S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

07/17/2016 - 20:52

కథావస్తువు అనేది లేకపోతే అసలు కథే లేదు. అయితే వస్తువు, దాని నాణ్యతతోపాటు కథ ఎలా చెబుతున్నాం- కథాకథనం అనిపేరు దీనికి- అన్న విషయం మరింత ప్రధానం.

07/17/2016 - 20:45

బయట మంచు తునకలు
గుండెల్లో నిప్పుకణికలు
వెలుపల వెనె్నల సోనలు
హృదయాంతరాలలో వేడి నిట్టూర్పులు
అతి చల్లగా సోకుతున్న శీతల వాయువులు
అపాద మస్తకం ప్రకంపనాల ఆవిర్లు
సుతిమెత్తని పరుపుపై సుఖాసనాలు
మొన తేలిన కఠిన శిలలపై కూర్చున్న చందనాలు
సెలయేటి తుంపరుల్లా ఆలోచనా పరంపరలు
దేహ పర్యంతం భీతావహ స్వేద బిందువులు

07/17/2016 - 20:43

కంట్లో జీవనదిని
ప్రవహింపజేసిన భగీరథుడెవరో
పెదవుల్ని యిసుక తినె్నలు చేసి
చిరునవ్వు తీవెల్ని రాల్చి
పచ్చని నేలపైన
విచ్చుకున్న చల్లని వెనె్నల పూలని
వెచ్చని వడగాడ్పులకు బహూకరించి
రాత్రి కలల నిండా
ఎడారుల బిడారుల్ని అలంకరించి
నేలకి చీకటి దుప్పటి కప్పిన మహర్షి ఎవరో
శోకాన్ని అశోక వృక్షపు పాదులో
సోమధారగా సేచనం చేసి

07/17/2016 - 20:41

కవిత్వమంటే తెచ్చిపెట్టుకునే ఆవేశాల వ్యక్తీకరణ కాదని, గ్రహించడానికయినా నవ కవులు, రచయితలు తప్పనిసరిగా, కళా విలువల ప్రాశస్త్యాన్ని అర్థం చేసుకోవడానికైనా ప్రాచీన రచనల్ని విరివిగా అధ్యయనం చేయడం మంచిదేమో.. కవిత్వం రాయాలన్న ఆరాటంతోపాటు, కంటికి కనిపించిన ప్రతీదానిని కవిత్వంగా చెప్పాలన్న తపన ఒక్కటే ఉంటే చాలదు. ఆ కవిత్వంలో అవసరమైన గాఢతను కోల్పోకుండా, కవిత్వ నిర్మాణంలో జాగ్రత్త వహించాలి.

07/17/2016 - 20:37

ఉదయాస్తమయాల్లోని
సూర్యబింబంలా నిగనిగలాడుతూ
అరుణకాంతుల ఆపిల్ పండ్లు
కామధేనువు నిండు పొదుగుల్లా
బరువుగా వ్రేలాడే ద్రాక్షా గుళుచ్ఛాలు
అర్థవలయంలో అమరిన
బంగారు కణికల్లా అరటిపండ్లు
కనువిందు చేస్తూ పసందుగా ఎన్నో పండ్లు
అవేవీ చెట్టు తల్లి పెంపకంలో
పక్వమైన ముగ్ధ ఫలాలు కాదు!

07/10/2016 - 23:14

1. ఒంటరి రాత్రి
Clash of the cosmos
conflict of the worlds జరిగాక
తలపుల ఇంటి తలుపుల ఎదురుచూపు
యెంత దూరమో తెలీదు కానీ
ఆకాంక్షల నది సలసల కాగుతూ
నురగలు కక్కుతూనే ఉంటుంది

07/10/2016 - 21:01

ఒక అదృశ్య రేఖ
రెండు ఎర్రని రేఖల్లా విచ్చుకునే సమయానికై వేచి
ఆమె నా చేతిలో ఒక కొత్త పుస్తకముంచింది...

తెల్లవారితే ముఖ చిత్రం చూస్తానా
ఏ మూలనో వున్న కల్మషమంతా ఎగిరిపోతుంది

07/10/2016 - 22:56

13-6-2016 నాటి సాహితిలో బిక్కి కృష్ణగారు ‘తెలుగు సాహిత్య దౌర్భాగ్యం’ కారణంగా నిబద్ధత ప్రశ్నార్థకమైన, అల్పమతులైన కవులు రచయితలు, కులం, ప్రాంతం, అస్తిత్వం, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అంటూ రంకెలేస్తూ సృజనకారులు గ్రూపులుగా, కూటాలుగా విడిపోతున్నారని బాధపడ్డారు. కారణం తెలియదుగాని వారు మచ్చుకైనా ఏ ఒక్కరికీ మినహాయింపునివ్వడానికి ఇష్టపడలేదు.

07/10/2016 - 23:01

ఉత్తమ లక్ష్యాలమీద అభిలాష అడుగంటిపోయింది. ఒకనాటి నిర్మోహ త్యాగాలు ఇవాళ కొఱగాని కథలయ్యాయి. విశ్వాసం వీగిపోయి తర్కం తలెత్తింది. భావమగ్నం కాని భాష కవిత్వమై ‘పెత్తనం’ చెలాయిస్తోంది. జులాయితనం విశ్వమతైక్య చిహ్నంగా నిర్థారించబడుతోంది. శీలభావం భావవీలమై వరవడి గుడింతాలు దిద్దబడుతోంది. ఎవరి చిత్త వికారం వారిదైన ఒక నూత్న సంప్రదాయాన్ని ప్రతిష్ఠ చేసి పరివ్యాప్తమవుతోంది.

07/10/2016 - 23:16

‘కథ’లో కథ ప్రధానం. కథ ముందుకు కదలాలి. పాత్రలతోపాటు చదువరి గమనాన్నికూడా ముందుకు తీసుకుపోవాలి. పాత్రలతోను, కథాగమనంతోను చదువరి ‘మమేకం’ అయిపోవాలి. ఇది ఒక పద్ధతి అయితే- దానితో సంబంధంలేకుండా చదువరి వ్యక్తిత్వాన్ని మటుమాయం చేయకుండా కథ నడవడం మరో పద్ధతి. కథతో కలిసిపోవడం, కథను దూరంగా గమనిస్తూ వుండిపోవడం అనేవి రెండూ వేరువేరు మార్గాలు. వీటిలో యేది మంచిది, ఉత్తమమయినదీ అని స్ఫుటంగా చెప్పలేము.

Pages