S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

06/19/2016 - 20:58

వెలుగు వెల్లువ రాకుండానే
కడుపు నిండా కొత్త కబుర్లతో
రెపరెపలాడుతూ వేకువ పిట్టలా
మా ముంగిట్లో వాలుతుంది!
విభిన్న కథనాల జ్ఞాపకాలతో
గతం ఒడిలో ఒదిగిపోవడానికి
పయనమవుతున్న ప్రపంచాన్ని
నా కళ్లముందు సాక్షాత్కరింపజేస్తుంది!
నా చుట్టూ ఏం జరుగుతుందో
నాకు తెలియకుండానే పసిగట్టి
నన్ను అప్రమత్తుణ్ణి చేస్తుంది!
విజ్ఞాన విహంగాలై విహరిస్తున్న

06/19/2016 - 20:56

రహదారి కూడళ్ళలో కూలీ వ్యధలు
అరణ్య రోదనలు మించిన ఆర్తనాదాలు
అరుణోదయంతో అంకురించు వెతల గతులు
ఆటోలకై బస్సులకై రైళ్ళకై ఆదుర్దా అరపులు
పనీ... పనీ... అని పయనపు ప్రణాదములు
పరువు కోసం పసాదం కోసం ప్రాకులాడే పరిదేవనములు
దొరా! ధనీ! అని బిక్కముఖంతో బతిమాలటాలు
అయ్యా! సామీ!.... అనీ అర్ధింపు ఆకలి అరపులు
మధ్యవర్తుల నిరీక్షణలో మతిభ్రమించిన కబుర్లు

06/19/2016 - 20:55

కొద్దిగా సహనం కావాలి.. అంతే
చుట్టూ అత్యంత సహజంగానే,
దానంతటదే జరుగుతున్న ప్రతి సందర్భాన్నీ
సంయమనంతో, ఓపికతో,
నిరామయంగా చూస్తూ స్వీకరించడానికి
నీకు కొద్దిగా సహనం కావాలి -

06/19/2016 - 20:52

కథావస్తువు ఏమి వుండాలి - అన్న విషయం రాయదలచుకున్నవాళ్ల అభిరుచిమీద ఎక్కువగా ఆధారపడి వుంటుంది. వాళ్ళు ఎవరిని ఉద్దేశించి రాస్తున్నారో ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి. పిల్లలకు పనికివచ్చే నీతి కథలు రాస్తున్నవాళ్లున్నారు, వయసులో వున్నవాళ్లను అలరించి ఆదరించే కథలు వ్రాసే వాళ్లున్నారు. సంసార సంబంధమయిన సమస్యలను గురించి వ్రాసే వాళ్లున్నారు.

06/19/2016 - 20:46

అమరావతి కైఫీయతు;
వెల: రూ.125/-
ప్రతులకు: విశాలాంధ్ర - నవచేతన

06/19/2016 - 20:44

మాజిక్ రియలిజమ్ ఈ పేరు వింటేనే అంతా మాయ, జగమే మాయలాగా అనిపిస్తుంది... అవును మరి ఆ మాటలకున్న మంత్రమే అలాంటిది. మరి అలాంటి మంత్రనగరి ద్వారా గ్లోబలైజేషన్, నాగరికతల ముసుగులో నేడు స్ర్తిలు ఎదుర్కొంటున్న అత్యాధునిక అణచివేతకి దర్పణం పి.సత్యవతి మంత్రనగరి. - మాజిక్ రియలిజమ్ లేదా మాయా వాస్తవికత, మంత్రిక వాస్తవిక ఇలా ఏ పేరుతో పిలిచినా ఇవి కళతో ముడిపడి వున్న మాజిక్ అంశాలు.

06/12/2016 - 22:11

గది నిండా వాన తడిముగ్గు గీసింది
అన్నం పాత్రలలో వాన నదిలా వొదిగింది -
నగర, ఆకాశంపై వానపక్షులు
నోరారా పిలిస్తే గొంతుపై వాలతాయి -
వానకు, తళతళ మెరుస్తున్న గోడపై
పడవ బొమ్మను చిత్రిస్తున్న చిన్నారి చేతులు
పడవ ఎక్కేందుకు నిరీక్షిస్తున్న వాన తడిపిన శరీరాలు -
కిటికీ రెక్క తెరిచి చూడు
వాన హరివిల్లులా వంగి లోపలికి వస్తుంది -

06/12/2016 - 22:09

కాలం వెనుక దాగున్న
రహస్యాన్ని ఎవరు
విప్పి చెప్పగలరు?
ప్రజల నానుడి
నొక్కిపెడుతున్న
పాలకులకు
బడికంటే ఈరోజు
గుడి మాత్రమే నడవడి సూత్రం!

06/12/2016 - 22:06

నేనొక జీవ నదిని
కనాలని కలగంటున్నాను...

నేల నలుచెరగులా కలియ తిరిగి
జీవితాన్ని ఎప్పుడూ
తడితడిగా వుంచే సెలయేరుని
కనాలని కలగంటున్నాను

ధర్మాన్ని బహిరంగ పరిచి
మానవ మతాన్ని నిర్మించే
ఒక ఏలికను,
నిష్కల్మషమైన మహావీరుల్ని
కనాలని కలగంటున్నాను

06/12/2016 - 22:04

కందాన్ని అందంగా రాస్తే
డెందం పులకిస్తుంది
ఉత్పలాలను చంపకాలతో కలిపి
స్రగ్విణులకిస్తే ఎంత బాగుంటుంది?
అప్పుడు తేటగీతులు అల్లుకోవచ్చు
మూసలో పోసే సీసాలతో పనిలేదు
అచ్చమైన సీసం
మోసుకొస్తుంది అమృతం
శార్దూలాలతో ఆడుకోవాలనుకుంటే
మత్త్భాలపై ఊరేగాలనుకుంటే
పంచచామరాల వీవనలతో
భవ్యమైన సేవలను పొందాలనుకుంటే
లయగ్రాహిత్వం అవసరం

Pages