S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పాట్ లైట్

08/01/2017 - 21:22

రెండూ బలమైన కమ్యూనిస్టు దేశాలు. సిద్ధాంతాలు వేరైనా ఆశయం ఒక్కటే. ఒక దేశానికి భారత్ వంటి వర్ధమాన దేశాలను
ఢీకొని చిన్న చిన్న దేశాలపై పెత్తనం చెలాయించాలన్న ఆశయమైతే మరో దేశానిది అంతర్జాతీయంగా పూర్వ వైభవాన్ని
సంతరించుకోవాలన్న పట్టుదల. ఇటు చైనా పిఎల్‌ఏ 90వ వార్షికోత్సవ విన్యాసాలు అటు రష్యా నౌకాదళ విన్యాసాలు

08/01/2017 - 21:13

పనామా వేడి పాకిస్తాన్ రాజకీయాల్ని అట్టుడికిస్తోంది. తనపైన, తన కుటుంబ సభ్యులపైనా వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రధాన మంత్రి పదవి నుంచి నవాజ్ షరీఫ్ తప్పుకోవాల్సి రావడంతో పాకిస్తాన్ మరోసారి సైనిక పాలన కిందకి వెళుతుందా? ప్రస్తుత సంక్షోభ పరిస్థితిని అధికార పిఎమ్‌ఎల్ పార్టీ అదుపుచేయగలుగుతుందా? అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.

08/01/2017 - 21:06

పాకిస్తాన్‌లో నెలకొన్న తాజా అనిశ్చిత రాజకీయ పరిణామాలు సుస్థిర ప్రభుత్వానికి అవకాశం ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో భారత్‌తో సంబంధాల మాటేమిటన్నది ఆందోళన కలిగిస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకు అనేక సందర్భాల్లో నవాజ్ షరీఫ్‌తో మాట్లాడటం, గతంతోనిమిత్తం లేకుండా వర్తమాన అవసరాలు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రెండు దేశాలు కలిసి ఉండాల్సిన అగత్యాన్ని స్పష్టం చేస్తూ వచ్చారు.

08/01/2017 - 21:05

బ్రెజిల్ నాయకులకు ఆగస్టు నెల వచ్చిందంటే ఎక్కడలేని గుబులు పట్టుకుంటుంది.ప్రస్తుతం అలాంటి పరిస్థితినే అధ్యక్షుడు మైఖెల్ తెమర్ ఎదుర్కొంటున్నాడు. బ్రెజిల్ చరిత్రను పరిశీలిస్తే అధ్యక్ష పీఠానికి ఆగస్టు 31 రోజుల్లోనే తీవ్రస్థాయి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ వచ్చాయి. అభిశంసనకు గురికావడమో లేక రాజీనామా చేయడమో అనివార్యమైన పరిస్థితులు ఆగస్టు నెలలోనే ఈ దేశాధినేతలకు ఇప్పటి వరకూ తలెత్తుతూ వచ్చాయి.

07/18/2017 - 21:25

ఎట్టకేలకు బ్రెగ్జిట్ చర్చలు మొదలయ్యాయి. మరో 20 నెలలపాటు జరిగే ఈ చర్చల్లో బ్రిటన్ అంతిమంగా లాభపడుతుందా లేక నష్టపోతుందా అన్నది ఊహకు అందని విషయమే. అలాగే ఏడాది క్రితం జరిగిన బ్రెగ్జిట్ ఓటును తిరస్కరించే అవకాశం కూడా లేకపోలేదన్న వాదన బలాన్ని పుంజుకుంటోంది.

07/20/2017 - 21:02

ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం ఆ కూటమికి, బ్రిటన్‌కు సంబంధించిన అంశమే అయినా, ఈ పరిణామం ఏమాత్రం తలకిందులైన ప్రతికూల ఫలితాలకు దారితీసినా, అమెరికాతో బ్రిటన్ సంబంధాలు బెడిసికొట్టే అవకాశం చాలా తీవ్రంగానే ఉంటుంది. ఎందుకంటే మిగతా దేశాలకంటే కూడా బ్రిటన్‌తో అమెరికా సంబంధాలు అత్యంత ప్రత్యేకమైనవి, అత్యంత లోతైనవి, అత్యంత ప్రతిష్టమైనవి కూడా.

07/20/2017 - 21:01

పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌కు ఇంటా బయటా రాజకీయ సెగలు మొదలయ్యాయి. పనామా పత్రాలు బహిర్గతం అయినప్పటి నుంచీ ఆయన పరిస్థితి రోజురోజకూ దిగజారుతోంది. నవాజ్ రాజీనామా చేయాల్సిందేనంటూ ప్రతిపక్ష పార్టీలు మరింత పట్టును బిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ భవితవ్యమే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఊతాన్ని అందుకుంటున్నాయి.

07/18/2017 - 21:18

ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి సంక్లిష్టమైన అంశాలను శోధించి సాధించడానికి అంతర్జాతీయంగా ఎన్నో వేదికలున్నాయి. అలాంటి వాటిల్లో అత్యంత కీలకమైనది సంపన్న దేశాలతో కూడుకున్న జి-20. ఇప్పటివరకు ఎన్నో శిఖరాగ్ర సదస్సులను ఈ దేశాల కూటమి నిర్వహించింది. తాజాగా జర్మనీలోని హాంబర్గ్‌లో జరిగిన శిఖరాగ్ర భేటీకి అనేక కోణాల్లో ప్రాధాన్యత చేకూరింది.

07/18/2017 - 21:27

సంక్షోభాలు, దైన్యం, పేదరికానికి అతీతమైనదే బాల్యం. ఆ బాల్యానికి పరిసారాలతో సంబంధం లేదు. స్నేహితులు కలిస్తే చాలు ఆటపాటల ఆనందంలో అలసి సొలసిపోతారు. అనిర్వచనమైన అనుభూతి తన్మయత్మమైపోతారు. సిరియా కల్లోలం గురించి.. అక్కడి జనజీవనానికి రోజువారీగా ఎదురవుతున్న జీవన్మరణ సమస్యల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

07/11/2017 - 23:51

గత ఏడాది జరిగిన తిరుగుబాటును కర్కశంగా అణచివేసిన టర్కీ అధ్యక్షుడు రసెప్ తయిప్ ఎర్డోగన్‌కు మళ్లీ సెగలు మొదలయ్యాయి. ఆయన విధానాలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీలు తాజాగా భారీఎత్తున చేపట్టిన ర్యాలీ టర్కీలో రాబోయే పరిణామాలకు సంకేతాన్ని అందిస్తోంది. 25 రోజులపాటు న్యాయం కోసం పోరాటమన్న నినాదంతో జరిగిన ర్యాలీ ముగింపు సందర్భంగా లక్షల సంఖ్యలోనే జనం తరలివచ్చారు.

Pages