S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

03/30/2017 - 21:21

వేసవి వచ్చింది. నీటి ఎద్దడీ మొదలైంది.
ఆ కాలనీకి వాటర్ ట్యాంకర్లు వస్తున్నాయి. చుట్టూ జనం మూగుతున్నారు. రాజు-పేద అనే తేడా లేకుండా అందరూ బకెట్లు, బిందెల్లో నీళ్లు తీసుకెళ్తున్నారు.

03/30/2017 - 21:19

అంగవైకల్యం అనేది మన మానసికస్థితికి సంబంధించింది మాత్రమే. పట్టుదల,
పోరాడే తత్వం ఉంటే
దివ్యాంగులైనా అనుకున్నది సాధించగలుగుతారు
**
-ఈ మాటలు అన్నది ఏ వయోవృద్ధుడో, జీవితాన్ని కాచి వడపోసిన గొప్ప వ్యక్తో అనుకుంటే పొరబాటే. చిన్నతనంనుంచీ ఎదురైన అవమానాలను తట్టుకుని, ప్రతికూలతలతో పోరాడి జీవితంలో అనుకున్నది సాధించిన ఓ 36 ఏళ్ల యువకుడు అన్నమాటలివి.

03/30/2017 - 21:16

తెలంగాణ పోలీస్ శాఖలో రాధిక పేరు చెబితే అంతా ఇట్టే గుర్తు పడతారు. ఇటీవలే పోలీస్ ట్రెయినింగ్ కాలేజీ ప్రిన్సిపల్‌గా పదోన్నతి పొందిన రాధిక పర్వతారోహణలో దిట్ట. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హోదాలో ఉన్న రాధిక గతంలో ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరం-ఎవరెస్ట్‌ను అధిరోహించి, ఈ ఘనత సాధించిన ఏకైక మహిళా పోలీస్ అధికారిణిగా రికార్డు నెలకొల్పారు.

03/30/2017 - 21:08

వ్యర్థాలతో నిండిపోతున్న నదీ జలాలను శుద్ధి చేసేందుకు చవకలో ఓ రోబోను కనిపెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు ముంబయి విద్యార్థులు. వివేకానంద ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నడిచే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బిటెక్ చదువుతున్న కిరణ్ పార్టే, అజిత్ కృష్ణమూర్తి, పీయూష్ దేవికర్, కేదార్ పెడ్నేకర్ అనే విద్యార్థులు డఉ్గ్ళ్ద అనే రోబోను కనిపెట్టారు.

03/30/2017 - 21:07

పనిలో పడి పక్కనే కప్పులో పొగలు కక్కుతున్న కాఫీని మరచిపోతాం. కాసేపటికి గుర్తొచ్చి, చేతిలోకి తీసుకుంటే చల్లబడి పోయి ఉంటుంది. అయితే థాంకో యుస్‌బి పవర్డ్ పేపర్ కప్ వార్మర్‌ను కొనుక్కుంటే ఇక చల్లారిపోయిన కాఫీ తాగే అవస్థ ఉండదన్నమాటే. ఈ కప్‌ను యుఎస్‌బి ద్వారా కంప్యూటర్‌కు లేదా పవర్‌బ్యాంక్‌కూ కనెక్ట్ చేసుకుంటే చాలు, కాఫీ వేడెక్కుతుంది.

03/30/2017 - 21:05

పక్కనున్న ఫొటో చూస్తే ఏమనిపిస్తోంది? ఒకప్పుడు మన రోడ్లపై హల్‌చల్ చేసిన చేతక్ స్కూటర్‌లో సగభాగంలా అనిపిస్తోంది కదూ! యువతరాన్ని దృష్టిలో పెట్టుకుని బార్సెలోనాలోని బెల్ అండ్ బెల్ కంపెనీ తయారు చేసిన ఈ స్కూటర్ బ్యాటరీపై నడుస్తుంది. ఒకసారి చార్జి చేస్తే గంటకు 20 కిలోమీటర్ల వేగంతో 35 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ప్రస్తుతానికి వీటిని రోడ్లపైకి అనుమతించడం లేదట.

03/30/2017 - 21:04

ఆదివారం..
హిరిన్ ఇల్లంతా సర్దుతోంది. ఆమె ఏడేళ్ల కూతురు జియా తన తల్లికి పనిలో సాయం చేస్తోంది. అలమారా సర్దుతుంటే అందులో ఉన్న బొమ్మలన్నీ కింద పడ్డాయి. అవన్నీ జియా చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలు. వాటిని చూసి జియా.. ‘అమ్మా..వీటితో నేనిప్పుడు ఆడుకోవడం లేదు కదా... ఎవరికైనా ఇచ్చేయి’ అంది.

03/23/2017 - 22:29

హృద్రోగులకు ఊరటనిచ్చే సంఘటనలు ఇటీవలికాలంలో అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీకి చెందిన ఓ యువ న్యాయవాది ఆకాశాన్నంటే స్టెంట్ల ధరలపై న్యాయ పోరాటం సాగించి, వాటిని భూమార్గం పట్టించాడు. ఇప్పుడు ముక్కుపచ్చలారని ఓ పదిహేనేళ్ల యువకుడు ‘సైలంట్ హార్ట్ అటాక్స్’ను కనిపెట్టే పరికరాన్ని సృష్టించి, అందరి ప్రశంసలకూ పాత్రుడవుతున్నాడు. ఆ కుర్రాడి పేరు ఆకాశ్ మనోజ్.

03/23/2017 - 22:27

ఇష్టపడి పని చేస్తే, ఏదీ కష్టం కాదు. ఆఫీసు పనైనా అంతే. అయితే ఎంత ఇష్టమైనా, గంటల తరబడి పనిచేస్తూ ఉంటే, అలసట తప్పదు. ఆరోగ్యపరమైన సమస్యలూ తలెత్తుతాయి. కాబట్టి మధ్యలో కాస్త రిలాక్సేషన్ అవసరమే. ఇలాంటి ఉద్యోగులకోసం ప్రత్యేకంగా రూపొందిన ఓ ఆఫీస్ చైర్ మార్కెట్లో అందర్నీ ఆకట్టుకుంటోంది. చూడటానికి అచ్చం ఆఫీస్ చైర్‌లానే ఉన్నా, ఇదొక మస్సాజ్ చైర్. పేరు ఎగ్జిక్యూటివ్ ఎర్గోనమిక్ హీటెడ్ వైబ్రేటింగ్ చెయిర్.

03/23/2017 - 22:43

మన దేశంలో టాక్స్ లేని వస్తువేదైనా ఉందా?
ఎవరినడిగినా ఈ ప్రశ్నకు లేదనేదే సమాధానం!
కానీ కొన్నిటికి మాత్రం మినహాయింపు ఉంది...
అవేమిటో తెలుసా...కండోమ్స్, కాంట్రాసెప్టివ్ పిల్స్!
అవును నిజం...వీటికి టాక్స్ లేదు!
మనిషి తన దైనందిన జీవితంలో ఎక్కువగా వినియోగించే అనేక వస్తువులపై పన్ను పడుతూనే ఉంది. అలాంటివాటిలో మరీ ముఖ్యమైనది మహిళలు ఉపయోగించే శానిటరీ నాప్‌కిన్స్.

Pages