S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

11/13/2016 - 23:08

‘కథారచన ఎవరయినా చేయవచ్చును’అనే మాట ఎంత అసామాన్యమో ‘కథారచన చాల కష్టం’అనేది కూడా అంతే అసామాన్యం. ఏ ప్రక్రియనయినా తన అభ్యాసబలంచేత అలవరుచుకోగల ప్రజ్ఞ ప్రతి మనిషికీ వుంది. అయితే కొందరు రుూ ‘ప్రజ్ఞ’ను మేలుకొలుపుకోగలుగుతారు. కొందరు యిటువంటిది ఒకటి వున్నదనే విషయమే మరచిపోతారు. కథా రచనను ‘సీరియస్’గా తీసుకునేవాళ్లు తప్పనిసరిగా తెలుసుకోవలసిన సంగతులు కొన్ని వున్నాయి.

11/13/2016 - 23:07

ఆ చెట్టు -
ఆశల మొగ్గ తొడిగింది
చిగురించే జీవముంది కదా అని
బాట పక్కన నడక సాగించాలనుకుంది
గాలి ఆసరాతో.

ఎక్కడకక్కడే అపర్యావరణాల
కంచెలూ కత్తులూ
ఇక మిగిలింది
మోడు మానుల వ్యథా నిట్టూర్పులొక్కటే

ఆ నది -
ఉరుకులు పరుగులుగా పారుతూంది
బిందువులన్నీ జీవధాతువులే కదా అని
వేళ్లను తడిమే చెమ్మనవదామనుకుంది
ఆనకట్టల ఆసరాతో.

11/13/2016 - 23:04

వేళ్లను కాళ్లు చాచుకోనీ హాయిగా
బోన్‌‘సాయ’మా? అది గాయమా?
చిగురుటాకులు, చిట్టిరెమ్మలు
చేతులు చాస్తూ
గగన శ్రేణులనెక్కుతుంటే
మురిసిపోనీ
కళ్లతో చూడలేకపోతే పోనీ
నీళ్ల బాసలాడనీ!
చిగురుటాకులు చిట్టి రెమ్మలు
గాలి వాటుల పాటపాడగా
తాము చూడని వేళ్ల మేళ్లను వేనోళ్ళ పొగడగా
మనసు తీరగా పెరగనీ
మట్టి లోతులను అందుకోనీ!

11/13/2016 - 23:02

కొత్త పొద్దుపొడుపుకోసం
పొయిట్రీ
పొత్తూరి సుబ్బారావు
వెల: రూ.90/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు

11/13/2016 - 22:59

జీవితం విలువైనది..మానవ బ్రతుకులకు
వెల లేని విలువైన..వనె్న తరగని ఘనమైన
జన్మజన్మల బంధం రక్తసంబంధం
కలిమిలేమిల్ని చిన్నాపెద్దా తారతమ్యాల్ని
తాడులో పువ్వుల్లా కలిసిపో మోక దు
నీయ కమ్మని తియ్యని పాయశం లా ఏ
ల మైత్రి దూరంలో ఉన్నా అనుబంధమనే
అద్ధంలో ప్రతిబింబించే ముగ్ధమనోహర
మనోజ్ఞ మధుర సంభాషణా విదూషకులైన
విశ్వజగత్తును ఒంటిచేత్తో పాలించిన

11/13/2016 - 22:58

కుల, మత ప్రాంతీయ సమస్యలు మునుపటివలె కాకుండా నిర్ణయాత్మక, ఊహాత్మక, వ్యూహాత్మక అంశాలను మార్చుకుంటూ కొత్తదోపిడీని, దగాకోరుతనాన్ని ప్రోత్సహించడానికో తెరలేపుతుంటాయి. కొత్త పన్నాగాలతో, సరికొత్త పడగలు ఎత్తుతుంటాయి. అంతకు మిన్నగా ఊహాత్మకంగా, వ్యూహాత్మకంగా ఆలోచనా పరిధిని విస్తరించుకోకుండా సాహితీవేత్తలు వెనుకబడిపోతున్నారు. మానిన గాయాల్ని గెలకడమే సాహిత్యం అనుకుంటున్నారు.

11/13/2016 - 22:57

కవిత్వానికి నేడు కొన్ని పరిధులు నిర్ణయించి అదే కవిత్వం అంటున్నారు కొందరు. పీడిత తాడిత జనుల ప్రయోజనాలు కాంక్షించేదే కవిత్వం అంటున్నారు. దోపిడీ విధానానికి అడ్డుకట్ట వేయగలిగినదే కవిత్వం అంటున్నారు. సమాజంలోని మూఢాచారాలను ఎత్తి చూపి వాటిని సరిదిద్దగలిగినదే కవిత్వం అంటున్నారు. కవిత్వం వలన సంఘం మారుతుందా? అలా అనుకోవడం ఒక భ్రమ. కన్యాశుల్కం నాటకం వలన వృద్ధులు బాలికలను వివాహం చేసుకునే ఆచారం సమసిపోలేదు.

11/06/2016 - 21:19

ఆవల తీరమీద... అమ్మ
ఈవల తీరమీద... నాన్న
రెండు తీరాల మధ్య
కొట్లాడుతున్న తెరచాపలా... నేను!
తూరుపుదిక్కులా... అమ్మ
పడమర దిక్కులా... నాన్న
రెండు దిక్కుల మధ్య
ఒంటరి పొద్దుతిరుగుడు పువ్వులా... నేను!

11/06/2016 - 21:16

వాయువు సహిత ‘వాయవ్యం’
పడమటి వాలులోనే వున్నందుకేమో?
పడమటి గాలికి ప్రభావమెక్కువ!
అందుకే గాలి విపరీతంగా వీస్తుంది
మూసిన కిటికీలను - తలుపులను సైతం
తోసుకుని మరీ ప్రవేశిస్తుంది!
ఒక్క గాలి మాత్రమే ప్రవేశిస్తే పరవాలేదు
కాని దానితోపాటు
పాశ్చాత్యపు పైత్యాలనన్నీ పట్టుకొచ్చి
మన నట్టింట్లో నాట్యం చేయస్తోంది!
యువకులనే గాక యువతులకు గూడ

11/06/2016 - 21:13

పున్నమి వెనె్నల కురిసినట్టుగా
ఆనంద డోలికల్లో
తేలియాడే మనిషి కళ్లు
కాంతులీనుతాయి.
అవధులు దాటి
హృదయ పుటంచులనుంచి
పొంగి అలుగుబారిన
అవర్ణనీయ మనోల్లాసం
మనిషినే కాదు
ఎదుటి వాళ్లని సైతం
పరవశం చేస్తోంది.
క్రౌర్యం కుత్సిత చింతన
ఇతరుల మేలోర్వని
అసూయాపరుల కళ్లలో
కనిపించే ఆనందం మాటున
తరచి తరచి చూస్తే

Pages