S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పాట్ లైట్

06/27/2017 - 21:08

అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి అన్న చందంగా మారిన బ్రిటన్ సాధారణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తమ మైనారిటీ ప్రభుత్వాన్ని అధికారంలో కొనసాగించుకోవడానికి ప్రధాని థెరిసామే నానాతంటాలు పడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. గతంలోవున్న మెజారిటీ కూడా తగ్గిపోవడంతో ఇప్పుడు ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన పార్టీతో చేతులు కలిపితే తప్ప, అధికారంలో మనుగడ సాగించలేని దుస్థితి రావడంతో..

06/27/2017 - 21:06

ఎంత చేరువో అంత దూరం అన్నట్టుగా తయారైంది అమెరికా, రష్యాల పరిస్థితి. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన రెండు అగ్రరాజ్యాల మధ్య సిరియా చిచ్చు రగులుకుంది.

06/20/2017 - 21:34

కారుణ్యం కనికరం మూర్త్భీవించిన ఈ ముఖం చైనా పూజించే కారుణ్య దేవతామూర్తిది. ఆసియాలోనే అత్యంత ఘనంగా పూజలు అందుకునే
గువాన్ ఇన్ ప్రపంచ ఆర్తనాదాలను ఆలకించి అందరికీ అభయాన్నిచ్చే దయాగుణం ఈ దేవతకు ఉందన్నది చైనాలోనే కాదు ప్రపంచంలో అనేక దేశాల నమ్మకం థాయ్‌లాండ్‌లో అత్యద్భుత రీతిలో ఈ దేవతా విగ్రహాన్ని తీర్చిదిద్దుతున్నారు. అనేక అడుగుల ఈ భారీ విగ్రహానికి తుది నగిషీలు చెక్కుతున్న కార్మికుడు.

06/20/2017 - 21:32

బ్రిటన్ హక్కుల్ని పరిరక్షించుకుంటామని, ఐరోపాయూనియన్ నుంచి తమకు రావాల్సిన ప్రతిదాన్నీ పట్టుబట్టి మరీ రాబట్టుకుంటామంటూ ఊదరగొట్టిన ప్రధాని ధెరీసామేకు ఇప్పుడు రాజీబాటే మార్గమైంది. నిజానికి ఆమె అనుకున్నట్టుగా పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ వచ్చి ఉంటే సునాయాసంగానే ‘హార్డ్ బ్రెగ్జిట్’అంటూ దూసుకుపోయి ఉండేవారే.

06/20/2017 - 21:29

భారత్-అమెరికాల మధ్య ఎప్పుడు శిఖరాగ్ర భేటీ జరిగినా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తి, ఉత్కంఠ రేకెత్తుతుంది. జార్జిబుష్-మన్మోహన్ సింగ్, మన్మోహన్ సింగ్-బరాక్ ఒబామాల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి చర్చలు ఇరు దేశాల మధ్య సాన్నిహిత్యానే్న కాదు వ్యాపార,వాణిజ్య బంధాన్నీ ఇనుమడింపజేశాయి.

06/20/2017 - 21:24

ఫ్రాన్స్ అధ్యక్షుడిగా సంచలన విజయం సాధించిన ఇమాన్యుయెల్ మాక్రన్‌కు ఇప్పుడు పార్లమెంట్ కూడా చేతికి రావడంతో తన విస్తృత సంస్కరణల అజెండాపై దూసుకుపోయే అవకాశం దక్కింది. ఎవరూ ఊహించని రీతిలో పార్లమెంట్‌లో తిరుగులేని మెజార్టీ దక్కడంతో విపక్షాల అడ్డంకులతో సంబంధం లేకుండా మాక్రన్ ముందుకెళ్లేందుకు వీలుంది. అయితే ఏ దేశంలోనూ లేనంత బలంగా ఫ్రాన్స్‌లో యూనియన్లు ఉన్నాయి.

06/20/2017 - 21:30

భారత్ సహా ఐదు బలమైన ఆర్థిక వ్యవస్థలతో కూడిన బ్రిక్స్ అంతర్జాతీయంగా దూసుకుపోతోంది. గత పదేళ్లుగా భారత్,రష్యా,చైనా,దక్షిణాఫ్రికా కూటమిగా కొనసాగుతున్న బ్రిక్స్ ఇప్పటికే ధనిక దేశాల కూటములకు ప్రత్యామ్నాయంగా మారింది. మరో స్వర్ణ దశాబ్దిలోకి ప్రవేశించబోతోందంటూ బ్రిక్స్ కూటమిని చైనా అభివర్ణించడమే ఇందుకు నిదర్శనం.

06/13/2017 - 21:29

ముందస్తుగానే ఎన్నికలకు దిగిన బ్రిటన్ ప్రథాని ధెరీసామే పరిస్థితి మొదటికొచ్చింది. ఉన్నదీ, ఉంచుకున్నదీ పోయిననట్టుగా బ్రిటన్ ప్రజలు దిమ్మతిరిగే రీతిలో ఇచ్చిన తీర్పు అనేక రకాలుగా దేశ రాజకీయ పరిస్థితిని సంక్షోభంలో పడేసింది.

06/13/2017 - 21:26

బ్రిటన్‌లో తలెత్తిన తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ పర్యటనను అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ ఉన్న ఫలంగా వాయిదా వేసుకోవడం సర్వత్రా విస్మయానికి దారి తీసింది. అసలే సాధారణ ఎన్నికల్లో ఓడిపోయి మెజారిటీ కూడా రాని పరిస్థితిని ఎదుర్కొంటున్న థెరిసామే ప్రస్తుత పరిస్థితుల్లో బ్రిటన్‌లో అధికారికంగా పర్యటించవద్దంటూ ట్రంప్‌కు సలహా ఇచ్చినట్టు చెబుతున్నారు.

06/13/2017 - 21:24

తన ప్రాంతీయ, అంతర్జాతీయ ఆధిపత్యం కోసం చైనా చేపట్టిన బృహత్తర వన్ బెల్ట్ వన్ రోడ్ (ఓబిఓఆర్) ప్రాజెక్టు అందులో పాలుపంచుకుంటున్న భాగస్వామ్య దేశాలన్నింటి ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితిని కుంగదీసే సంకేతాలు కనిపిస్తున్నాయి. అత్యంత ఘనంగా ఈ ప్రాజెక్టును చైనా ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా..ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

Pages