S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

12/22/2016 - 21:35

ఇది మరో స్నేహితుల జంట కథ. చదువుకున్నాం..ఉద్యోగాలు సంపాదించుకుని స్ధిరపడిపోదాం అనుకోకుండా తాము చదివిన చదువు పర్యావరణ హితానికి ఉపయోగపడితే మేలని భావించారు. ఆ దిశగా అడుగులేస్తున్నారు. భరత్ మామిడోజు, పారుపాటి మధుకర్‌రెడ్డి- హైదరాబాద్‌కు చెందిన కుర్రాళ్లు. భరత్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్‌నుంచి డిగ్రీ తీసుకున్నాడు. ‘గ్రీన్ థంబ్స్’ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థనూ నడుపుతున్నాడు.

12/22/2016 - 21:31

ఎముకలు బలంగా ఉండాలంటే శరీరానికి విటమిన్ డి అవసరం. ఇది సౌరశక్తి నుంచి లభిస్తుంది. కాసేపైనా ఎండలో తిరగమని డాక్టర్లు సలహా ఇచ్చేది అందుకే. అయితే ఎంతసేపు ఎండలో నిలబడాలి? శరీరానికి అందిన విటమిన్ డి ఎంత? వంటి విషయాలు ఎలా తెలుసుకోవడం? అలా తెలుసుకోవాలంటే పై ఫోటోలో చూపించిన రింగ్ వేలికి పెట్టుకుంటే సరి. దీని పేరు హీలియోస్ స్మార్ట్ రింగ్ విటమిన్ డి కోచ్.

12/22/2016 - 21:30

అసలే హెవీ ట్రాఫిక్. అర్జెంట్‌గా అటెండ్ కావలసిన మీటింగ్‌కు లేట్ అవుతున్నామనే టెన్షన్. అలాంటప్పుడు ఎవరైనా రోడ్డు సైన్‌ల గురించి పట్టించుకుంటారా? లేదు కదూ! అలాగని పట్టించుకోకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మరెలా? ఈ ప్రశ్నకు ఫోక్స్‌వాగన్ ఓ పరిష్కారాన్ని కనిపెట్టింది. అదే...డైనమిక్ రోడ్ సైన్ డిస్‌ప్లే.

12/22/2016 - 21:28

వాలర్ స్మార్ట్ ఆర్‌ఎఫ్‌ఐడి వాలెట్ మీ దగ్గరుంటే పర్సు పోయినా ఇక బెంగ అక్కర్లేదు. వాలెట్‌లో ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డుల్ని ఎవరైనా దుర్వినియోగం చేస్తారన్న భయం అంతకన్నా అక్కర్లేదు. ఇందులో ఉండే వాలర్ కార్డ్ హోల్డర్ ప్రత్యేకంగా డెబిట్, క్రెడిట్ కార్డులకోసం తయారు చేశారు. ఇందులో ఉండే బ్లూటూత్, బిఎల్‌టిఇ/జిపిఎస్ డివైస్‌ను ఓ మొబైల్ యాప్‌తో అనుసంధానిస్తారు.

12/16/2016 - 23:08

శీతాకాలం వచ్చేసింది. చలి గజగజ వణికిస్తోంది. వేసుకునే దుస్తులు, గ్లోవ్స్, బూట్స్ వంటివన్నీ మరింత వెచ్చదనాన్ని అందిస్తే బావుంటుందని అందరూ అనుకుంటారు. ఇదే ఆలోచనలో +టి అనే కంపెనీ ‘+వింటర్ హీటెడ్ ఇన్‌సోల్స్’ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇవి షూలో అమర్చుకుంటే చాలు, వెచ్చదనాన్ని పుట్టిస్తాయి. ఇవి ఏ బూట్ కయినా ఇట్టే సరిపోతాయి. ఇన్‌సోల్స్‌లో బ్యాటరీ ఉంటుంది.

12/16/2016 - 23:06

‘మొక్కే కదాని పీకేస్తే...పీక కోస్తా’ అంటాడు మెగాస్టార్ ఓ సినిమాలో!
నోయిడాకు చెందిన ఇద్దరు కుర్రాళ్లుకూడా అదే అంటున్నారు కాస్త అటూఇటూగా. ‘పీకే కదాని పారేస్తే మన పీకే తెగుతుంది’ అని.
పీకేమిటి..పారేయడమేంటి అనుకుంటున్నారు కదూ!
పీక అంటే..సిగరెట్ పీక! మన పీకే తెగుతుంది అంటే పర్యావరణానికి కలిగే హాని ద్వారా మనకే ప్రమాదమని.

12/16/2016 - 23:03

‘ఏటా డిసెంబర్ 2న ఐఎస్‌బి వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటారు. ఆ సందర్భంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ ఏడాది హైదరాబాద్, మొహాలీల్లోని ఐఎస్‌బి ఆవరణల్లో 60మంది మొక్కలు నాటారు’ అని వివరించారు ఐఎస్‌బి అసోసియేట్ డైరెక్టర్ వర్షా రత్నాపర్కె.
**

12/16/2016 - 23:01

కాబ్ డ్రైవర్‌గా ఈ మధ్యే పనిచేయడం మొదలుపెట్టినా, తన జీవితంలో మరపురాని సంఘటనలు ఎన్నో జరిగాయని చెబుతోంది మోనికా. ప్రయాణికులనుంచి రోజుకో కొత్తపాఠం నేర్చుకుంటానని చెప్పే మోనికా, కొన్ని సంఘటనల గురించి చెప్పింది.

12/08/2016 - 22:50

మార్కెట్‌ను రకరకాల వేరబుల్ కెమెరాలు ముంచెత్తుతున్నాయి. అలా అని కొత్త వాటికి చోటు లేదని కాదు. తాజాగా వచ్చిన పోగో కామ్ కెమెరాను చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవలసిందే. ఇది ప్రపంచంలోనే అతి చిన్నదైన అటాచబుల్ కెమెరా. కళ్లజోడు ఫ్రేమ్‌కు అటాచ్ చేసుకునేందుకు వీలుగా రూపొందించిన ఈ కెమెరాతో టకటకా 100 ఫొటోలు ఏకధాటిన తీసేయొచ్చు. అలాగే రెండు నిమిషాలసేపు వీడియో తీయొచ్చు కూడా.

12/08/2016 - 22:49

‘మీ ఇంటికొచ్చా...మీ నట్టింటికొచ్చా’ అంటూ ఓ హీరో పలికిన డైలాగ్ ఆ మధ్య బాగా పాపులర్ అయింది. అవే మాటలు ఓ రోబో పలికితే ఎలా ఉంటుంది!
ఆశ్చర్యంగా ఉంటుంది కదూ! లండన్‌కు చెందిన సైమన్ అనే మహిళ కూడా ఇలాగే బోలెడంత ఆశ్చర్యపోయింది. దానికి కారణం.. ఓ రోబో స్వయంగా వచ్చి, ఆమె ఇంటి తలుపు తట్టి ఆమె ఆర్డర్ ఇచ్చిన ఫుడ్‌ను సర్వ్ చేసి, బై చెప్పి వెళ్లిపోవడం!

Pages