S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

12/31/2017 - 21:56

నూతన సంవత్సరానికి స్వాగతిస్తూనే
నూతన ఆలోచనల సరళిని కూడా
స్వాగతమివ్వాలి
నూతన సంవత్సరమంటేనే హృదయం నిండా
నూతన భావాలతో కూడిన ప్రణాళికలను
సిద్ధపరచుకోవడం
కొత్త ఆశయాలకు జన్మనివ్వడం

12/31/2017 - 21:55

కలం, గళం
కలగలిస్తే చైతన్యం

చైతన్యం చేవతో చచ్చిపోదా
సమస్య చిన్నదై

కాలం, కార్యం జోడిస్తే
జయం నీదే

నడిచి వచ్చేకాలం
నీ జయమై, నీలో విజయనాదమై
వచ్చే వత్సరమొస్తుంది వడి వడిగా
నూతన సంవత్సరమొస్తుంది
నూతనోత్సాహంతో
స్వాగతిద్దాం - సాధిద్దాం
*
- వెంకటేష్, కరీంనగర్

12/26/2017 - 20:50

కేంద్రంలో సకల భారతీయ భాషల ఏక సంస్కృతిని, వారసత్వాన్ని, సాహిత్య రీతులను ఆసేతు హిమాచలం ఆత్మీయం చేసే మహత్తరాదర్శంతో ప్రభవించింది కేంద్ర సాహిత్య అకాడమి. ఇప్పటికి ఇంచుమించు 66 సంవత్సరాలుగా ఈ గొప్ప సంస్థ తన ఉనికిని ప్రకటించుకుంటున్నది. కొన్ని వేల ప్రచురణలను, కొన్ని వందల సదస్సులు, గోష్ఠులు, భారతీయ విశిష్ట రచయితల జయంతులు ఈ సంస్థ నిర్వహించి ఉండవచ్చు.

12/26/2017 - 20:48

సగం చీకటి భూమిపై రాలిపడి
మిగిలిన సగం జలపాతంలా
గగనం నుండి
దూకుతున్న సమయాన
విశ్వాన్ని గర్భంలో
దాచుకున్న ఆ తల్లి
కోటానుకోట్ల సూర్యకిరణాలను
పండువెనె్నలను ముద్దలుగా కలిపి
మాయపు ప్రపంచంలోకి
రక్తపు మరకలతో ఒక కాంతిని తోసింది
ఆ కాంతి యొక్క రక్తపు మరకలు
మా దేహాలకు
రేగికంపలా అతుక్కున్న పాపాన్ని కడిగి

12/26/2017 - 20:48

మునుపెన్నండును గాంచనట్టి పగిదిన్ ముంచెత్త కోలాహలం
బనగా తెన్గు మహాసభల్ మహిని సౌహార్దమ్ము వీచన్ ఘనా
ఘనమై కావ్యమరంద మొల్కెను వియద్గంగా తరంగంబుగాన్
మన రాష్ట్రంబయె తల్లి భారతి మెడన్ మాణిక్యహారమ్ముగా

12/26/2017 - 20:46

నూరు పద్యాల సంకలనం శతకం. ఇంకొక ఎనిమిది అదనంగా చేర్చడం కూడా సంప్రదాయం. పద్యసాధనకు తొలినాళ్లలో అందరూ చేపట్టే ప్రక్రియ శతకం. శతకానికి ఛందోనియమం, మకుట నియమం, సంఖ్యా నియమం ఉంది. శతక పద్యాలను ఏ ఛందస్సులోనైనా రాయవచ్చు. కానీ శతకం ఆసాంతం అదే ఛందస్సులో కొనసాగాలి. ఏ మకుటం స్వీకరించినా, అదే మకుటం శతకం అంతా ఉండాలి. పద్య సంఖ్య నూరుగానీ, నూట ఎనిమిదిగానీ ఉండాలి. ఇదీ శతక ప్రక్రియలోని ప్రధాన లక్షణం.

12/26/2017 - 20:45

పిచ్చోడు లేని ఊరుంటదా
కుక్క కాటులేని మనిషుంటాడా
కలుపు లేని పొలముంటదా
కొంగలు విసర్జించని చెట్టుంటదా
అవమాన గాయాలను దాటినోడే
గాగనాన వేకువయతడు!

చినిగిన ఆకుల్ని కుప్పేసుకొని
వొల్ల వొల్ల దుఃఖిస్తేట్ల
అయనదానికి కానిదానికి
పక్కింటోని అనుమానించి నిందిస్తెట్ల?

12/26/2017 - 20:44

‘వీరేశలింగం, గురజాడ, రాజరామమోహన్‌రాయ్, గాంధీలు వచ్చాక భూమి బరువెక్కింది, గాలి తేలిక పడింది. సంస్కార బీజాలు యువకుల హృదయాల్లో పడి మార్పుకి అనువైన మానసిక వాతావరణాన్ని కల్పించుకుంటున్నై.. మనుషులు మారుతున్నారు.

12/17/2017 - 23:38

వెయ్యేళ్ల తెలుగు సాహిత్య నేపథ్యంలో మన వర్తమానం ఉన్నది. ఇవాల్టి ప్రాంతీయ పరిమితులు ఆనాటివారికి వర్తించవు. అలా వర్తింపచేసి సాహిత్యాన్ని దర్శిస్తే, మంచి ఫలితాలను రాబట్టలేము. క్రీ.శ. ఆరేడు శతాబ్దాలనుంచి, శాసన భాషగా తెలుగు ఉన్న దాఖలాలు రాయలసీమ శాసనాల్లో ఉన్నాయి. శాసన భాష అంటే రాజ వ్యవహారిక భాష. ఒక రకంగా గెటిట్ నోటిఫికేషన్‌లో వాడే భాష వంటిది.

12/17/2017 - 23:34

చక్కని పల్కులు జక్కని కుల్కులు జాణత సోకులు సంపదగా
చుక్కల సొంపులు సుందర తూపుల జూపుల కన్నియ సుందరిగా
అక్కజ మందుచు నందరి మెప్పులనద్భుత భాషగా ఆలతిగా
మక్కువ మీరగ మానుడి తెల్గును మాగుడి గొల్తుము మాతగవౌ

Pages