S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

11/30/2015 - 02:36

దేశమును ప్రేమించమంటివి
మంచియన్నది పెంచమంటివి

పరాయి దేశమును ప్రేమించుచుంటిమి
కిరాయి సంస్కృతి నేరుగా దించుతుంటిమి
మహా జోరుగా పెంచుతుంటిమి

ఈసురోమని మనుజులుండరాదని
దేశ జనులను ఆదేశించినావు

మంది తినెడి కందిపప్పే...
కేజీ వంద కంటే కింద దిగదే
భూసురుడైనా ఈసురోమనక
భేషుగ్గా ఎటులుండగలడే!

11/30/2015 - 02:33

కారణం ఏదయినా
ప్రాణం తీసుకొంటే ఎలా?
అనుకున్నవి సిద్ధిస్తే
ఆస్వాదించడమేనా?
అనుకోనివి సంభవించినా... స్వీకరించాలిగా!

విజయం అధిరోహించడమేకాదు
అపజయం అధిగమించడమూ తెలియాలి
జీవన గమనంలో
ఏ సమస్యా ముగింపు కాదు... మలుపు మాత్రమే
యిదే ముగింపు అని ఆగిపోతే
దారులన్నీ ఊపిరి ఆడనంత చిరాకులు.

11/30/2015 - 02:30

‘నీకేం తెలువదు ఊరుకో’
అన్నాడు కొడుకు
ఆమె తలెత్తి చూసి
ఓ చిరునవ్వు నవ్వి
మళ్లీ తన పనిలో మునిగిపోయింది.

‘నీదంతా పక్షపాతం
నీకు వాడంటేనే ప్రేమ’
అన్నాడు కొడుకు
ఆమె వాడి కళ్ళల్లోకి
సూటిగా చూసి
కళ్ళు మూసుకుంది.

‘నువ్వు మాకేం చేసినవ్?’
అన్నాడు కొడుకు
ఆమె నేల చూపులు చూస్తూ
మోకాళ్ళకు
గుడ్డలు కట్టుకుంటుంది.

11/30/2015 - 02:28

పాఠకుల కంటె కవులు ఎక్కువ. ప్రతి కవి పాఠకుడు కాదు. తెలుగు సాహిత్యానికి సంబంధించి ఉద్యమ కవిత్వం ఒక చక్కని వ్యాపారం. ఇంత చదువుకోని పూర్వ కవులు తమ కృతుల కారణంగా ఇంకా మిగిలి వున్నారంటే అపుడు ఇంత జనాభా లేరు. కవులున్నూ లేరు. ఇన్ని సభలప్పుడు లేవు. ఇన్ని ఆవిష్కరణలున్నూ లేవు. ఐతే ఆధునిక సాహిత్యంలో పది కాలాలపాటు నిలచే రచనలేమైనా వున్నాయా అంటే- అసలీ ప్రశ్న ఎవరు ఎవర్కి వేయాలి అనే సమస్య తల ఎత్తుతుంది.

11/30/2015 - 02:27

మతములన్నియు మాసిపోవును
జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును

11/23/2015 - 04:42

కవిగా, పండితునిగా, పరిశోధకునిగా, అధ్యాపకునిగా సాహిత్యలోకంలో సుప్రసిద్ధులు. 87 ఏళ్ళ వయస్సులోనూ ఆయన రచనా దాహం తీరలేదు... రోజుకు ఐదారు పేజీలయినా చదువకుండా, రాయకుండా ఉండలేని ఆయన పట్టుదల యువతరానికి సదా స్ఫూర్తిదాయకం. పురాణేతిహాసాలు, ప్రబంధ కావ్యాలనుండి కాకుండా జానపద గ్రామీణ ఇతివృత్తాల్ని స్వీకరించి నవ్య ప్రబంధ రీతి కవిత్వం రాశారు. వీటిలో సమకాలీనతని ప్రతిబింబించారు.

11/23/2015 - 04:40

నేటి వాడుక భాషా వ్యాప్తికి కారణం గుఱజాడ వారు గిడుగువారు అనే తిరుగులేని అభిప్రాయం ఏర్పడిపోయింది. వాడుక లేక వ్యవహారిక భాష అంటే ఏమిటి? ప్రజలు నిత్య కృత్యాలలో జరుపుకునే సంభాషణలు. ఇది అన్ని ప్రదేశాలలోను ఒకే మాదిరిగా ఉండవు. కన్యాశుల్కం నాటకం వాడుక భాషలో జరిగిందని అందరు చెబుతారు. కాని ఈ నాటకం తెలంగాణాలోను రాయలసీమలోను చాలవరకు అవగాహన కాదు. ఈ నాటకంలో సంస్కృతం ఉంది. ఇంగ్లీషు ఉంది. హిందుస్థానీ ఉంది.

11/23/2015 - 04:39

ఎవరు గెలిచినా వొకటే
నోటో, కులం పోటో వోటేసినప్పుడు
వేలికొస మీది సిరాచుక్క నలుపు మొహంతో
మన ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తున్నప్పుడు
దేశ గగనతలం మీద ఏ సూర్యుడు పొడిచినా
స్వాతంత్య్రపు వెలుగు మాత్రం ప్రసరించనప్పుడు
ఎవరు గెలిచినా వొకటే
నోటో, కులం పోటో, వోటేసినప్పుడు

11/23/2015 - 04:38

ఇదే క్షణం ప్రతి క్షణం
మాటల కాలుష్య మేఘాలన్నీ
ఢీకొంటున్న ఆకాశంలో
శబ్ద తరంగాలను వర్షించే
‘ఇ’కాలమంతా
‘టాక్‌టైమ్’ లెక్కల్లో
గలగలా మోగుతూ
ఎవరి యాసలో వారు
సెల్‌ఫోన్ వాసులై
ఎడతెగని కబుర్లతో
‘ఫేస్‌బుక్’ ఆకర్షణలో
ఒంటరితనాన్ని -
తప్పించుకు తిరిగే
ఈ భూగోళం మీదే
‘టవర్ ఆఫ్ బెబెల్’ నిర్మించుకున్న మనం

11/23/2015 - 04:38

మాటల్ని వెతుక్కుంటున్నాను
మనసు నిండా మాట్లాడ్డం బందై
చాలాకాలమైంది

అట్లని వౌనం పందిరి కింద
నేనేమీ ఖాళీగా లేను

సముద్రపు అలల అంచుల్లోని
మీగడలాంటి నురగని
దోసిట్లోకి తీసుకుని ముద్దాడుతున్నాను

ఆకాశం కాన్వాస్‌పై
మబ్బులు వేస్తున్న
రంగుల చిత్రాల్ని
ఆస్వాదిస్తున్నాను

Pages