S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

07/30/2017 - 22:48

ఓ సాయం సంధ్యావేళ
మన తీపి జ్ఞాపకాలను
నెమరు వేసుకుంటూ
నిశ్శబ్ద తీరాన
ఒంటరి పక్షినై...
వౌన వీణ మధుర స్మృతుల
తీగలను మీటాను!
ఇంకేముంది?
చిటపట చినుకుల్లో
మనం తడిసి ముద్దై...
ముద్దుగా పంచుకున్న
అనుభూతులు...
ఎంచక్కా ఒక్కొక్కటి
నా మనోవేదికపై...
నర్తించసాగాయి!
నా అంతరంగ వాకిట
హరివిల్లును తలపించేలా..

07/30/2017 - 22:47

ఊపిరులూదాల్సిన తరుణం
స్పందించాల్సిన సంక్లిష్ట సమయం
శక్తి జాగృతమై
సోమరితనం దూరం చేసుకోవాల్సిన అవసరం
సృజన దీపమై వెలిగించాల్సిన కర్తవ్యం
కరువు వెక్కిరింతలో మొక్కతో సమాధానం
దినచర్య ఆరంభమే శ్రమదానం
దేశ భాగ్యరేఖల్ని మార్చే క్రమంలో
సుందర స్వప్న సాకార మార్గంలో
పులకించని పుడమి
ఆకులు పూలు తీగలుగా తొడిగి
ఆశలో
మహర్దశలో

07/30/2017 - 22:44

ఆకాశవాణి కళానిలయం. రకరకాల కళాకారులు, సాహితీవేత్తలు, రాజకీయ నాయకులు, అధికారులు - ఇలా పలు రంగాలకు చెందిన ప్రముఖులు రోజూ అక్కడికి వస్తూంటారు. విలువైన వారి వాణిని రికార్డు చేసి, శ్రోతలకు వినిపిస్తూంటారు. అలాంటి ఆకాశవాణిలో శంకర నారాయణ 32 సంవత్సరాలపాటు పనిచేశారు.

07/30/2017 - 22:43

భార్యాభర్తల మధ్య మూడో మనిషి (ఆడ అయినా సరే, మగ అయినా సరే) ప్రవేశిస్తే ఇక ఆ సంసారం గట్టుఎక్కినట్లే. గట్టు ఎక్కిన సంసారాన్ని సరిచేసుకోవడం ఎట్లా? ‘దిద్దుబాటు’ చేసుకోవడం ఎట్లాగో ఎప్పుడో చినప్పుడు (1910లో) కీ.శే. గురజాడ అప్పారావు పంతులుగారు చెప్పనే చెప్పారు. వేశ్యాలోలుడు అయిన మనిషిని మరల్చుకోవటానికి ఒక తమాషా ప్రదర్శిస్తుంది ఆ కథలో కమలిని. అన్ని కథలూ అంత తేలికగా దిద్దుబాటు సర్దుబాటు కావు.

07/23/2017 - 23:10

ఆర్ష సంప్రదాయ కవిత్వంలో
నాది క్రొత్త త్రోవ: నాది ఉషనిషన్మార్గం

07/23/2017 - 23:10

దిళశళఒజఒ నుంచీ నేను- కవిత్వం నిరంతర ప్రేమికులం. యూౄ ఆ్దళ ఆజౄళ జౄౄళ్యూౄజ్ఘ, పునర్ పునర్ పునర్ జన్మిస్తూ జన్మజన్మలో ఇంకా చిఖచిజ కాని ఎనె్నన్నో ఘ్శౄజఛిజషళశఆ యౄౄళశఆఒనీ, ఘ్జౄష్ఘ య్పౄళౄళశఆఒనీ కొంఛెం కొంచెంగా పంచుకుంటున్న కాముకులం. అందరూ అనుకుంటారు, కవిత్వంపై నాకున్న ప్రేమ వల్లే నాకు ఇన్ని ళఇజూఆ్దలు అని.

07/23/2017 - 23:09

నిద్రార్తి తీరకముందే
బద్దకంగానే నిద్రలేస్తారు పిల్లలు
అమ్మానాన్నల పొదిగిళ్ళలో
బాల్యం బడి - బడి బాల్యం
పర్యాయ పదాలై జంట పదాలయ్యాక
లే లేత తవ్వ కంకుల్లా
ఇల్లంతా విస్తరించాల్సిన వాళ్లు
లేస్తూనే బడి కొష్టాలకి బయలుదేరుతుంటారు
బెల్టులై షూలై బ్యాగులై
గడియారం ముల్లులై
పిల్లల్ని చుట్టేస్తుంటారు
అమ్మానాన్నలు

07/23/2017 - 23:08

వయసుకి
శే్వతపత్రం
తెల్లజుట్టు

ఫ్యాన్ గలికి
విరబూస్తోంది
టేబుల్‌పైన పుస్తకం

ఆ ఒక్కరూ
ఏం పాపం చేశారు
సెల్ఫీ

మైనస్ డిగ్రీల్లోనూ
ముచ్చెమటలు
గ్లాసుకి

శిల
తల్లి అవుతోంది
శిల్పి పురిటినొప్పులు

వాచీ టైమే చెప్తుంది
పని
దాని విలువ చెప్తుంది

07/23/2017 - 23:07

మదరాసు మహానగరంలో వుండి వచ్చాడు. నారాయణ ఒక పల్లెటూరులో స్నేహితుని యింట ప్రవాసం చేస్తున్నాడు. సినిమా కోసం చదువు పాడుచేసుకుని, సినిమా పత్రిక ప్రారంభించి సినిమా తీయాలనే ఆర్భాటంలో ఎనిమిది నెలలు గడిపి, ఆస్తి అంతా కరరావుడు చేసుకుని యిక్కడికి చేరాడు. అయినా సినిమా తీయాలనే ఆరాటం ఆగలేదు. ఏ మనిషితో మాట్లాడినా సినిమా కళను గురించి, ప్రయోగాల గురించి ప్రస్తావిస్తూ వుంటాడు.

07/16/2017 - 23:34

పేరు గుర్తొచ్చినప్పుడల్లా
ఈ చిన్ని గుండె
పెద్ద గుండై ఉప్పొంగుతుంది
ఊరు విడిచాననో, నగరీకరణలో తడిచాననో
ముఖం విప్పార్చి, ముఖస్తుతికై
అక్షరసత్యమని వక్కాణించడంలేదు

Pages