S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

06/11/2017 - 20:58

చూడటానికి చువ్వలా ఉన్నా
పది మందిలో ప్రత్యేకంగా కనిపించేది అమ్మమ్మ
కారణం ఆమె నడుముకున్న వడ్డాణమే
శివుని మెడలో నాగరాజులా
ఎపుడూ ఆమె నడుమును అంటిపెట్టుకునే ఉండేది
అమ్మమ్మ పెళ్ళిలో పుట్టింటి వారు పెట్టిన
ఇరవై తులాల వడ్డాణం
ఆమె తనువులో ఓ భాగమైపోయింది
తాతయ్యనైనా విడిచి ఉండేది కాని
వడ్డాణాన్ని మాత్రం వదిలేది కాదు స్నానమాడే వేళ తప్ప

06/04/2017 - 21:01

మూర్ఖుడి వేదాలు వేరు
వాదనలు వేరు
చేతనలు వేరు
సాధనలు వేరు
మూర్ఖత్వం మెదడులో
తెరలు తెరలుగా
గుండెల్లో
పొరలు పొరలుగా
ఒకచోట ఘనీభవించి
ఒకచోట ద్రవీభవించి-
తెరతీస్తే మరో తెర
పొరతొలిస్తే మరో పొర
పగలేస్తే పగలని లోహం
పారిస్తే పారని ద్రవం-
భక్తి మూర్ఖత్వం
మత మూర్ఖత్వం
జ్ఞాన మూర్ఖత్వం
దృష్టి మూర్ఖత్వం

06/04/2017 - 20:59

తెలుగు భాష అంటే పాత తెలుగు పదాలు మాత్రమేనని సంస్కృతం నుండి వచ్చినవి వాడకూడదని మహాప్రాణాలు అవసరం లేదని అసలు అచ్చ తెలుగులో అవి లేవని, వాటిని అక్షరాలలో నుండి తొలగించాలని ఒక వాదన ఇటీవల జరుగుతున్నది. నిజానికి వేల ఏండ్లుగా ప్రజలు గాని రచయితలు గాని ఇదంతా మనసులో పెట్టుకొని చేసినవి కావు.

06/04/2017 - 20:59

నీ చూపు వెలుగురవ్వే!
నా కళ్ళల్లో
కోటి దీపోత్సవం

హృదయ పట్టకంలో
నీ రాక వెలుగురేఖ
నా మనసు.. ఇంద్రధనుసు

నా రుసరుసలన్నీ
ఇక రసగుల్లాలే
నీ గుసగుసలతో

మనసంతా నువ్వే
మరి చోటు లేకే
నీ చుట్టూ తిరుగుతోంది!

ఊరంతా అమావాస్య!
నాకు లేదు
నువ్వున్నావుగా.. పక్కన

చెకుముకి చూపుల
సంఘర్షణ!
వలపు మెరుపులు

06/04/2017 - 20:58

వెల: రూ.150/-
పుటలు: 210
ప్రతులకు:
- డా. కె. జగన్నాథశర్మ
12-11-1346/ఎ,
బౌద్ధనగర్,
సికిందరాబాద్-500 061.
9949353846
**
ధర్మే చార్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ
యది హాస్తి తదవ్యత్ర యనే్నహాస్తి న తత్క్వచిత్

06/04/2017 - 20:56

అప్పటి మా వీధి
దుమ్ముపట్టని అద్దంలా తళతళలాడేది
కోడికూత ముందే
వీధిలో గాజుల గలగలలు విన్పించేవి
చీపుర్ల శబ్దాలు నిద్రలేపేవి
కళ్లాపి ధ్వనులు మత్తు వదిలించేవి
మంచం దిగి బయటికి రాగానే
మా వీధి నా మనసుని ‘ముగ్గు’లోకి దింపేది

05/22/2017 - 22:45

సర్వగ భావంలో కందువ
కలల కళ్లు విప్పి
నిర్భగ్న నిశ్చలత్వంతో లోకాలోకానం చేస్తున్న
దృశ్యమే తోచింది
ఉదయారుణ వలయాన్ని నెత్తిన పెట్టుకున్న ఉర్వీధరానికి
చెట్టుపూల చూపుల భాష్యం వివరిస్తున్నట్లుంది
అవ్యక్త మధుర ధ్వని సమాస పరిమళం
అంతటా అలుముకొంది
పక్షిపాడుతున్న పాటలో రూపాంతరం చెందుతున్న
వత్స నగ్నవాజ్ఞ్మయమంతా వర్ణ విభ్రాజితమే...

05/22/2017 - 22:44

గుంపులోనుంచి
ఒక్క తల ఉప్పొంగింది
ఉప్పొంగిన ఆ తల ముఖంలోనుంచి
మాటల ఈటెలు పొడుచుకొస్తున్నాయ
గుంపులోని జాగృత జిహ్వలు
ఆ మాటలకు పరవశించి
మరిన్ని వచోధారలను
వర్షిస్తున్నాయ.
గుంపు మరింత వేగంతో
విక్రమిస్తున్నది
ఆ ఒక్క తల
ఎన్నో జాగృత జిహ్వలకు
జ్వలత్ వాక్కులందించింది

05/22/2017 - 22:43

స్వయం జనితాలు-
ఎవరివి వారివి, ఎప్పటివి అప్పటివి
ఎక్కడివి అక్కడివి
ఒకరివి ఒకరు కించబరచడమా!?
ఇదెట్లా?
నీ ఇంట్లోకి నీకు తెలియకుండా ఎవర్రాగలరు?
నీ అనుమతి లేకుండా
నీలోకెవరు చొరబడగలరు?
నినె్నవరు కించపరచగలరు?
నిన్ను నీవు తెరచుకుని
స్వాగతించినప్పుడే మరొకరి ప్రవేశం
స్వయంకృత క్షుభిత మనోభావాలా!
పారించే ఉద్వేగ లావాలా?

05/22/2017 - 22:42

ఆ మొండి కోటగోడలు
ఎంత వైభవాన్ని
ఎన్ని ఉద్వేగాలను చవి చూడలేదు?
ఎన్ని దౌర్జన్యాలను
ఎన్ని దుర్మార్గాలను
నేలమట్టం చేస్తుంటే
భయంతో కళ్ళు మూయలేదు!
గోడలకు చెవులుంటాయి కాని
నోళ్ళుంటాయా?
గుట్టు విప్పడానికి!
ఆ రాజుల వీరత్వం
ఆ రాణుల ప్రేమ పురాణం
వారి విచ్చలవిడితనం
వారి విలాసాలు విలాపాలు
అన్నీ మట్టికొట్టుకపోయినవి

Pages