S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

12/29/2016 - 22:12

పాత నోట్ల రద్దు...పాత పగను కూడా చల్లార్చింది. నాసిక్‌లోని ఓ బ్యాంక్‌ముందు పాత నోట్లు మార్చుకునేందుకు క్యూలో నిలబడి ఉన్న ఓ కుర్రాడిపై అకస్మాత్తుగా నలుగురు వ్యక్తులు దాడి చేసి, అంతా చూస్తుండగానే చావబాదేశారు. అసలు సంగతి ఏంటా అని ఆరా తీస్తే, సదరు ప్రబుద్ధుడు ఓ 23 ఏళ్ల అమ్మాయిని ప్రేమించి, అవసరం తీరాక మొహం చాటేశాడు.

12/29/2016 - 22:11

తిరువనంతపురంలో ఓ చిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. 34ఏళ్ల వ్యక్తి ఒకరు నడుము దగ్గర తీవ్రమైన నొప్పితో అల్లాడుతూ ఆస్పత్రికి వెళ్లాడు. డాక్టర్లు పరీక్షలు గట్రా చేసి, అతని నడుము కింద భాగంలోంచి ఓ తుప్పుపట్టిన సూదిని తీశారు. ఇందులో ట్విస్టేమిటంటే, ఆ సూది గుచ్చుకున్నది అతనికి 12ఏళ్ల వయసున్నప్పుడు. అప్పట్లో డాక్టర్లు దానిని కనిపెట్టలేకపోయారట.

12/29/2016 - 22:10

వీధుల్లోనూ, గోడలమీద ఉమ్మేయకూడదంటూ సైన్ బోర్డులు కనిపిస్తాయి గానీ, కరెంటు వైర్లమీద వేయకూడదని ఎవరూ చెప్పలేదుగా..అనుకున్నాడో ఏమోగానీ, ఓ 21ఏళ్ల కుర్రాడు అదే పని చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఫస్ట్ఫో్లర్‌లో నివసించే మహమ్మద్ యాసిన్ గుట్కా తిని కిటికీలోంచి ఉమ్మేశాడు. కింద హైటెన్షన్ వైర్ ఉండటంతో షాక్ కొట్టి అక్కడికక్కడే కన్నుమూశాడు.

12/29/2016 - 22:09

ఐటి పరికరాల తయారీలో పేరొందిన జెబ్రానిక్స్ సంస్థ తాజాగా ఓ పవర్‌ఫుల్ స్పీకర్‌తో మార్కెట్లోకి వచ్చింది. యఉఱఱ361్గశ్రీ్ళ అనే ఈ 2.2 స్పీకర్‌తో థియేటర్ సౌండ్ సిస్టమ్‌ని ఇంట్లోనే ఆస్వాదించవచ్చంటున్నారు సంస్థ డైరెక్టర్ ప్రదీప్ దోషి. బ్లూటూత్ కనెక్టివిటీ, యుఎస్‌బి పోర్ట్, ఎస్‌డి సపోర్ట్, బిల్ట్ ఇన్ ఎఫ్‌ఎమ్ ట్యూనర్ వంటి సౌకర్యాలు అదనం. స్పీకర్‌లో ఉండే నాలుగంగుళాల సబ్ వూఫర్ల అవుట్‌పుట్ పవర్ 24 వాట్లు.

12/29/2016 - 22:06

సైకిల్ పెట్టుకునేందుకు ఇంట్లో చోటు లేదా? అయితే పార్కిస్ స్పేస్ సేవింగ్ బైసికిల్ లిఫ్ట్ కొంటే బెటర్. ఫొటోలో చూస్తున్నారుగా...ఇలా సైకిల్‌ను పార్క్ చేస్తే సరి.

12/22/2016 - 21:48

చిన్నారులకోసం ఓ స్మార్ట్‌వాచ్ మార్కెట్లో హల్‌చల్ చేస్తోంది. ఇది జిపిఎస్ ట్రాకింగ్ సౌకర్యం ఉన్న స్మార్ట్‌వాచ్. పేరు పోమో వాఫెల్. పిల్లలు ఎక్కడున్నారో పెద్దలు తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే దీని ప్రయోజనం అంతవరకే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇది చిన్నారులకు ఓ గైడ్‌లా పనిచేస్తుందట. ప్లే టైమ్, స్టడీ టైమ్, టైమ్ ఫర్ బెడ్..ఇలా ఎప్పుడెప్పుడు ఏమేం చేయాలో అలెర్ట్ చేస్తూ ఉంటుంది.

12/22/2016 - 21:45

పరుగుల వీరుడు మిల్ఖాసింగ్ గురించి అందరికీ తెలుసు. కామన్‌వెల్త్ గేమ్స్ అథ్లెటిక్స్ విభాగంలో పతకం తెచ్చి, భారత కీర్తిప్రతిష్ఠలను సమున్నతంగా నిలిపిన ఈ ఫ్లయింగ్ సిఖ్, ఆసియా క్రీడల్లోనూ పలు దఫాలు సత్తా చాటాడు. ఒలింపిక్స్‌లోనూ భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. విచిత్రమేమంటే...పరుగనే పదానికి అతనికి అర్థం తెలిసింది సైన్యంలో చేరాకే.

12/22/2016 - 21:41

తండ్రి శేఖర్ కపూర్ పెద్ద డైరెక్టర్. బండిట్ క్వీన్, మాసూమ్ వంటి సినిమాలు చూస్తే అతని సత్తా ఏంటో తెలుస్తుంది.
తల్లి సుచిత్రా కృష్ణమూర్తి సింగర్, రైటర్, యాక్టర్, మ్యూజిక్ కంపోజర్. ఆమె గురించి తెలీని వాళ్లకి షారుఖ్ హీరోగా ఆ మధ్య వచ్చిన ‘కభీ హా కభీ నా’ సినిమా చూస్తే చాలు.
తల్లిదండ్రులిద్దరూ బహుముఖ ప్రజ్ఞాపాటవాలు కలవాళ్లయినప్పుడు ఆ జీన్స్ బిడ్డకూ వస్తాయిగా!

12/22/2016 - 21:39

మార్కెట్లో రకరకాల డ్రోన్లు దొరుకుతున్నాయి. చివరకు పెళ్లిళ్లు జరిగినా, సభలు నిర్వహించినా కవరేజ్‌కి డ్రోన్లనే వాడుతున్నారు. గాలిలో ఎగురుతూ సమాచారాన్ని సేకరించే డ్రోన్లు, అలా సేకరించిన సమాచారాన్ని వీడియోల రూపంలో కిందకు చేరవేస్తాయి కూడా. జాతి వ్యతిరేక శక్తులు లేదా ఉగ్రవాదులు ఈ టెక్నాలజీని అందిపుచ్చుకుంటే ఎంత ప్రమాదమో ఊహించడం కష్టమే. ఇలాంటి డ్రోన్ల ఆటకట్టించేందుకు ఇప్పుడు ‘డ్రోన్ గన్’ తయారైంది.

12/22/2016 - 21:37

సాఫ్ట్‌వేర్ రంగంలోనే కాదు...స్వయం చోదక కార్ల (సెల్ఫ్ డ్రైవింగ్) తయారీలోనూ ఇక యాపిల్, గూగుల్ మధ్య పోటీ తప్పేట్టు లేదు. ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్.. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీ రంగంలోకి దిగిందన్న సంగతి తెలిసిందే. గత మూడేళ్లుగా గూగుల్ ఈ రంగంలో విశేష కృషి సల్పుతోంది. గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఇప్పటికే మిలియన్ మైళ్లు టెస్ట్ డ్రైవింగ్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది.

Pages