S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

10/03/2016 - 04:28

ఏ భాషా సాహిత్యంలోనైనా వీరువారనకుండా అందరినీ అలరించే, ఆలోచింపజేసే ప్రక్రియ ‘నాటకం’. చదువు అక్కరలేదు, చదవనక్కరలేదు, కళ్ళు, చెవులుంటే చాలు నాటకం సొంతమవుతుంది. పాత్రల సంభాషణల ఆధారంగా కథ సాగిపోయే ఈ ఆబాల గోపాల మనోరంజకం క్రమంగా కనుమరుగవుతున్న సంకేతాలు వర్తమాన తెలుగు సాహిత్యంలో స్పష్టంగా కనిపిస్తున్నాయంటే నిష్ఠురంగా అనిపించవచ్చు. నాటక రచన సాలు సాగుతూ ఉంటేనే రంగస్థలంపై దీపాలు వెలుగుతాయి.

10/02/2016 - 23:00

అవధాన విద్యా సర్వస్వము
రచన: డా. రాపాక ఏకాంబరాచార్య
పుటలు: 1100, వెల: 1000=00;

10/02/2016 - 22:12

కథా రచయిత కూడా మొదటిలో కథా చదువరే. ఎక్కడో ఓ మంచి కథ చదివిన తరువాత అతనికి కూడా కథలు రాయాలనే సంకల్పం కలుగుతుంది. తనకు తెలిసిన జీవితాన్ని గురించి కథలు వ్రాస్తాడు. చదువరిగా అతనికి వున్న పరిణతిని ఆధారం చేసుకుని ప్రపంచ పోకడలు అర్థంచేసుకుంటాడు. కథలు రాయటానికి ఉబలాటం ఒక్కటే వుంటే చాలదు తెలుసుకుంటాడు. ప్రతి కథలోనూ యేదో సందేశం. స్పష్టంగానో సూచనగానో కనిపించాలి.

09/25/2016 - 22:14

సంధ్యనుపాసిస్తున్న
నన్ను
‘‘మసక నిశ్శబ్దం’’ చుట్టేసుకొంది
సూర్యుడావలించి అటు వెళ్తూ వెళ్తూ
ఎంత విషాద మోహనంగా చూశాడని
కలల పరిమళాన్ని మేలుకొలిపే
మంత్రనగరి పొలిమేర వైపు...

09/25/2016 - 22:12

వాఙ్మయ చరిత్రకారుడికి కులతత్వం వుండకూడదు. భావజాల సంకుచితత్వం వుండకూడదు. సమకాలీన ద్వేషం ఉండకూడదు. ప్రత్యర్థి భావజాలాన్ని కూడా స్వీకరించగలిగిన ధైర్యం కావాలి. విమర్శను సహించగలిగిన ఓర్పు, సమ్యక్ దర్శనం కావాలి. ప్రత్యర్థిని అర్థం చేసుకోవడం వల్లే తన వ్యక్తిత్వాన్ని పెంచుకోగలగాలి (పుట-240). కొందరు ఎక్కువ చదువుతారు. రాయలేరు. కొందరు ఎక్కువ రాస్తారు. దానివెంట అధ్యయనం ఉండదు (పుట.446).

09/25/2016 - 22:09

కులమతాలు గీచుకున్న గీతలుజొచ్చి
పంజరాన కట్టువరను నేను
నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు
తరుగులేదు విశ్వనరుడ నేను
(జాషువ: నేను)

09/25/2016 - 22:16

చిన్నారుల నవ్వుల్తో
ఇంద్రధనసు వంతెనల్ని
కడుతున్నాను
స్వేచ్ఛాగీతాల్ని సరిహద్దులు దాటించేందుకు
పావుర సైన్యాన్ని పెంచుతున్నాను
వసంతాల సుమగంధాలను శ్వాసిస్తూ
ఎడారిలో మోడుల్ని
పల్లవింపచేస్తున్నాను
గుండె వంతెనలో
జలధారల్ని ఒడిసిపడుతూ
కాల్వల్లోకి తోడేస్తున్నాను
పరవళ్లు తొక్కే నదినై
బీళ్లకు పచ్చదనాన్ని అతికిస్తున్నాను

09/25/2016 - 22:04

భారతదేశం ఒక సంయుక్త దేశంగా తీసుకుంటే, మనకు మంచి కథకులు వున్నారు. భాషలు ఎక్కువ, ప్రాంతీయతలు ఎక్కువ కనుక మనకు భాషా రచయితల, ప్రాంతీయ రచయితల పరిమాణం ఎక్కువ. ఒక భాష రచయితే ఆ భాష చదివే అన్ని రాష్ట్రాలలోను గణనకు రాడు; గమనానికి రాడు. విభేదాలు, వితరణలలో వున్న వ్యత్యాసాలవల్ల రుూ విపర్యయం జరుగుతుంది. ఒక భాష రచయిత యితర భాషల లోనికి తేలికగా అనువాదం కాడు. మాండలికం అడ్డం వస్తుంది.

09/19/2016 - 00:29

కొత్తగా నవలలు రాసే రచయితలను ప్రోత్సహించే ఉద్దేశంతో నవలాకారులు రచించిన తొలి నవలలకు ప్రథమ బహుమతిగా 10వేల రూపాయలు, ద్వితీయ బహుమతిగా ఐదువేల రూపాయలు ఇవ్వనున్నట్లు అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్టు ప్రకటించింది. ఈ పారితోషికాన్ని నవీన్ జన్మదినోత్సవమైన డిసెంబర్ 24న ప్రదానం చేయనున్నట్లు తెలిపింది. తెలుగులో రచించబడిన నవలలే ఈ పురస్కారానికి అర్హమైనవి.

09/19/2016 - 00:26

తెలుగు సాహిత్య చరిత్ర
భాష, సామాజికత, కులాధిపత్యం
పుటలు: 528, వెల: రు.500-00
: ప్రతులకు :
కత్తి స్వర్ణకుమారి
లోకాయత ప్రచురణలు,
లుంబినీవనం, అంబేద్కర్ కాలనీ
పొన్నూరు- 522 124

Pages