S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

12/03/2017 - 21:21

‘పెళ్లాముతో కాపురము చేసేటప్పుడు ఆయన ఒక్క రోజు భార్యతో కలిసిమెలిసి లేడు. ఎప్పుడూ పెళ్లాన్ని కొట్టడమో, తిట్టడమో! అంతేకాని చిలకా గోరువంకలాగా వుండేవాళ్లుకారు. ఏమో అన్యోన్యము లేదని చెప్పితే వాళ్లకిద్దరు పిల్లలు ఎలా కలిగారు? అదో గాలిపాటు!

11/26/2017 - 23:44

దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా’’ అన్న విశ్వమానవ సౌభ్రాతృత్వ గీతం ఒక్కటి మిగిలినా, గురజాడ ప్రపంచ మహాకవి అవుతారు అని శ్రీశ్రీ ఒక సందర్భంలో అన్నారు. అలాంటి దేశభక్తి గీతానికి పునాదులు వందేళ్ల ముందరి 1795 నాటి రాబర్ట్ బర్న్స్ స్కాటిష్ మహాకవి గేయాల్లో దేశభక్తి గీతం పునాదులున్నాయి. గురజాడ, బర్న్స్ కవిని చదువుకున్న, ఇష్టపడిన, ఉటంకించిన ఆధారాలు 1910 తరువాతి గురజాడ వ్యాసాల్లో గమనిస్తాము.

11/26/2017 - 23:42

సత్యశీలికి తలబరువు కాగల లేమి ఉన్నదా
అన్నింటా, ఆ అన్నింటా
దాటిపోతాము పిరికి బానిసలను
వీరికన్నా లేమియే మిన్న
అన్నింటా ఆ అన్నింటా
మన పాటుకేమి విలువ
పదవిదేమున్నది ఒక నాణేన ముద్దర
మనిషి అన్నింట బంగారము

11/26/2017 - 23:42

నేనొంటరినైనా సరే
నాకేమీ భయం లేదంటాను
నాకు నేను చాలుననుకుంటాను
అది ఉట్టిదేనేమో
మేకపోతు గాంభీర్యమేమో
వెనువెంటనే సర్దుకుంటాను
నాకు నేను చెప్పుకుంటాను
నేనే ఒక సైన్యమని
సేన ఎప్పుడూ బహువచనమే కదా

11/26/2017 - 23:40

ఆధునిక సాహిత్యోదయం అయింది. ఇరవయ్యవ శతాబ్దంలో అయితే దానికి రంగాన్ని సిద్ధపరిచింది పంతొమ్మిదో శతాబ్ది. భారతీయ సాంస్కృతిక పునర్జీవనం ఆ శతాబ్దంలో బహుముఖాలుగా వికసించింది. దేశంలో మూడు ప్రెసిడెన్సీ కేంద్రాలలో మూడు విశ్వవిద్యాలయాల స్థాపన జరిగిన తరువాత పాశ్చాత్య భాషా సాహిత్య, విజ్ఞాన శాస్త్రాల అధ్యయనానికి అవకాశాలు పెరిగాయి. విమర్శనా దృష్టి ప్రబలింది.

11/26/2017 - 21:26

‘దినదినానికి అతనిలో హుషారు చచ్చిపోతూ వుంది. నవ్వుతూ నవ్విస్తూ బస్తాలతో బంతులాడుతుండిన మనిషి తన వంతు పని తాను చేస్తున్నాడు. ఏదో పోగొట్టుకున్నట్లు ముభావంగా తిరుగుతున్నాడు. కంటపడిన రాతికీ రప్పకూ మొక్కుతున్నాడు. అతని వాలకం ఒక రాగాన అంతుబట్టక కూలీలందరూ చుట్టూ చేరి గుచ్చి గుచ్చి అడిగితే ‘ఇంటి పేరు నిలబెట్టే దానికొక మొలక మొలవకపోతే ఇంక ఆ బతుకుండేని లాభం?’’ అని నిట్టూర్చాడు.

11/19/2017 - 22:15

శతజయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా...
*

11/19/2017 - 22:01

చింపిరి తల
చిరిగిన బట్టలు
చావిట్లో విరిగిన నులక మంచం
ఏ గుడిసె చూసినా
ఏముంది గర్వకారణం?
ఎండిన డొక్కల్లో పొడి పొడిగా
రాలిపడే ఆకలి రజను తప్ప

11/19/2017 - 21:59

ఏకాంతం ఏకాంతమంటూ
ముద్దుగా పిలుచుకునే ఒంటరి తనమెందుకో
ఒక్కోసారి మారం చేస్తుంది
నిజాల లెక్కలు తేల్చాల్సిందేనని
అహానికి ఎదురు తిరుగుతుంది

బాహ్యానికి అంతరాళానికి మధ్య
అడ్డుగోడలా నిలబెట్టిన నిర్లప్తత
ఇక వల్లకాదంటూ చేతులెత్తేస్తుంది
లోలోని నీలపు బరువు ఉవ్వెత్తున పొంగుతుంటే

11/19/2017 - 21:57

తెలిమబ్బులతో దాగుడు మూతలాడుతున్న
వెనె్నల రేకుల మీదుగా
సౌందర్యపు అపరిమితత్వాన్ని ప్రణవిస్తూ
నక్షత్రాల తమకాలలో జారిపడిన సవ్వడిలో
ప్రకృతికి మెత్తని చలనాన్ని స్తూ
రేయి చిక్కబడింది

Pages