S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పాట్ లైట్

04/11/2017 - 22:12

సిరియాపై జరిగిన రసాయన ఆయుధ దాడి ఇటు అమెరికా అటు రష్యాల మధ్య తీవ్ర స్థాయిలో సంఘర్షణలకు ఆజ్యం పోస్తోంది. దశాబ్దాలుగా అంతర్వుద్ధంలో అట్టుడుకుతున్న సిరియాను రష్యా వెనకేసుకురావడం, తాజా ఘటన నేపథ్యంలోనూ బాధ్యతా రహితంగా వ్యవహరించడంతో అమెరికా రంగంలోకి దిగాల్సి వచ్చింది.

04/11/2017 - 21:58

సిరియాపై జరిగిన రసాయనిక ఆయుధదాడి అక్కడి ప్రజల ప్రాణాలను క్షణాల్లో తీసేసింది. నురగలు కక్కుతూ అచేతనావస్థలో చిన్నారులు ఆసుపత్రి పాలు కావడం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. ప్రత్యర్థి వర్గాలపై అసాద్ అనుకూల దళాలు జరిపిన దాడి కారణంగానే ఈ అమానుషం సంభవించినట్టుగా స్పష్టమవుతోంది. చిన్నారులను మోసుకుని తీసుకెళుతున్న సహాయదళ సిబ్బంది.

04/11/2017 - 21:56

అమెరికా మరోసారి రెండు యుద్ధాలకు పరిమిత స్థాయిలో సిద్ధమవుతోందా? 9/11 నేపథ్యంలో అటు ఇరాక్‌పైనా, ఇటు అఫ్గాన్‌పైనా సమర భేరి మోగించిన అమెరికా ఇప్పుడు సిరియాపై దృష్టి పెట్టింది..అదే సమయంలో కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్తర కొరియాపైనా యుద్ధ నౌకల్ని గురి పెడుతున్నట్టుగా తాజా పరిణామాల్ని బట్టి స్పష్టం అవుతోంది.

04/11/2017 - 21:53

అమెరికా క్షిపణి వర్షం దృశ్యం ఇది. సిరియాలోని తిరుగుబాటు దారుల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా ఈ దాడికి పాల్పడింది. దీన్ని తీవ్రస్థాయలో రష్యా ప్రతిఘటించింది. ఈ దాడిలో అనేకమంది చిన్నారులు కూడా మరణించడం సర్వత్రా అమెరికా చర్య పట్ల నిరసనలకు ఆజ్యం పోసింది.

04/11/2017 - 21:51

అమానుష రీతిలో ఎక్కడ ఎలాంటి దాడులు జరిగినా, సంబంధం ఉన్నాలేకపోయినా ఉత్సాహంగా ముందుకొచ్చి తన బలాన్ని ప్రదర్శించడం అన్నది అమెరికాకు ఆనవాయితీగా మారింది. ప్రజాస్వామ్య హక్కుల పేరిట, మానవత్వ రక్షణ పేరిట ఈ రకమైన చర్యలు చేపట్టని చరిత్ర అమెరికాకు ఎంతో ఉంది.

04/11/2017 - 21:50

ప్రపంచంలో అనేక దేశాల్లో అంతర్యుద్ధాలను చూశాం. సిరియా తరహాలో జరిగిన యుద్ధాలు చాలా తక్కువే. ఈ యుద్ధకాండ అడ్డూ అదుపూ లేకుండా సాగడానికి ప్రధాన కారణం..సిరియా అధ్యక్షుడు అసాద్‌ను రష్యా వెనకేసుకు రావడం.. ఆయన ప్రత్యర్థులను అమెరికా ఎగదోయడమే!

03/28/2017 - 22:06

బ్రెగ్జిట్ ప్రక్రియ ప్రారంభం కాకముందే ఐరోపా యూనియన్ నుంచి దూరమైతే బ్రిటన్ నష్టపోతుందన్న వాదనలు బలపడుతున్నాయి. లిస్బన్ ఒప్పందంలోని 50 అధికరణ అమలుకు బ్రిటన్ ప్రధాని ధెరిసా మే ముందుకెళితే..అనేక ఇబ్బందులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. దాదాపు రెండేళ్ల పాటు సాగే లావాదేవీల చర్చల్లో బ్రిటన్ ఎంత మేర తన ప్రయోజనాలను కాపాడుకోగలుగుతుందన్నది స్పష్టం కావడం లేదు.

03/28/2017 - 21:54

అరుణాచల్ ప్రదేశ్ మరోసారి వివాదాలకు వేదిక కాబోతోంది. అక్కడి తవాంగ్‌లో దలైలామా జరుప తలపెట్టిన కార్యక్రమంపై చైనా నిప్పులు చెరుగుతోంది. లామాను అనుమతించవద్దంటూ డ్రాగన్ చేసిన హెచ్చరికల్ని భారత్ బేఖాతరు చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 5న తవాంగ్‌లో ఏమి జరుగబోతోంది..లామాను అడ్డుకునేందుకు చైనా విసిరే తదుపరి పాచిక ఏమిటన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
**

03/28/2017 - 21:51

రెండేళ్ల క్రితం సౌదీ అరేబియా సారథ్యంలో మొదలైన వైమానిక దాడులకు నిరసనగా యెమన్ రాజధాని సనాలో జరిగిన ర్యాలీకి లక్షల్లో తరలివచ్చిన జనం. మాజీ అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సారథ్యంలో ఈ ర్యాలీ జరిగింది. సైనిక దాడులు ఆపాలంటూ దిక్కులు పిక్కటిల్లేలా ప్రజలు నినదించారు.

03/28/2017 - 21:48

టర్కీ ప్రధాని రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ జర్మనీ చాన్సరల్ మెర్కెల్‌పై నిప్పులు చెరుగుతున్నారు. నాటి నాజీ తరహా విధానాలనే అనుసరిస్తున్నారంటూ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య కలకలం రేపాయి. అదే క్రమంలో నెదర్లాండ్స్‌పైనా ఎర్డోగన్ కయ్యానికి కాలుదువ్వే రీతిలో వ్యవహరించడం అంతర్జాతీయంగా వివాదాన్ని రగిలిస్తోంది.

Pages