S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పాట్ లైట్

08/29/2017 - 22:02

చైనా తీరే వేరు! ఎక్కడ మెలిక పెట్టాలో అక్కడ పెట్టి చిద్విలాసంగా కూర్చుంటుంది. ఓ పక్క భారత్‌తో డోక్లామ్ వివాదాన్ని రగిలిస్తున్న డ్రాగన్ మరోపక్క ఉత్తర కొరియాను వెనకేసుకొస్తూ శాంతికి కొరివి పెడుతోంది. దేనికైనా తెగించే ట్రంప్‌ను సైతం ముందుకెళ్లకుండా చేస్తోంది. ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో చిక్కుకుని సతమతమవుతున్న వెనిజులా పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు ట్రంప్ ఉపక్రమించకుండా ముందరికాళ్లకు బంధం వేసింది.

08/22/2017 - 21:30

శరణార్థుల సంక్షోభం కొత్త పుంతలు తొక్కుతోంది. ఆఫ్రికా తదితర దేశాల్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో తలదాచుకునేందుకు ఇతర దేశాలకు పరుగులు పెడుతున్న వేలాది మంది అభాగ్యుల పరిస్థితి ఎప్పటికప్పుడు దయనీయంగా మారుతోంది. వీరి తాకిడి తట్టుకోలేక అనేక దేశాలు సరిహద్దులూ, సముద్ర మార్గాల్నీ మూసేశాయి. 2015లో శరణార్థుల సంక్షోభం పరాకాష్టకు చేరుకున్న నాటి నుంచి పరిస్థితులు ఎంతగానో మారాయి.

08/22/2017 - 21:29

పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రతిరూపంగా ఉన్న అమెరికా సాయం చేసినా దాని వెనుక ఓ స్వార్థం ఉంటుంది. ఓ చేతకాని దేశానికి చేయూతనిచ్చినా అందుకు ఓ బలమైన కారణమూ ఉంటుంది. 9/11 దాడి నేపథ్యంలో అమెరికా ఏకకాలంలో రెండు యుద్ధాలు చేసింది. ఓపక్క ఇరాక్‌పైనా, మరోపక్క అఫ్గాన్ పైనా సంకీర్ణ దళాల సాయంతో విరుచుకుపడింది.

08/22/2017 - 21:26

సింగపూర్, మలేసియాల మధ్య నలభై ఏళ్ల వివాదం తెరపై వచ్చింది. అమెరికా యుద్ధనౌక మరో వాణిజ్య నౌకను ఢీకొన్న మాట ఎలా ఉన్నా ఈ రెండు దేశాలు పాత గొడవను తవ్వుకుంటున్నాయ. సహాయ చర్యలకు తమ తమ బృందాలను పంపించాయ. ఈ ప్రాంతం సింగపూర్‌కే చెందుతుందని అంతర్జాతీయ న్యాయస్థానం చెబుతున్నా మలేసియా ఒప్పుకోవడం లేదు.

08/22/2017 - 21:23

రెండున్నర శతాబ్దాల రాజరిక వ్యవస్థకు చెరమగీతం పాడి పదేళ్ల క్రితం ప్రజాస్వామ్య పథంలో అడుగు పెట్టిన నేపాల్ ఇప్పటికీ ఆపసోపాలు పడుతూనే ఉంది. కొత్త రాజ్యాంగ ఏర్పాటుకు ఉద్దేశించిన పరిషత్ ఏర్పాటే వివాదాల మయంగా సాగిన విషయం తెలిసిందే. రాజరికాన్నయితే రాజకీయ పార్టీలు తోసిరాజనగలిగాయి కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలను, విలువలను ఔపోసన పడ్డడంలో విఫలమయ్యాయి.

08/22/2017 - 21:21

విద్వేష ప్రసంగాలు శాంతికి చేటు అంటూ బోస్టన్ ప్రజలు నినదించారు. వేలు కాదు..
లక్షల సంఖ్యలోనే వీధుల్లోకి వచ్చి రెచ్చగొట్టే మాటలను కట్టిపెట్టాలంటూ కదం తొక్కారు.

08/22/2017 - 21:19

నెలల తరబడి సాగించిన పోరాటం అనంతరం మొసూల్ పట్టణాన్ని ఐసిస్ మిలిటెంట్ల నుంచి చేజిక్కించుకోగలిగిన ఇరాకీ దళాలకు వాయవ్య ప్రాంతంలోని తల్ అపార్ అనే ప్రాంతం పెను సవాలుగా మారింది. క్రమంగా ఇరాక్‌లో పట్టును కోల్పోతూ వస్తున్న ఐసిస్ ఉగ్రవాదులు ఈ పట్టణంలో తిష్టవేశారు. దీన్ని రాబట్టుకునేందుకు ఆవిధంగా పూర్తిస్థాయిలో దేశంనుంచి ఐసిస్‌ను తరిమికొట్టేందుకు ఇరాకీ దళాలు వ్యూహాత్మకంగానే ముందుకు సాగుతున్నాయి.

08/15/2017 - 21:24

ప్రపంచ దేశాలన్నీ ముఖ్యంగా ఐరోపాను శరణార్థుల సంక్షేమం కుదిపేస్తోంది. ఉత్తరాఫ్రికాలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు ఒకవైపు, ఎంతమాత్రం మనుగడ సాగించలేని దయనీయ వాతావరణం మరొకవైపు కుదిపేస్తున్న నేపథ్యంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెడుతున్న శరణార్థులకు ఐరోపా దేశాలే దిక్కవుతున్నాయి. ఆ దిక్కూ ఇప్పుడు మూసుకుపోతోంది.

08/15/2017 - 21:23

సంక్షుభిత లిబియాలో శాంతియుత పరిస్థితుల పునరుద్ధరణకు రెండేళ్ల క్రితం ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో కుదిరిన ఒప్పందం అమలుపై రష్యా దృష్టి పెట్టింది. లిబియా సైనిక కమాండర్ ఖలీఫా హఫ్తర్, ఆయన ప్రత్యర్థి, ఐరాస మద్దతుతో కొనసాగుతున్న ప్రధాని ఫేయజ్ అల్ సర్రాజ్‌లు ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు పలికింది.

08/15/2017 - 21:21

గత వారం రోజులుగా అమెరికా, ఉత్తర కొరియాల మధ్య చెలరేగుతున్న వాగ్యుద్ధం అంతిమంగా సమరానికే దారితీస్తుందా? ఇటు కొరియా అధినేత కిమ్ జోంగ్, అటు అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పరం కవ్వించుకుంటూ పరస్పరం రెచ్చగొడుతున్న నేపథ్యంలో అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది అంతుపట్టడం లేదు.

Pages