S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవని

11/01/2016 - 22:40

ప్రస్తుత సమాజంలో ట్రామాని జబ్బు కింద చూడటం జరుగుతోంది. సమాజంలోని అన్ని వర్గాలవారూ దీనికి లోనవుతున్నారు. అనియంత్రిత హేమరేజ్‌వలన మొద్దుబారిన మరియు తీక్షణతో కూడిన ట్రామావలన రోగిలో హైపోవాలీమియాకి (రక్తప్రసరణలో తగ్గుదల) దారితీసి దాని వలన హైపోవాలేమిక్ షాక్ కలుగవచ్చు. ఒక్కోసారి ఇది ప్రాణాంతకంగా మారుతుంది.

10/25/2016 - 21:40

ఏ బరువూ, బాధ్యతలూ లేకుండా హాయిగా, స్వేచ్ఛగా తిరిగే బాలబాలికలు పెద్దలుగా మారే మధ్యస్థితి కౌమారదశ. పిల్లలు శారీరకంగా, మానసికంగా, భావోద్వేగ పరంగా, సామాజికంగా వేగంగా అభివృద్ధి చెందుతూ, కొత్త సామర్థ్యాల్ని పెంపొందించుకుంటూ, కొత్త పరిస్థితుల్ని ఎదుర్కొనే దశ ఇది. ఈ మార్పులన్నీ క్రమేపీ జరుగుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 10-19 సంవత్సరాల మధ్య వయసును ‘కౌమారదశ’గా నిర్వచించింది.

10/25/2016 - 21:38

ప్ర: మా ఇంట్లో అందరికీ తీపి అంటే ఇష్టం. ఇలా ఇష్టాలనేవి వంశపారంపర్యంగా ఉంటాయా? దానివలన నష్టం ఏమైనా ఉంటుందా?
-కె.చిరంజీవి, జగిత్యాల

10/25/2016 - 21:35

జలుబు అనేది చాలా తేలికగా ఒకళ్ళ నుంచి మొకళ్ళకు సోకుతుంది. వైరస్ వ్యాప్తితో తేలికపాటి జ్వరం, కళ్ళనుంచి, ముక్కునుంచి నీళ్ళు కారడం, ముక్కు దిబ్బెడ, తలనొప్పి లక్షణాలు, గొంతు కూడా బొంగరుపోవచ్చు. ఈ లక్షణాలు కలగడానికి ఎన్నో రకాల వైరస్‌లు కారణం. సాధారణంగా సూక్ష్మజీవులనైతే ముక్కలోపలి యంత్రాంగం అడ్డుకోగలదు.

10/25/2016 - 21:34

బరువు, పరిమాణం తక్కువగా ఉన్న మనం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఎంతో కష్టపడుతోంది గుండె. ఇరవై నాల్గుగంటలూ కృషిచేయడమెలాగో అది మనకి నేర్పుతోంది కూడా! గుండె తన పని చేయడాన్ని ఆపడమంటే మనం జీవితాన్ని ముగించడమే! శరీరంలోని అన్ని కణాలకు ఆహారం, ఆక్సిజన్‌లని అందిస్తూంటేనే మన జీవక్రియలు సక్రమంగా జరిగేది. శరీరాలలో చిన్న, పెద్ద, ముఖ్యం అంటూ ఏ అవయవాల్నీ పేర్కొనలేం. అవి ఎంత పరిమాణంలో ఉన్నా అన్నీ ముఖ్యమైనవే!

10/25/2016 - 21:33

ఈ రోజుల్లో చాలామంది స్కూలు పిల్లలను వేధిస్తున్న సమస్య నడుంనొప్పి. స్కూలు బుక్స్ బరువు ఎక్కువ ఉండటం, స్కూలు బ్యాగు బరువు రెండు భుజాలపై సరిగా పడకపోవటం వలన వెన్నుముకపై ప్రభావం చూపి నడుమునొప్పి తీవ్రత ఎక్కువవుతున్నది. అలాగే వయసుకు మించిన బరువు మోయడం వలన చిన్నారులు నడుమునొప్పితో బాధపడుతున్నారు. నడుమునొప్పేకదా అని నిర్లక్ష్యం చేయడంతోనే ఈ సమస్య ఇంకా తీవ్రమై పిల్లలను వేధిస్తుంది.

10/18/2016 - 21:27

ఇది వస్తుంటే ముందు గొంతు రాచుకుపోతుంది. ఇన్‌ఫెక్షన్‌తో శరీరానికి సంబంధించి ఎక్కడ వున్నా గొంతులో ఇన్‌ఫెక్షన్ ఎక్కువవుతుంది. రోగిలో జ్వరంతోపాటు ఛాతీనొప్పి, అలసట లాంటి లక్షణాలు ప్రారంభమవుతుంది. జాయింట్స్ వాచిపోయి ఎర్రగా తయారవుతాయి. తరచు చర్మంలో రాష్ వస్తుంటుంది. క్రమంగా ఈ ఇన్‌ఫెక్షన్ గుండె కవాటాల్ని దెబ్బతీస్తాయి.

10/18/2016 - 21:26

ప్రశ్న: నా వయస్సు 35 సంవత్సరాలు. నేను ఒక కంపెనీలో కంప్యూటర్ ఉద్యోగినిగా పనిచేస్తున్నాను. నాకు కొంతకాలంగా మెడ కదిలించటంవల్ల నొప్పి అధికమవుతున్నది. విశ్రాంతి వల్ల నొప్పి తగ్గుతోంది. అలాగే మలబద్ధకంతో బాధపడుతుంటాను. దాహం అధికంగా కలిగి ఉండి నీరు ఎక్కువగా త్రాగుతాను. మానసికంగా నాకు కోపం ఎక్కువ. కదలికలవల్ల నాకు బాధలు ఎక్కువవుతున్నాయి.

10/18/2016 - 21:23

ఫ్రెంచ్ మెడికో లీగలిస్ట్ డా పి.సి.హెచ్.బి. బ్రోనార్‌డెల్ అనేదేమంటే ‘ఒక మనిషిని శిక్షించాలన్నా, రక్షించాలన్నా అతనిపై ఆరోపించబడిన నేరాన్ని న్యాయ వైద్య సాంకేతికపరమైన పరిధుల్లో నిర్ణయింపగలిగే శాస్త్ర విజ్ఞానం కావాలి’ అన్నాడు. ఆ రీతిగా నేర పరిశోధన శాస్త్రం అన్ని ముఖ్యదేశాలలోనూ తన ప్రాధాన్యత సంతరించుకుంది.

10/18/2016 - 21:20

మానవ జీవనగమనంలో జరుగుతున్న వేగవంతమైన మార్పులు మానవ మానసిక సమతుల్యతలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా వేగవంతమైన ఈనాటి ఈ సామాజిక, సాంకేతిక మార్పులు ‘మనిషి’ మనస్సుపై తీవ్రమైన ‘ఒత్తిడి’ పెంచుతూ అనేకానేక శారీరక, మానసిక రుగ్మతలకు నిలయాలుగా మారుతున్నాయి! నానాటికీ పెరుగుతున్న ఈ శారీరక అనారోగ్యాలకు ప్రధానంగా మానసిక దౌర్బల్యాలే కారణం అనటంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు.

Pages