S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పాట్ లైట్

05/23/2017 - 22:43

దశాబ్దాల ఇజ్రాయెల్-పాలస్తీనా పెను సమస్యకు పరిష్కారం అందేదెన్నడు? ఇజ్రాయెల్‌తో జరుగుతున్న నిరంతర పోరాటంలో తల్లడిల్లుతున్న పాలస్తీనా ప్రజల హక్కుల్ని కాపాడేదెవరు? గతంలో అమెరికా జోక్యంతో శాంతి చర్చలు జరిగినా ఎలాంటి ఫలితం రాలేదు. జార్జి బుష్, బరాక్ ఒబామా ఇలా ఒకరి తర్వాత ఒకరుగా వచ్చిన అమెరికా అధ్యక్షులు ఇజ్రాయెల్‌ను వెనకేసుకొచ్చారే తప్ప పాలస్తీనా వౌలిక డిమాండ్లను ఖాతరు చేయలేదు.

05/23/2017 - 22:41

ధిక్కారమే నైజంగా సాగుతున్న ఉత్తర కొరియా రానున్న కాలంలో ఇబ్బడి ముబ్బడిగా ఇటు బాలిస్టిక్ క్షిపణులను, అటు ఖండాంతర క్షిపణులను సమీకరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు అమెరికా ఆంక్షలను, అంతర్జాతీయ హెచ్చరికలను, ఐరాస తీవ్ర స్వరాన్ని పెడచెవిన పెట్టిన ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ తనకు అడ్డే లేదన్న రీతిలో దూసుకుపోతున్నారు.

05/23/2017 - 22:38

బ్రిటన్‌లో సడలుతున్న కన్సర్వేటివ్ పట్టు తాజా సర్వేలో తగ్గిన ఓట్ల శాతం
ప్రధాని థెరిసా మే తప్పటడుగులే కారణమా

05/23/2017 - 22:32

బ్రెజిల్‌లో రాజకీయ కల్లోలం తీవ్రమవుతోంది. అవినీతి కుంభకోణాల నేపథ్యంలో రాజీనామా చేయాలంటూ ప్రజల నుంచి వస్తున్న వత్తిళ్లను అధ్యక్షుడు మైకేల్ టెమర్ ఎంత మాత్రం ఖాతరు చేయడం లేదు. సుప్రీం కోర్టు ఈ విషయంలో ఆయనను మందలించినప్పటికీ రాజీనామాకు ససేమిరా అంటున్నారు. కావాలంటే తనను దించేయవచ్చని కూడా సవాల్ విసురుతున్నారు.

05/16/2017 - 21:27

రష్యాకు ఇప్పుడు సమస్యల మీద సమస్యలు.. సవాళ్ల మీద సవాళ్లు... ఓ పక్క కోల్పోయన అంతర్జాతీయ ప్రాబల్యాన్ని పునరుద్ధరించుకోవాలన్న ఆరాటం.. మరో పక్క ఉత్తర కొరియా, సిరియా సమస్యల్లో తలదూర్చి అమెరికాతో నెగ్గుకురావాలన్న ఆరాటం... అన్నింటికీ మిం అంతర్జాతీయ వేదికలపై బలంగా ఉనికిని చాటుకుంటున్న చైనాతో సామరస్యమా... సమరమా అనే మీమాంస...

05/16/2017 - 21:25

అర్థబలంతోపాటు అపారమైన ప్రాబల్యం కూడా ఒక దేశ ప్రతిష్టను, దాని ప్రభావశీలతను ఎంతగానో పెంచుతుంది. వర్ధమాన ప్రపంచంలో చైనా ఇదే వ్యూహంతో ముందుకు దూసుకుపోతోంది. ఒకదాని తర్వాత ఒకటిగా తనకు ప్రయోజనం కలిగించే, తనకు ఆర్థికంగా రాజకీయంగా లబ్ధిని చేకూర్చే ప్రాజెక్టులకు సంబంధించి రాజీలేని రీతిలోనే పావులు కదుపుతోంది.

05/16/2017 - 21:23

ప్రపంచ దేశాలు ఎంతగా ఒత్తిడి తెస్తున్నా, ఆంక్షలను విధిస్తూ కొరడా ఝళిపిస్తున్నా ఉత్తర కొరియా నాయకత్వం మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ఒకదాని తర్వాత ఒకటిగా క్షిపణులను పరీక్షించుకుంటూ ఇప్పుడు ఏకంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులే లక్ష్యంగా పావులు కదుపుతోంది. తాజాగా ఉత్తర కొరియా చేసిన క్షిపణి పరీక్ష విజయవంతం కావడం అమెరికా సహా పలు దేశాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.

05/16/2017 - 21:21

ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన బ్రిటన్ ప్రధాని ధెరీసామే ముందు అనేక సవాళ్లు పొంచి ఉన్నాయి. అసలు ఎంత మంది బ్రెగ్జిట్‌కు ఆనుకూలంగా ఉన్నారో తెలియాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఒక్కటే మార్గమని భావించిన ధెరీసా అందుకు అన్ని విధాలుగా సిద్ధమవుతున్నారు. బ్రెగ్జిట్ నుంచి బ్రిటన్ నిష్క్రమణకు అధికారికంగా నాంది పలికిన ఆమెకు ఇప్పుడు ఎన్నికల్లో నెగ్గడం ఓ పెద్ద సమస్యగా మారింది.

05/16/2017 - 21:18

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా అట్టుడుకుతున్న నిరసనలు, ఆగ్రహావేశాలు పరాకాష్టకు చేరుకున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రజలు ముసుగులు ధరించి ప్రభుత్వ విధానాల పట్ల, అధ్యక్షుడి తీరుపట్ట తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా అన్ని విధాలుగానూ వెనిజులా చితికిపోవడం, నిరుద్యోగం పెరిగిపోవడం, ప్రజల ఆదాయం అడుగంటి పోవడంతో సంక్షోభం తారస్థాయికి చేరుకుంది.

05/10/2017 - 00:31

ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య ఘర్షణ ఈనాటిది కాదు. దశాబ్దాలుగా అంతూ పొంతూ లేకుండా సాగుతున్న ఈ ఇరు దేశాల ఘర్షణలు తాజాగా మరింత తీవ్రమయ్యాయి. పాలస్తీనాలోని ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్, గాజా ప్రాంతాల విషయంలో ఇజ్రాయెల్ తాజాగా చేపట్టిన నిర్ణయాలకు నిరసనగా పాలస్తీనీయులు వీధికెక్కారు. నిరసనలు, ఘర్షణలతో పరిస్థితి హోరెత్తిపోతోంది. మండుతున్న ఓ టైరును బలంగా తన్నుతూ తన ఆగ్రహాన్ని చాటుతున్న ఓ పాలస్తీనా నిరసనకారుడు.

Pages