S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

12/01/2016 - 21:37

స్పోర్ట్ షూస్ తయారీలో అగ్రగామి సంస్థ ఆడిడాస్ తాజాగా ‘అల్ట్రా బూస్ట్ అన్‌కేజ్డ్ పార్లే’పేరిట కొత్తరకం బూట్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. చూడముచ్చటగా ఉన్న ఈ బూట్లను రీసైకిల్డ్ ప్లాస్టిక్‌తో తయారు చేశారంటే నమ్మలేం. న్యూయార్క్‌కు చెందిన ‘పార్లే ఫర్ ది ఓషన్స్’ అనే స్వచ్ఛంద సంస్థతో కలసి పర్యావరణ హితమైన ఈ బూట్లకు ఆడిడాస్ రూపకల్పన చేసింది. సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు నానాటికీ పెరిగిపోతున్నాయి.

12/01/2016 - 21:35

మార్కెట్లో రకరకాల వేరబుల్ డివైస్‌లు దొరుకుతున్నాయి. ముఖ్యంగా అథ్లెట్లకు ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. ఇదే కోవలో వచ్చిన ఇన్‌బాడీ బాండ్ (inBody Band) వేరబుల్ డివైస్‌ను ఆల్ ఇన్ వన్‌గా చెప్పవచ్చు. అనేక సెన్సర్లు, యాక్సెలోమీటర్లతో రూపొందించిన ఈ డివైస్...హార్ట్ రేట్ చెబుతుంది. మార్నింగ్ వాకింగ్ చేస్తే, మీరు ఎన్ని అడుగులు వేశారో లెక్కగడుతుంది. ఎంత దూరం నడిచారో కొలుస్తుంది.

12/01/2016 - 21:33

రుద్ర నారాయణ్ ముఖర్జీ పేరు చెబితే జార్ఖండ్‌లోని సిందూర్పూర్ అనే కుగ్రామంలో ఎవరూ గుర్తు పట్టరు. కానీ, ‘రూరల్ సైంటిస్ట్’ అని అడిగి చూడండి. అందరూ రుద్ర గురించే చెబుతారు. అతని గురించి, అతను సాధించిన విజయాల గురించి వివరించేందుకు క్యూ కడతారు.

11/25/2016 - 04:28

ఓ పూట క్లాసులకు డుమ్మాకొట్టి
సినిమా చూస్తే మజాగానే ఉంటుంది.
మంచి దుస్తులు, మేకప్, పార్టీలు,
పార్కుల్లో విహారాలు..
ఇవన్నీ టీనేజ్ సందడిలో భాగమే.
అయితే అదొక్కటేనా.. ఏం చేయాలన్నా
పైసా కోసం పేరెంట్స్‌ను అడగాలి..
ఫీజుల బాదుడుకు తోడు ఇది కూడానా?
తల్లిదండ్రులకు భారం కాకుండా...
చదువు పాడవకుండా ఏదో ఒకటి చేయాలి.

11/25/2016 - 04:26

హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ (హెచ్‌బిసి) పేరు ఇప్పుడు అందరి నోళ్ళల్లోనూ నానుతోంది. దానికి కారణం-ఐక్యరాజ్య సమితి గుర్తింపే. ఈక్వడార్ రాజధాని క్విటోలో ఇటీవల జరిగిన యుఎన్ హాబిటట్-3 సదస్సు... అత్యుత్తమ సామాజిక పథకాలు చేపడుతున్న 20 సంస్థల్లో ఒకటిగా హెచ్‌బిసిని గుర్తించింది. ‘హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ సరికొత్త అర్బన్ ఎజెండాను ముందుకు తీసుకువెడుతోంది.

11/25/2016 - 04:24

ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన జాతీయ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు రజత పతకం లభించింది. పాతికేళ్ల తర్వాత సైక్లింగ్‌లో భాగ్యనగరానికి లభించిన పతకమిది. ఈ ఘనత సాధించింది...పరశురామ్ ఛెంజీ అనే 23 ఏళ్ల కుర్రాడు!

11/25/2016 - 04:23

బెడ్ ఎంత అద్భుతంగా ఉన్నా, చాలామందికి పడుకున్న వెంటనే నిద్ర రాదు. దానికి బెడ్‌ను నిందించి ప్రయోజనం లేదు. మైండ్ ప్రశాంతంగా ఉంటే, చెట్టుకింద పడుకున్నా హాయిగా నిద్ర పట్టేస్తుంది. ప్రముఖ ఐహోమ్ సంస్థ నిద్రలేమితో బాధపడేవారికోసం ఓ స్లీప్ థెరపీ స్పీకర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని పేరు ఐజడ్‌బిటి 10 స్పీకర్. ఇది లైట్ అండ్ సౌండ్ థెరపీతో పనిచేసే స్పీకరన్నమాట.

11/25/2016 - 04:21

బిర్లాల కుటుంబంనుంచి ఓ పాప్‌స్టార్
22 ఏళ్ల వయసులో బహుముఖ ప్రజ్ఞ

11/25/2016 - 04:19

రిమోట్‌తో నడిచే కార్ల గురించి తెలిసిందే. అయితే పైన ఫొటోలో మీరు చూస్తున్నది స్మార్ట్ఫోన్‌తో నడిచే కారు. ఇండికేటర్లు, లైట్లతో అటూ ఇటూ పరుగెత్తే ఈ బుల్లి కారును స్మార్ట్ఫోన్‌తో నడిపించేయొచ్చు. మరో మాట చెప్పాలంటే, ఆకారంలో చిన్నదే అయినా, పరుగులో మాత్రం రేస్ కార్లకు ఏమాత్రం తీసిపోదట. అంత స్పీడుగా పరుగెత్తుతుందట.

11/17/2016 - 21:47

టైర్లతో వచ్చిన చిక్కల్లా అవి పంక్చర్ పడుతూండటం. ట్యూబ్‌లెస్ టైర్లు మార్కెట్లోకి వచ్చినా, అవి పంక్చర్‌కు అతీతం కాదు. కాకపోతే, గాలి తొందరగా పోదంతే. అయితే నెక్సో ఎవర్ టైర్స్ కంపెనీ కొత్తగా తయారు చేసిన సైకిల్ టైర్లకు పంక్చర్ పడనే పడదట. ప్రత్యేకమైన పాలిమర్‌తో, కొత్తరకం టెక్నాలజీతో తయారు చేసిన ఈ టైర్లలో గాలి నింపే అవసరం లేదు.

Pages