S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

03/17/2016 - 06:52

ప్రాంతీయ పార్టీగా 1982 మార్చి 29న ఆవిర్భవించిన తెలుగుదేశం గత ఏడాది జాతీయ పార్టీగా రూపాన్ని మార్చుకుంది. ఈ ఏడాది కొత్తగా కొన్ని రాష్ట్రాల్లో పార్టీ అభిమానులను సంపాదించుకునే పనిలో పడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌సహా కర్నాటక, ఒరిస్సా రాష్ట్రాల్లో సైతం కమిటీలను ఏర్పాటు చేస్తూ దక్షిణాదిలో విస్తరణకు పూనుకుంది.

03/17/2016 - 06:50

ఒక రాజకీయ పార్టీ నుండి ఎన్నికైన ప్రజాప్రతినిధి ఎవరైనా పార్టీ మారడం అనేది నైతికత, రాజ్యాంగపరమైన అంశాలకు లోబడి ఉంటుంది. టిడిపి పరిస్థితి తెలంగాణలో ఒక రకంగా, ఆంధ్రప్రదేశ్‌లో మరోరకంగా ఉంది. తెలంగాణలో టిడిపి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అధికార టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు అధికార టిడిపిలో చేరుతున్నారు.

03/17/2016 - 06:49

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బంగారు భవిష్యత్తు వస్తుంది. ఇప్పుడు వివిధ కారణాలతో పార్టీ ఫిరాయించిన వారంతా అప్పుడు బాధపడాల్సి ఉంటుంది. డజను మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో లేదా జిహెచ్‌ఎంసి, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్లకు జరిగిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులు ఓడిపోయనంత మాత్రాన పార్టీకి భవిష్యత్తు లేదనో, ఉనికి ఉండదనో అనుకుంటే పొరపాటే అవుతుంది.

03/17/2016 - 06:48

తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఎలాంటి భవిష్యత్తు లేదు. ప్రాంతీయ పార్టీలు ఒక్క రాష్ట్రానికే పరిమితం అవుతాయి. అదే విధంగా టిడిపి ఆంధ్రకే పరిమితం అవుతుంది. ఎవరేమన్నా జరిగేది ఇదే. టిడిపిని తెలంగాణలో బతికించేందుకు మా శక్తి వంచన లేకుండా ప్రయత్నించాం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అంత విస్తృతంగా ప్రచారం చేసినా 150 డివిజన్లకు కేవలం ఒకే ఒక డివిజన్‌లో గెలవడం అంటే పార్టీ పరిస్థితి ఏమిటో అర్థం అవుతుంది.

03/17/2016 - 06:47

ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రజల ఆశీర్వాదం ఓట్ల రూపంలో ఉండాలి. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయింది. దీనికి కారణం ఆ పార్టీ తెలంగాణలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. టిడిపి ఇటీవల కాలంలో జాతీయ పార్టీగా అవతరించింది. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి హవాతో అధికారంలోకి వచ్చిన టిడిపి, తెలంగాణలో కనుమరుగైనట్లే. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో డిపాజిట్లు కోల్పోయింది.

03/17/2016 - 06:46

రాజకీయ నాయకులు పార్టీలు మారడం మంచి సంప్రదాయం కాదు. తనను నమ్ముకున్న కార్యకర్తలు, ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం ప్రజల విశ్వాసం కోల్పోతారు. కానీ తమ స్వార ప్రయోజనాల కోసమే పార్టీలను మారుతున్నారనడంలో సందేహం లేదు. ఎందుకంటే రాజకీయ పార్టీల్లో పారదర్శకత లేదు. ఒక పార్టీ బ్యానర్‌పై గెలిచి మరో పార్టీలో చేరడం మానవతా విలువలను కోల్పోవడమే. అందుకే పార్టీ ఫిరాయింపులపై సమగ్ర చట్టం తేవాల్సిన అవసరం ఉంది.

03/17/2016 - 06:45

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉంది. దేశ వ్యాప్తంగా చూస్తే ప్రాంతీయ పార్టీలు ఎక్కడా రెండు రాష్ట్రాల్లో అధికారంలో లేవు. ఉత్తరాఖండ్, జార్ఖండ్‌లోనూ అదే జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనతో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితం అవుతుంది. తెలంగాణలో అక్కడక్కడా కొన్ని సీట్లు కైవసం చేసుకోగలిగినా, అధికారాన్ని చేపట్టేంత మెజారిటీ వచ్చే అవకాశం లేదు.

03/17/2016 - 06:44

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైనట్లేనని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితికి కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయం. బీహార్ ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ విజయపరంపర కొనసాగించినా, జార్ఖండ్‌లో చతికిలపడ్డారు. ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాలకే పరిమితం అవుతున్నాయి. ఇది దేశ వ్యాప్తంగా కనిపిస్తున్న వాస్తవాలు. తెలంగాణ రాష్ట్ర సమితి ‘హవా’ ఇప్పుడు కనిపిస్తున్నా, అదే శాశ్వతంగా ఉండదు.

03/17/2016 - 06:43

దేశంలో ఎక్కడా ప్రాంతీయ పార్టీలు ఒకేసారి రెండు రాష్ట్రాల్లో పాలన సాగించలేవు. ఎక్కడో ఒకచోట మాత్రమే పనిచేస్తాయి. అది వాస్తవం. టిడిపి ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రం మొత్తం పాలించింది. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయాలు పూర్తి భిన్నంగా మారాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్ర సాధన సమితి (టిఆర్‌ఎస్)కి పట్టం గట్టారు. ఆ పార్టీనే నమ్మారు.

03/10/2016 - 03:25

ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల వేదిక భారతదేశానిదే. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి ఎన్నికల నిర్వహణలో ఎన్నో సంస్కరణలు వచ్చాయి. సంస్కరణల లక్ష్యం ఒక్కటే- దేశంలో ప్రజాస్వామ్యం మరింత పరిఢవిల్లేలా చేయడం. ఎన్నికల అక్రమాలను నిరోధించడం, అర్హులైన అభ్యర్థులు, ప్రజాసేవకులను చట్టసభలకు పంపించడం.

Pages