వేసి అధ్యయనం చేయాలి.

03/30/2016 - 21:13

విశ్వవిద్యాలయాలు రాజకీయాలకు నెలవు కావద్దు. అక్కడ రాజకీయాలు బోధించాలి, సమాజంపై అవగాహన కలిగించాలి అంతేతప్ప విద్యార్థుల జీవితాలతో ఆడుకునే విధంగా రాజకీయాలు చేయవద్ద. రాజకీయ ప్రయోజనాల కోసం విశ్వవిద్యాలయాను ఉపయోగించుకోవద్దు. తెలంగాణ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను సంస్కరించడానికి నడుం బిగించింది. రాష్ట్రంలో 13 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్లు లేరు.

03/30/2016 - 21:04

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పరిశోధన విద్యార్థి రోహిత్ ఆత్మహత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న విసి అప్పారావును ప్రభుత్వం తిరిగి ఎలా నియమిస్తుంది? ఒకవైపు విచారణ జరుగుతుండగా, నిందితుడిగా ఉన్న విసి అప్పారావుకు మళ్లీ బాధ్యతలు అప్పగించడం విద్యార్థులను రెచ్చగొట్టే ధోరణి తప్ప మరొకటి కాదు.

03/30/2016 - 21:03

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (హెచ్‌యుసి) జరిగిన సంఘటనలు కానీ, ఢిల్లీలోని జెఎన్‌యులో జరిగిన సంఘటనలు కానీ దాదాపు ఒకేరకమైనవి. విద్యాసంస్థలలో ఇతర శక్తులు జోరబడటంతో వల్లనే ఈ పరిణామాలకు కారణం. ఈ రెండు యూనివర్సిటీలపై కూడా స్థానిక ప్రభుత్వాల ఆజమాయిషీ లేకపోవడం కూడా అక్కడ జరిగిన పరిణామాలకు మరో కారణంగా చెప్పుకోవచ్చు.

Pages