S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవని

01/20/2016 - 04:47

ఆస్తమా అన్ని వయస్కుల వారిలో వస్తుంది. ఊపిరి ఆడకుండా, ఉండి, శ్వాస తీయటం కష్టంగా మారటాన్ని ఆస్తమా అంటారు. దుమ్ము ధూళి, వాతావరణ కాలుష్యంవల్ల నేడు అధిక శాతం మంది ఆస్తమా బారిన పడుతున్నారు.
వంశపారంపర్యంగా, శ్వాసకోశాల ఇన్‌ఫెక్షన్‌కు గురికావడంవల్ల, ఎలర్జీల వల్ల, ధూమపానం వల్ల కూడా రావచ్చు.
లక్షణాలు
* శ్వాసనాళాలు ఇన్‌ప్లేమేషన్‌తో మూసుకొని పోయి శ్వాసించడం కష్టంగా మారుతుంది.

01/20/2016 - 04:46

చలికాలంలో చాలామంది గొంతు నొప్పితో బాధపడుతుంటారు. గొంతులో ఇన్‌ఫెక్షన్ కారక సూక్ష్మక్రిములు ఏర్పడటంవలన గొంతు నొప్పి (త్రోట్‌పెయిన్) మొదలవుతుంది. అలాగే చల్లటి పానీయాలు, చల్లటి తేమ గాలి సరిపడకపోవడంవల్ల టాన్సిలైటిస్, ఎడినాయిడ్స్, లెరింజైటిస్, ఫెరింజైటిస్ వంటి వ్యాధులవలన కూడా గొంతు నొప్పి వస్తుంది.

01/20/2016 - 04:45

మనం ఆహార నాళం లోపలి భాగమంతా మ్యూకస్ మెంబ్రేన్‌తో కప్పబడి ఉంటుంది. ఈ పొర చాలా పల్చగా, నున్నగా ఉంటుంది. లోపలి భాగాలకి, ఆహార నాళానికి మధ్యగా వేరు చేస్తూ ఈ పొర ఉంటుంది. విచిత్రమేమిటంటే, ఈ పొరని కోస్తూంటే నొప్పి ఉండదు. ఈ పొర ఎక్కడైనా చిరగడమంటే ఆహార నాళంలో పుండు ఏర్పడినట్లే.

01/20/2016 - 04:43

సరైన పోషకాహారం తీసుకోకపోవడం, డెబిలిటేటింగ్ డిసీజ్ లేకపోతే, కొన్ని రకాల మందులను వాడడంవల్ల హార్మోన్ సమతుల్యం దెబ్బతిని జుట్టు ఎదుగుదల దెబ్బతింటుంది. హార్మోన్ సమతుల్యం దెబ్బతినడం లాంటివి మనకి తెలియకుండానే జరిగిపోతుంటాయి. జీన్స్‌లోనూ సమస్యలుండవు.

01/20/2016 - 04:44

చర్మం క్రింద, లోపలి అవయవాలకి రక్షణని కూడా కల్పిస్తుంటాయి కండరాలు. ఈ కండరాలు ఎక్కడైనా పలుచనై, అవయవాలు ఉబ్బెత్తుగా ముందుకు తోసుకువస్తే హెర్నియా అంటారు. కడుపు ముందుభాగంలో కండరాలమధ్యనుంచి అవయవాలు చర్మాన్ని ముందుకు తోయడంవల్ల వచ్చే హెర్నియాను ఎక్కువగా వస్తుంటాయి. ఇలా కండరాలు నీరసించడం వంశపారంపర్యంగా రావచ్చు. కండరాలు నీరసించడంవల్ల హెర్నియాలు రావచ్చు.

01/20/2016 - 04:41

కాలు వెంబడి తీవ్రనొప్పి

01/13/2016 - 03:53

గత కొన్ని శతాబ్దాలుగా మనలోని కొన్ని అనారోగ్యాలను శస్తచ్రికిత్సల ద్వారా నయం చేస్తున్నారు వైద్యులు. గుండె అతి ముఖ్యమైనది. సున్నితమైనది. నిర్విరామంగా పనిచేసేది కావటంతో మిగిలిన అవయవాల శస్త్ర చికిత్సలకన్నా గుండె శస్తచ్రికిత్సలు కొంచెం ఆలస్యంగా ప్రారంభమయ్యాయనే చెప్పాలి. 1953లో కృత్రిమ గుండె, ఊపిరితిత్తుల మెషీన్‌ను కనుగొనడంతో సురక్షితమైన ఓపెన్ హార్ట్ సర్జరీ ప్రారంభమైంది.

01/13/2016 - 03:50

వీడియో థొరకోస్కోపి, రోబోటిక్స్ సహాయంతో ప్రపంచంలో కొన్ని కేంద్రాలలో మాత్రమే గుండె కీహోల్ సర్జరీస్ నిర్వహిస్తున్నారు. ఛాతి కుడి పక్క 4 సెం.మీ కోతను మాత్రమే చేసి, మైట్రల్ వాల్వ్ చికిత్సల్ని నిర్వహిస్తున్నారు. అలాగే గుండె రక్తనాళాలలో అడ్డంకులుంటే బైపాస్ చికిత్సల్ని నిర్వహిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో గుండె శస్తచ్రికిత్సలు మరింత అధునాతనవౌతాయి.

01/13/2016 - 03:49

రాష్ట్రంలో చలి పులి పంజా విసురుతోంది. గత వారం రోజుల నుండి కనీస ఉష్ణోగ్రతలు తగ్గిపోవటంతో ప్రజలు గజ గజలాడిపోతున్నారు. చలి నుంచి రక్షణ పొందడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ కాలంలో వచ్చే జబ్బుల నుండి విముక్తి పొందవచ్చు.
శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం అంత చల్లగా అయిపోవడంవల్ల మన శరీరంలో వచ్చే మార్పువల్ల ప్రధానంగా దగ్గు, జలుబు, ఉబ్బసం, గొంతు, చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటారు.

01/13/2016 - 03:46

ఆరోగ్య స్థితి తెలియాలన్న, అనారోగ్య తీవ్రత తెలియాలన్నా పరీక్షలు అవసరం. రక్తపరీక్షలు రోగ నిర్థారణకే కాదు నివారణకు కూడా ఉపయోగం. అంతేకాదు రోగ నిర్ణయం జరిగాక, చికిత్సా ప్రయోజనం కూడా తెలుసుకోవచ్చు. అందువల్ల రక్త పరీక్షలనేవి అవసరం. వాటి అవగాహన అన్నిటికన్నా ముఖ్యం.

Pages