S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

09/25/2016 - 22:04

భారతదేశం ఒక సంయుక్త దేశంగా తీసుకుంటే, మనకు మంచి కథకులు వున్నారు. భాషలు ఎక్కువ, ప్రాంతీయతలు ఎక్కువ కనుక మనకు భాషా రచయితల, ప్రాంతీయ రచయితల పరిమాణం ఎక్కువ. ఒక భాష రచయితే ఆ భాష చదివే అన్ని రాష్ట్రాలలోను గణనకు రాడు; గమనానికి రాడు. విభేదాలు, వితరణలలో వున్న వ్యత్యాసాలవల్ల రుూ విపర్యయం జరుగుతుంది. ఒక భాష రచయిత యితర భాషల లోనికి తేలికగా అనువాదం కాడు. మాండలికం అడ్డం వస్తుంది.

09/19/2016 - 00:29

కొత్తగా నవలలు రాసే రచయితలను ప్రోత్సహించే ఉద్దేశంతో నవలాకారులు రచించిన తొలి నవలలకు ప్రథమ బహుమతిగా 10వేల రూపాయలు, ద్వితీయ బహుమతిగా ఐదువేల రూపాయలు ఇవ్వనున్నట్లు అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్టు ప్రకటించింది. ఈ పారితోషికాన్ని నవీన్ జన్మదినోత్సవమైన డిసెంబర్ 24న ప్రదానం చేయనున్నట్లు తెలిపింది. తెలుగులో రచించబడిన నవలలే ఈ పురస్కారానికి అర్హమైనవి.

09/19/2016 - 00:26

తెలుగు సాహిత్య చరిత్ర
భాష, సామాజికత, కులాధిపత్యం
పుటలు: 528, వెల: రు.500-00
: ప్రతులకు :
కత్తి స్వర్ణకుమారి
లోకాయత ప్రచురణలు,
లుంబినీవనం, అంబేద్కర్ కాలనీ
పొన్నూరు- 522 124

09/19/2016 - 00:19

కరువైనా
బరువైనా
నాకు తీరేది కాగితమీదే.
మబ్బులు ముసిరినత
మనసులాగ కాదు
హంసలు కప్పిన సరోవరంలా
వుంటుంది కాగితం.

కలంనుండి రాలుతున్న
అక్షరాలను ఎక్కడ దాచుకోవాలి!
జేబులో కుక్కితే
డబ్బు వాసన సోకి
అసలు అస్తిత్వాన్ని కోల్పోవచ్చు.
పిడికిట్లో బిగపడితే
వాటి వేడికి
చెయ్యి కాలిపోవచ్చు
కాగితమే శరణ్యం నాకు.

09/19/2016 - 00:08

కథకు మొదలు మధ్య చివరో వుండాలి. అయితే యివి రుూ వరసలోనే వుండవలసిన అవసరం లేదు. కథ చివరలోనే మొదలయి కథనం తరవాత వివరించడం జరగవచ్చును. మధ్యలో మొదలుపెట్టి పూర్వాపరాలు క్రమంగా- సక్రమంగా జరగవచ్చును. మధ్యలో మొదలుపెట్టి పూర్వాపరాలు - సక్రమంగా చెప్పవచ్చును. వస్తువు (విషయం ఆసక్తికరంగా వుంటే ఎలా చెప్పినా దోషం లేకుండా చదువుకుంటాడు పాఠకుడు.

09/19/2016 - 00:03

తీరంపై వెలుగుతున్న కాగడాలు వీడ్కోలు పలికాయి
ఎక్కువ సమయం లేదు- వెంటనే జీవించడం ప్రారంభించాలి..
ఈ రాత్రంతా ఒకటే కలత, జవాబును మింగేసిన కన్నీటి సంద్రం
చిట్టచివరి ఆధారం ఆశగా బ్రతికించమని బ్రతిమాలింది..
వెన్నంటి నిలచే ధైర్యానికన్నా వెన్నుపోటుపొడిచే భయమెక్కువ
హోరుగాలికి తెప్పల్లో లాంతర్లు మిణుకు మిణుకుమంటున్నాయి!

09/19/2016 - 00:00

‘‘నవ్యాంధ్ర కవిత్వ శుభోదయానికి గురజాడ అప్పారావు వేగుచుక్క’’ అని అంటారు ఆండ్ర శేషగిరిరావుగారు. అంటే గురజాడవారి సాహితీ ప్రతిభ ఎలాంటిదో మనకు అర్థమవుతోంది. గురజాడవారు ‘‘ముత్యాలసరాలు’’ 1910లో రాసి నవ్య కవితకు నాంది పలికారు. ‘‘కన్నుగానని వస్తుతత్వము కాంచనేర్పరు లింగిరీజులు, వారి విద్యలు కరచి సత్యమరసితిన్’’అని చెప్పిన గురజాడ ఆధునిక ప్రపంచపు పోకడలని అర్థం చేసుకున్నారు.

09/11/2016 - 23:25

సాధారణంగా పుస్తకాలు, పత్రికలు చదివే వాళ్లందరికీ ‘కథలు’ చదవడంలో అభిరుచి, అభినయం వుంటుంది. ఈ చదవడంలో కొన్ని యిబ్బందులు కూడా వున్నాయని అందరికీ అందుబాటులో వున్న విషయమే. ఒక్కో కథ చదివిన తరువాత ‘ఎందుకు నా సమయం యిట్లా వృధాజేస్తున్నాను, యింతకన్నా నోరు మూసుకుని పడుకుని వుంటే విశ్రాంతి అయినా దక్కేదికదా!’ అనిపిస్తుంది.

09/11/2016 - 23:10

దేశ్‌ముఖ్ జమీందార్ల
దోపిడీతనాన్ని
పొలిమేరలు దాటేలా
తరిమి తరిమి కొట్టిన
వొడిసెలు పట్టిన చేతులు
ఇప్పుడు ఏమయ్యాయ?

రాచరికపు భూకామందుల
నిరంకుశ పోకడలను
తుపాకీ తూటాలను
గుండె నిబ్బరంతో
ఎదురొడ్డి నిలిచి
మృత్యువును ముద్దాడుతూ
ముందడుగు వేసిన
పోరాట పటిమలు
ఇప్పుడు ఏమయ్యాయ?

09/11/2016 - 23:08

ఆలోచనకు రూపు లేకపోవచ్చు
మనిషిని కాలాంతరాల్లోకి తీసుకెళ్ళగలిగే
నిర్దుష్టమైన చూపు అది.
ఆ దృష్టి ప్రసరణ సాగినంత మేర
నూతనత్వం మట్టి పరిమళాల్ని వెదజల్లుతుంది.
ఆలోచన తొలకరి చినుకై కురిసి
మస్తిష్కం పొలాన్ని సుసంపన్నం చేసే
జలధారౌతుంది.
అది చీకటి చీల్చుకొచ్చే
మిణుగురు కాంతిలా పుట్టి
ఇంద్రధనుస్సులోని వర్ణాల్లా

Pages