S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

04/03/2016 - 22:44

ఆదివారం అనుబంధంలో..
1. బతుకొక పండుగ - సలీం
2. మళ్లీ మనిషిగా.. - వారణాసి నాగలక్ష్మి
3. ఎంతపని చేశావే?! - తిరుమలశ్రీ (పివివి సత్యనారాయణ)
4. ప్రయాణం - సాయిరాం ఆకుండి
5. నర్సరి - బులుసు సరోజినీదేవి
6. క్రిటిక్-క్రియేటర్ - సృజన్ సేన్
7. గుర్రం ఎగరావచ్చు! - చింతా జగన్నాథరావు
8. వృథా ప్రయాస - పసుపులేటి తాతారావు

04/03/2016 - 22:42

ఏ రోజైనా మీరు రావచ్చు
మా హృదయాలలోకి
మా గదుల్లోకి
ఎప్పుడిష్టమైతే అప్పుడే పోవచ్చు
అనుకోవడానికి ఏముంది

కిటికీలు తెరవచ్చు
పంఖాలు వేయొచ్చు
సోఫాలో కూర్చోవచ్చు
మంచినీళ్లు తాగొచ్చు
సెల్ఫ్‌లోంచి తీసుకొని
ఏ పుస్తకం పేజీనైనా చేరవచ్చు

04/03/2016 - 22:41

నిద్ర లేవకముందే
సంచీ బుజాన వేసుకుని వెళ్లిపోతాడు
మొద్దు నిద్రలో మునిగి ఉన్నప్పుడు
చెమట తడితో తిరిగి వస్తాడు
తెల్లవారని చీకటో వెళ్ళిపోయేవాడు
సూర్యుడు కాదు,
అర్ధరాత్రి దాటాక గూడు చేరేవాడు
చంద్రుడూ కాదు
ఇప్పుడు నాన్న ఎలా ఉంటాడో జ్ఞాపకం రావడం లేదు

అమ్మా! నాన్న...?
నాన్న ఊరెళ్లాడు
ఏం తెస్తాడు?
నీకు బొమ్మలు, బట్టలు

04/03/2016 - 22:39

భారతీయ భాషా సాహిత్యాలలో మరే భాషకు లేని విలక్షణమైన స్థానాన్ని తెలుగు భాషా సాహిత్యాలకు తెచ్చిపెట్టిన ప్రక్రియ అవధానం. పద్య విద్యకు పట్టంగట్టిన సాహిత్య ప్రదర్శన కళగా అవధాన ప్రక్రియ ప్రత్యేక గుర్తింపును పొందింది. నాటి తిరుపతి వెంకటకవులు, కొప్పరపు సోదర కవులు మొదలుకుని ఆధునిక కవుల వరకు పద్యాన్ని అవధాన వేదికలపై ఊరేగించిన మహాకవులెందరో ఉన్నారు.

04/03/2016 - 22:38

కవిత్వానికి, రచనలకు నూతనత్వ పరిపుష్టి, భావావేశ దృష్టితో నాటి కవులు, రచయతలు జీవం పోయడంతో శాశ్వతత్వం లభించేది. ఆ రచనలు చదివిన కవులు, పాఠకులూ అంతగానూ సహానుభూతిని పొందేవారు. ఇదంతా ఒకప్పటి మాట.

03/31/2016 - 23:46

ఆంధ్రభూమి దినపత్రిక పెట్టిన కథల పోటీకి ఎప్పటిలాగే ఈ ఏడూ మంచి స్పందన వచ్చింది. చెయి తిరిగిన సీనియర్లు, వర్ధమాన రచయితలు పోటాపోటీగా రచనలు పంపారు. రాశి బాగానే పెరిగినా కథల వాసి మొత్తంగా చూస్తే ఈసారీ ఒకింత నాసిగానే ఉన్నదని చెప్పక తప్పదు. ఇతివృత్తాల ఎంపికలో కాస్తంత వైవిధ్యం కానవచ్చింది.

03/27/2016 - 22:33

ఇక్కడ నేల
ఆకుపచ్చ భాషలోనే మాట్లాడుతుంది
కాకపోతే అపుడపుడు
గోధుమ రంగులోనో ఓట్స్ రంగులోనో హసిస్తుంది

03/27/2016 - 22:23

అంతా కొత్తగా ఆలోచిద్దాం

అంతరిక్షంలో క్రికెట్ పోటీలు పెట్టుకుందాం
జుపిటర్‌పై ఉద్యోగాలు వెలగబెడదాం
స్పేస్ హౌజ్‌ల్లో కాపురాలు కానిచ్చేద్దాం

రియల్ ఎస్టేట్ దందాని నెబ్యుల్లాదాకా విస్తరిద్దాం
వాటర్ టాబ్లెట్లను కనిపెడదాం
మీల్స్ క్యాంప్సూల్స్ ఉత్పత్తి చేసి
వ్యవసాయాన్ని చట్టుబండలు చేద్దాం

03/27/2016 - 22:21

కవిత్వమంటే
వెయ్యి పదాలను
వృధాగా వెదజల్లుటకాదు
ఒక్కో పదాన్ని ఏరీ
అందంగా కూరీ
దండగా పూరించడం
అక్షరమక్షరాన్నీ
అందంగా కాగితంపైకి
ఎక్కించడం
శిలను సుందర
శిల్పంగా చెక్కడం
***
జీవనది
అది నా మది
తెరచి వున్న గది
గలగలా పారేటి
జీవనది
జ్ఞానంతో నిండిన
అనంతమైన నిధి
అలుపన్నది లేకుండా

03/27/2016 - 22:18

శారీరక వాంఛల్ని లేదా లైంగిక వాంఛల్ని సహజాతాలు అన్నాడు ఫ్రాయిడ్. అసలు మనిషి సుఖం కోసమే ప్రవర్తిస్తాడు. మనిషే ఎందుకు జీవరాశులన్నీ సుఖం కోసమే ప్రవర్తిస్తాయని అనుకోవచ్చు. మరి సుఖమంటే ఏమిటి? శరీరంలో ఏర్పడే సహజాత సంబంధమైన టెన్షన్ తగ్గించటమే సుఖం. దైహిక పాశవిక వాంఛలు తృప్తి చెందాలని కోరుతాయి. అంటే అవి సంతృప్తి కోసం వెంపర్లాడతాయి. వాటికి సంతృప్తి లభించకపోతే టెన్షన్ పెరుగుతుంది.

Pages