S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

05/22/2016 - 20:47

సామాజిక పరిణామక్రమంలో మనిషి జీవితం గత రెండు దశాబ్దాల నుండి మరింత విధ్వంసానికి గురవుతోంది. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా అవే స్థితిగతులు, అవే సంక్షోభాలు, అవే గాయాలు భారతదేశం నిండా పర్చుకొని ఉన్నాయి. సకలాన్ని ధ్వంసం చేస్తోన్న వర్తమాన పరిస్థితితో చీకటి ఊడలు మనిషి మూలాల్లోకి దిగిపోతున్నాయి. అది తెలంగాణ అయినా, ఉత్తరాంధ్ర అయినా, రాయలసీమ అయినా ఇవే సంకీర్ణ దృశ్యాలు కనిపిస్తాయి.

05/16/2016 - 00:43

........................
ధ్వనికి తగిన లిపి సంకేతాలను సంస్కరించి ఏర్పరచుకొన్న భాష తెలుగు.
అనవసర లిపి సంకేతాలు లేవు. లిపి సంకేతాలను ఎన్నిసార్లు వాడగలమన్న దానికన్నా ఎంత స్పష్టంగా ఉచ్చరించగలుగుతున్నామన్న అంశానికే ప్రాధాన్యత.
.........................

05/16/2016 - 00:39

ప్రేమికుల భాష
చిరుగాలిలా ఉంటుంది
సంభాషణా సంద్రంపై సాగే అలల్లా...

కురుస్తున్న ప్రేమ వెనె్నల్లో
అస్తిత్వంలోనే దేహాలు
ఆత్మలు ముడిపడే ఉంటాయ
పూల పరిమళం
ఉంటుందేమో వారి మాటల్లో...
ఎవరికి తెలియని మార్దవం కూడా...

స్పందన ప్రతిస్పందన ఒకే శ్వాసలో...
ఉరుకుల పరుగుల బతుకుల్లో
ప్రేమ చోదక శక్తి...
మనిషిని బతికించేదీ...

05/16/2016 - 00:24

ఒక్క జల బిందువు
వేనవేల ‘హైడ్రోజన్ మోనాక్సైడ్’ల
సంలీనమే కాదు
ఒక్క నీటి బొట్టు
కోటాను కోట్ల ప్రాణుల
ప్రాణ సమం
భూ పొరల్ని
తడమాల్సిన తడి
కనురెప్పలకీ పహరా కాస్తోంది
బోరుబావుల టార్చులైట్లు
వేసి వెతికినా
జలం జాడ దొరకడం లేదు
అంతరంగానికి ముసుగేస్తే
ముఖాన చిర్నవ్వు పువ్వు
పూస్తుందేమో గానీ-

05/16/2016 - 00:22

నువ్వు నువ్వులా కాకుండా
గాల్లోంచి ఎగిరొచ్చిన పరిమళంలా
మీట నొక్కగానే వెలుగు పరుచుకునే
విద్యుత్ దీపంలా
వ్యాపించు... వ్యాపించు...
ఆవృతాల్ని పెనవేసుకుంటూ.
లోలోపలి సమస్త కల్మషాల్ని కడిగేసుకుని
కొత్త చూపుల్ని ఆవిష్కరించుకున్న
స్వచ్ఛ మానవుడిలా
మరో లోకాన్ని సృష్టించుకున్నట్లుగా
వ్యాపించు... వ్యాపించు

05/16/2016 - 00:20

సూర్యుడు ఉదయించే ఉంటడు
జగతిలో ఎప్పుడూ
రవికిరణాల్ని, కవి భావనల్ని ఎవరాపుతారు?
ఎవరి పేరును ఎవరు రాస్తరు,
ఎవరు తొలగిస్తరు నిజంగా?
కవి రవిలా వెలుగాలి గాని,
చీకట్లో మినుగురుల్ల ఉండి
సూర్యతేజానే్న కాదంటే ఎట్ల?
రవి కిరణానికి,
కవి భావానికి భేదభావాలేముంటయి?
నిత్యం వెలుగును ప్రసరిస్తూనే ఉన్నడు సూర్యుడు
ఎవరి తేజం వారిదే సహజంగా

05/16/2016 - 00:19

దుఃఖం నిండిన బ్రతుకులోంచి
హృదయాన్ని దూరంగా విసరడం
ఇప్పటికీ సాధ్యపడలేదు
వర్ణాలు విరిగిపోయిన స్వప్నంలోంచి
కలల్ని కంటిరెప్పల మీద గుచ్చుకుని
నిర్భయంగా తిరగడం కుదరడం లేదు

ఒక పూర్ణ చిత్ర సంభాషణ తెగాక
రహస్య నిద్రని గిరాటు వేశాక
పోరాడి అలసిపోయిన హృదయ ఓదార్పుకి
జీవశిల్పపు ప్రాణతంత్రిని చుట్టి
కాపాడుకోవడమెలాగో నేర్చుకోనూ లేదు

05/16/2016 - 00:15

‘‘ఒక రోజున ఉదయం లండనులో ‘ట్రైఫాల్గర్ స్క్వేర్’వద్ద జనం గుంపులు గుంపులుగా మూగి యున్నారు. వారొక విచిత్ర జంతువు వంక చూస్తున్నారు. ఆ జంతువు వారిని అన్ని విధాల ఆకర్షించింది. తల, జూలు, నిక్కిన చెవులు, సగము కనబడుతున్న తిరగలి రాళ్ళల్లే పళ్ళ జంట. మొగాన మాత్రం బొట్టు ఉన్నది. అది నిలువుబొట్టు. ఆ జంతువుకు తక్కిన అవయవాలన్నీ మనుష్యులవే. రెండు చేతులు, రెండు కాళ్ళు, కాళ్ళకి కడియాలున్నవి.

05/08/2016 - 21:24

రాత్రి
మూగన్నుగా నిద్రబోతున్న వేళ
అలలు
తెరలు తెరలుగా వచ్చి
మొహంపై దృశ్యాన్ని తిప్పికొట్టాయ!

అంత కలత నిద్రలోనూ
ఊహల మత్తులోనూ
తడుస్తూ లేస్తూ తుళ్ళిపడుతూ
ఊగిసలాడే సందర్భంలోంచి
మెలకువ లాంటి ఉలికిపాటేదో
నాలోని పాటని మేల్కొల్పింది!

కదిపి చూస్తే
దేహమంతా కవిత్వమే!
లయాత్మకమైన పదచరణ విన్యాసమే!

05/08/2016 - 21:20

‘‘తెలుగు భాషకు బ్రహ్మరథం’’అన్న శీర్షిక సాహితీలో చూచి ఇక మళ్ళీ కొత్తగా ‘‘బ్రహ్మరథం’’కట్టిన (పాడె) మహానుభావుడెవరు, మహాప్రభో అని అనుకుంటూ చదివేసరికి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. సాంకేతిక రంగంలోని పదాలను అనువదించినా అవి పత్రికలకే పరిమితం అయ్యాయే తప్ప వాడుక భాషలోనికి రాలేదు. ఒకవేళ వాటిని వాడినా అదేదో జంధ్యాలగారి సినిమాలో కోట శ్రీనివాసరావుగారి భాష లాగా ‘‘నిశివర్ణ ఉషోదకము’’ అదియును తెలియదా?

Pages