S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

04/17/2016 - 22:06

అలసిన మనశ్శరీరాల ఆశ్రయతీరం కాబోలు
ఈ దేవాలయం
నగర సముద్ర ప్రళయఘోష అంటని
ఒంటరి ద్వీపం కాబోలు ఈ దేవాలయం
దీని రూపం కమలం ధవళం
కమలగర్భంలో అచిర పరిచిత
ప్రశాంత మకరందమూర్తి పరమాద్భుత దర్శనం-
ఇక్కడి నిశ్శబ్దంతో సంగమించి
సమస్త అలజడులు, ఆందోళనలు ఆలోచనలు
అస్తిత్వం కోల్పోతాయి-
మనిషి, విప్పారి పద్మవౌతాడు
నిశ్శబ్దమీద తేలి కూర్చుంటాడు

04/17/2016 - 22:04

తెలుగు సాహిత్యం
పరిణామాలు, ఒక పరిశీలన
(వ్యాస సంపుటి)
రచయిత: అజ్మీరు వీరభద్రయ్య
వెల: రు.70/- ప్రతులకు:
రచయిత, మక్కపేట పోస్టు - 521 190,
వత్సవాయి మండలం, ఆంధ్ర ప్రదేశ్.

04/17/2016 - 22:02

నీవూ నేనూ ఒకటే
గాలి లేని కన్నీటి మధ్య
ప్రయాణించిన వాళ్లం!
దుమ్మునిండిన మనసును
కౌగిలించుకున్న వాళ్లం!

04/17/2016 - 22:01

దానికొక రూపం ఉంటుందని
భ్రమలో ఉండే వాళ్ళం

మారణఆయుధం ఎదురైనప్పుడు
క్రూర మృగం మోరలెత్తినపుడు
అంతులేని అగాధం అంచున
దిక్కుతోచక దిగాలుపడినప్పుడు
చీకటి చిందులేసినప్పుడు
స్వార్థం బుసలుకొట్టినప్పుడు
భయం గుప్పిట్లో బందీలమని
భ్రమపడే వాళ్ళం

దొరతనపు స్వభావం లాగ
శతృవుల రూపంలాగ
కనిపించని వేదనలాగ
భయం కూడా
అదృశ్యం

04/17/2016 - 22:25

‘తెలుగు భాషకు బ్రహ్మరథం’ అనే శీర్షికతో గత వారం (ఏప్రిల్ 10) సాహితిలో వచ్చిన ఎం.వి.ఆర్.శాస్ర్తీ ప్రసంగ వ్యాసానికి ఇది కొనసాగింపు.

04/17/2016 - 21:56

బెంగాలీ భాషలో ఉన్నా, ఇది తెలుగువారికథే అనిపించేలా సహజత్వానికి దగ్గరగా నవలలు రాసిన ప్రముఖుల్లో ఒకరు శరత్‌చంద్ర ఛటోపాధ్యాయ అనబడే ‘శరత్‌బాబు’. దేవదాసు నవల వంగభాషలో రాసి సకల విజ్ఞ పాఠక ప్రేక్షకుల మెప్పుపొంది చరితార్థుడైన మధుర గాయకుడు, రాజకీయ మేధావి ఆయన.

04/11/2016 - 00:24

వయోధిక పాత్రికేయ సంఘం ఇటీవల హైదరాబాదులో ‘ప్రజా మాధ్యమాలలో తెలుగు’పై నిర్వహించిన సదస్సులో చేసిన ప్రసంగం.

04/10/2016 - 21:13

మా ఊరు మారిపోయింది
ఊహకందని వింతగా-
పొలాల్ని హలాలు దున్నటం లేదు
దున్నటానికి యంత్రాలు వున్నా
దున్నించుకోటానికి పొలాలు లేవు
రియల్ ఎస్టేటు కాంక్రీటు అడవులు
సస్యశ్యామలాన్ని తినేశాయి!
బస్సు చూడని మావూళ్ళో
నడిచి నడవని పిల్లక్లాసుల
రంగురంగు బొమ్మల వ్యాన్లు
ఇంటింటా ఆగి
ఇంగ్లీషులో స్వాగతం చెబుతున్నాయి!
కాలేజి బస్సులు

04/10/2016 - 21:07

పాతిపెట్టబడ్డ విత్తనమిపుడు
మట్టి పెళ్ళలను పెకిలించుకొని
ఉనికి కోసం యుద్ధానికి సిద్ధం

04/10/2016 - 21:06

అవధాన కవిత్వం అంటే ఆశుకవిత్వం. వ్యవధాన కవిత్వం అంటే తీరికగా రాసుకునే కవిత్వం. అవధాన, వ్యవధాన కవిత్వాలకు స్థూలంగా చెప్పే నిర్వచనం ఇది. ‘చితె్తైకాగ్య్రం అవధానమ్’ అని లాక్షణికుల మాట. అంటే మనస్సును ఏకాగ్రంగా మలచుకొని, ఎన్ని అవాంతరాలెదురైనా వాటిని, సమయస్ఫూర్తితో, సద్యఃస్ఫూర్తితో దాటుకుంటూ కవితా మార్గాన్ని సుగమంగా మలచుకొని సాగే కవిత్వం అన్నమాట. తెలుగు భాషకే సొంతమైన అవధాన ప్రక్రియకు మూలాలు వేదాలే.

Pages