S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

10/16/2016 - 23:20

మనలో ఎంతమందికి చుండూరు, కారంచేడు బాధితుల వేదన అర్థమవుతుంది? వారి న్యాయ పోరాటాలు, దేశవ్యాప్తంగా ఎలా నీరు కారిపోతుంటాయో, బడుగు ప్రజలపై జరిగే అసంఖ్యాక నేరాలలో, సామాజిక దౌష్ట్యాలలో, ఎలా కొంతమంది మాత్రమే విచారణ వరకూ వచ్చి, చాలా తేలికపాటి శిక్షలతో బయటపడుతూ ఉంటారో, చూస్తే, మనం ఒక అసమ సమాజంలో ఉన్నామని అర్థమవుతుంది. అయితే మన రాజ్యాంగం ఇలా అసమ విలువలను అంగీకరించలేదు.

10/16/2016 - 23:18

విలియం జాన్ జింగర్ చంపాడు పేదరాలు హాటీ కెరోల్‌ని
తన వజ్రపుటుంగరపు వేలు చుట్టూ చుట్టుకున్న లాఠీతో
బాల్టిమోర్ హోటల్ పానీయ శాలలో
వచ్చారు పోలీసులు, ఆయుధం వశపర్చుకున్నారు
కస్టడీలో అతనిని తీసుకెళ్లారు స్టేషన్‌కు
ఆరోపించారు విలియం జాన్ జింగర్‌పై హత్యా నేరాన్ని
కానీ మీరెవరైతే అవమానాల్ని తాత్వికబద్ధం చేసి
అన్ని భయాలను విమర్శిస్తారో

10/16/2016 - 23:17

ఆ అడవి కోడిపుంజు కూతలు
ఇంకా నీ దరికి చేరలేదా?
రోడ్డుకు అడ్డంగా కుందేలు గంతులు వేస్తోంది
వంతెన కింద నది పరవళ్ళు తొక్కుతోంది
ఈ నీలాకాశం నీడలో
నీ నవ్వుల వెలుగును చూడటం సంబరంగా ఉంది
ఈ తొలి వేకువ సమయాన, వేకువ వేళన
ఈ కొత్త ఉదయాన్ని
నీతో కలిసి చూడటం సమ్మోహనంగా ఉంది.

10/16/2016 - 23:15

కథ చెప్పేవాడు (రాసేవాడు) నిజానికి రచయితే అయినా అతను ఈ పనిని తన పాత్రల ద్వారా చేయిస్తాడు. సన్నివేశాలద్వారా సమకూరుస్తాడు. ఒక పాత్ర తను చెప్పిన విషయాన్ని- మరింత దృఢంగా నిర్థారించదలచుకున్నప్పుడు, ఆ కథ సందర్భాన్ని మరో కథ ద్వారా చెప్పిస్తాడు. కథలో కథలు, ఆఖ్యానంలో ఉపాఖ్యానాలు మన సాహిత్యంలో మొదటినుంచీ అలవాటే.

10/16/2016 - 22:04

సి.నారాయణరెడ్డి గురించి ఆయన జన్మదిన సందర్భంగాను, మరికొన్ని సందర్భాలలోను సభలు సమావేశాలు ఎన్నో జరిగాయి. ఆయన్ని గురించి తమ అనుభవాలను, ఉద్దేశాలను కొందరు వెల్లడించారు. ఆ విధంగా నారాయణరెడ్డి బహుళ ప్రచారం పొందిన కవి, రచయిత, గుర్తింపు పొందిన విశిష్ట వ్యక్తి. వాటన్నిటికి భిన్నంగా ఆయనతో వున్న 50 సంవత్సరాల అనుభవాల దృష్ట్యా కొన్ని సమాజం దృష్టికి తీసుకురావడానికి ఈ వ్యాసాన్ని ఉద్దేశించాను.

10/09/2016 - 20:48

చెప్పదలుచుకున్న కథనం చాలానే వున్నా రచయితలు ఒక్కొక్కసారి దానిని సంకుచితం చేసేస్తు వుంటారు. కార్డు కథలు, పేజీ కథలు యిలాగే పుట్టాయి. ఇటువంటి చిన్న కథను చిత్రిక అనో, అల్పిక అనో అనడం కూడా అలవాటుంది. గల్పిక మరో పెద్ద కథకాదు గాని, చివరలో ‘మెలికముడి’వేయడంతో అంతం అవుతుంది. రామాయణం కథను సంకుచితం చేసి ‘కట్టె, కొట్టె, తెచ్చె’అని మూడుముక్కలలో చెప్పి వేయడం అందరూ ఎరుగుదురు.

10/09/2016 - 20:46

నేను ప్రవాహాన్ని,
నా దారిన నన్ను ప్రవహించనీయండి..
నాకో కొత్త పేరు, చిరునామా ఇవ్వకండి!

నన్ను వెనక్కి పిలవకండి,
ఫలానాచోట, ఫలానా సందర్భంలో
ఏం జరిగిందో చెప్పమని అడక్కండి..
నన్ను సాక్షిని చేయకండి, నన్నాపకండి!

10/09/2016 - 20:45

‘‘మాటాటా’’ గుహల పర్వత పాదాల వద్ద
సంగమించిన నదితో సముద్ర కరచాలనం
ఒక అపూర్వ సగర్వ సందర్భం!
అపుడు నీవు- నా సముద్రానివి, నా స్రవంతివి
అక్కడ నేను- నీలో
ఆ వాగూ వారాశుల చిరాలింగనంలో
పక్షులు వీక్షిస్తున్న
ఆకలి ఎద అలలను అల్లుతున్న రాత్రిలో
అదొక ఉపశమించని వెచ్చని కౌగిలి
మన అపేక్షల అంతస్సులను ఆవరిస్తూ
నది పాడిన యాత్రాగీతం

10/09/2016 - 20:43

మడికట్టు
దేహం విచ్చిన నెర్రెలతో
ఆకలి సుడిగాడ్పై రివ్వుమంటది

ఇరిగిన నాగల్ని
భుజానికెత్తుకున్న
యేసుక్రీస్తులా వాడు

తనకు పానమైన
వానకోసం
కరిమబ్బుల్ని రప్పించుకోలేని
శిక్షించనూ లేని
అబలుడు వాడు

పెట్టుబడి
మోసం చేస్తదని తెలిసినా
కాలంమీది నమ్మకంతో
చంద్రమతి హారాన్ని
దడ్వత్ పెట్టిన దీనుడు వాడు

10/09/2016 - 20:41

వాగర్థ
(ఆధునిక సాహిత్య వ్యాసాలు),
రచయిత: డా శిఖామణి,
వెల: రూ.120,
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు

Pages