S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

04/13/2017 - 21:44

రాకేశ్ ఆనంద్ బక్షి...!
ఈ పేరు వినగానే ప్రఖ్యాత బాలీవుడ్ పాటల రచయిత ఆనంద్ బక్షి గుర్తుకువస్తే తప్పేం లేదు! ఎందుకంటే ఈ రాకేశ్, ఆ పాటల రచయిత తనయుడే. అతని గురించి ఇప్పుడెందుకు చెప్పుకోవలసి వస్తోందంటే అతను చేస్తున్న సమాజ సేవ వల్ల!

04/13/2017 - 21:40

అమీర్ ఖాన్ సినిమా త్రీ ఇడియట్స్‌లో అందర్నీ ఆకట్టుకునే ఓ సన్నివేశం ఉంది. అదేమిటంటే- హీరోయిన్ కరీనా కపూర్ సోదరికి అర్థరాత్రి వేళ పురిటి నొప్పులు మొదలవుతాయి. జోరున వర్షం. అంబులెన్స్ సౌకర్యం ఉండదు. కరీనా డాక్టరే అయినా ఆ సమయంలో ఇంట్లో ఉండదు. ఈ విషయం తెలిసి, అమీర్ ఖాన్ స్వయంగా ఫోన్‌లో కరీనాను సంప్రదిస్తూ విజయవంతంగా డెలివరీ చేస్తాడు.

04/07/2017 - 05:08

మొక్కల పెంపకానికి వినూత్న పద్ధతి
ముంబయికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ కృషి

04/07/2017 - 05:06

ఎలక్ట్రిక్ స్కూటర్లు రూపు రేఖలు మార్చుకుని చాలాకాలమే అయింది. ఈ మధ్య రకరకాల స్కూటర్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. పై ఫొటోలో ఉన్నది అలాంటిదే. పేరు ఓజో కమ్యూటర్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఒకసారి చార్జ్ చేస్తే 20 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇందులో ఉండే బిల్టిన్ బ్లూటూత్ స్పీకర్ల సాయంతో మ్యూజిక్ వినవచ్చు లేదా జీపీఎస్ డైరెక్షన్లను ఫాలో కావచ్చు. ధర రెండువేల డాలర్లు.

04/07/2017 - 05:05

అంగ వైకల్యంతో బాధపడుతున్నవారు మెట్లు ఎక్కాలంటే నరకమే. మన దేశంలోని అనేక రైల్వే స్టేషన్లలో దివ్యాంగులు పడే అవస్థలు వర్ణనాతీతం. ప్లాట్‌ఫామ్‌నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు మారాలంటే మెట్లు ఎక్కడం, దిగడం తప్పదు. అలాగే దివ్యాంగులు పని మీద ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలన్నా ఇబ్బందే. అయితే ఇకపై అలాటి అవస్థలు ఉండకపోవచ్చు. వారికోసం ప్రత్యేకంగా రూపొందించిన చైయిర్ మార్కెట్లోకి అందుబాట్లోకి రాబోతోంది.

04/07/2017 - 05:04

బిటెక్ చదివి, సెలబ్రిటీలకు చదువుచెబుతున్న పల్లవి విదేశీ విద్యార్థులకూ బోధన

04/07/2017 - 05:03

ఐఐటి మద్రాస్ విద్యార్థుల వినూత్న ప్రయోగం

04/07/2017 - 05:00

‘మనం ఒక్కళ్లమే ఏం చేయగలం?’- ఈ మాటలు చాలామంది నోట వినబడుతూ ఉంటాయి. ఎవరైనా సమాజానికి ఒకింత మేలు చేద్దామని భావిస్తే, ఆ వెంటనే వినబడే మాటలివే. వాస్తవానికి సమాజాన్ని మొత్తం ఉద్ధరించనక్కర్లేదు. కనీసం మన ఇంటి చుట్టుపక్కల పారిశుద్ధ్యాన్ని, పర్యావరణాన్నీ లేదా చిన్న పిల్లల సంక్షేమాన్ని..ఇలా ఏదో ఒక మంచి పనిని చేపడితే చాలు. అంతా ఇలా అనుకుంటే... సమాజం బాగుపడినట్టే.

04/07/2017 - 05:00

వైర్‌లెస్ బ్లూటూత్ హెడ్‌ఫోన్స్‌లో మాట్లాడటం బాగానే ఉంటుంది. కానీ, మాట్లాడాక వాటిని ఏ పర్సులోనో, జేబులోనే పెట్టుకోవాలంటే కాస్త ఇబ్బందే. అందుకనే ఇప్పుడు వేరబుల్ టెక్నాలజీని జోడించి, ఏకంగా చేతికే వీటిని తగిలించుకునే విధంగా గాడ్జెట్లను తయారు చేశారు. దీనిని హెలిక్స్ కఫ్ అంటారు. ఫొటోలో చూస్తున్నారుగా, బ్రేస్‌లెట్‌ను తలపించే ఈ కఫ్‌లోనే బ్లూటూత్ స్పీకర్, వైర్ ఉంటాయి.

03/30/2017 - 21:23

ఆకాశంలో తిరిగే మబ్బులు నేరుగా ఇంట్లోకే వచ్చేస్తే ఎలాగుంటుంది? థ్రిల్లింగ్‌గా ఉంటుంది కదూ! ఈ అసాధ్యాన్ని రిచర్డ్ క్లార్క్‌సన్ స్టూడియో సుసాధ్యం చేసింది. ఫ్లోటింగ్ క్లౌడ్ పేరిట బుల్లి బుల్లి మబ్బుల్ని ఇంట్లో తిరిగేలా చేసే టెక్నాలజీని సృష్టించి, ఈ స్టూడియో అందర్నీ ఔరా అనిపిస్తోంది. వాస్తవానికి ఇటో బ్లూటూత్ స్పీకర్. దీనికి మబ్బుల హంగులద్ది దానిని గాల్లో ఎగిరేలా చేశారు.

Pages