S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

01/29/2016 - 04:26

బరువు తగ్గడం అంత వీజీ ఏం కాదు. లావుగా ఉన్నవారికి ఇదో పెద్ద ఛాలెంజ్. బరువు తగ్గాలని ఉన్నా, చాలామంది ఆహార నియమాలు పాటించరు. వ్యాయామం చేయాలంటే బద్ధకం. అలాంటివారికో సలహా. రోజూ ఓ ఫోటో తీసుకోవడం. అది కూడా తలనుంచి కాళ్లవరకూ శరీరం మొత్తం కనబడేలా. అలా రోజూ ఫోటోలు తీసుకుని చూసుకుంటూ ఉంటే అవే సన్నబడేందుకు మోటివేట్ చేస్తాయట. స్పెయిన్‌లోని అలికాంటే యూనివర్శిటీ చేసిన ఓ అధ్యయనంలో ఈ విషయం తేలిందట.

01/29/2016 - 04:25

జేమ్స్‌బాండ్ బుల్లి హెలికాప్టర్‌లో పారిపోతుంటే, విలన్ ఛేజ్ చేస్తూంటాడు. ఇంతలో అనుకోని అవాంతరం. ఎదురుగా విలన్ గ్యాంగ్ జెట్ ఫైటర్స్‌లో బాండ్ కాప్టర్‌ను ఢీకొట్టేందుకు వస్తూంటారు. జేమ్స్‌బాండ్‌కు ఒక్క క్షణం ఏం చేయాలో పాలుపోదు. ఆ వెంటనే తేరుకుని, ఓ బటన్ నొక్కుతాడు. అంతే...అప్పటికప్పుడు హెలికాప్టర్ సర్రున కింద ఉన్న సముద్రం వైపు దూసుకుపోతుంది. నీళ్ల మీదకి వచ్చేసరికి చక్రాలు లోపలకి వెళ్లిపోతాయి.

01/29/2016 - 00:30

విద్యుచ్ఛక్తిని ఆదా చేసే ఉపకరణాల తయారీలో పేరొందిన సంస్థ టెస్లా- ఓ కొత్త కారుతో మార్కెట్లోకి రాబోతోంది. దీని పేరు టెస్లా మోడల్ 3. ఇదో ఎలక్ట్రిక్ కార్. మార్కెట్లో ఇప్పటికే ఉన్న అన్ని రకాల కార్ల కంటే ఇది చౌకే కాదు..ఏ ఇతర లగ్జరీ కార్లకూ తీసిపోని విధంగా దీన్ని రూపొందించారట. ఇది మార్కెట్లోకి వస్తే, సామాన్యుడు సైతం కారెక్కగలుగుతాడన్నది నిపుణుల ఉవాచ.

01/29/2016 - 00:28

ప్రఖ్యాత సెర్చ్ ఇంజన్ కంపెనీ గూగుల్‌కి గత ఏడాది సోలార్ పవర్డ్ కాంటాక్ట్ పేరిట పేటెంట్ లభించింది. సింపుల్‌గా చెప్పాలంటే ఇవి కళ్లకు ధరించే కాంటాక్ట్ గ్లాసెస్‌ను తయారు చేసే విధానానికి లభించిన పేటెంట్ ఇది. ఈ గ్లాసెస్ కేవలం చూడటానికే కాదు...వీటితో ఇతర ప్రయోజనాలూ ఉన్నాయి. వీటిని ధరిస్తే, రక్తంలో చక్కెర, ఆల్కహాల్ స్థాయిలు ఎంత శాతంలో ఉన్నాయో ఎప్పటికప్పుడు లెక్కలు తీస్తాయి.

01/29/2016 - 00:27

వైఫై గురించి అందరికీ తెలుసు. దీనిని మించిన సాంకేతిక పరిజ్ఞానం త్వరలో రాబోతోంది. దాని పేరే లీఫై. మన ఇళ్ళలో కాంతులు విరజిమ్ముతున్న బల్బులే ఇకపై ఈ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్నీ మోసుకు రాబోతున్నాయి. ఎడిన్‌బర్గ్ యూనివర్శిటీలో మొబైల్ కమ్యూనికేషన్స్ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ హరాల్డ్... లీఫై సృష్టికర్త. ఆయన ఏం చెబుతున్నారంటే...రాబోయే కాలంలో ఎలక్ట్రిక్ బల్బులే బహుళ ప్రయోజనాలకు ఉపయోగపడతాయట.

01/29/2016 - 00:24

అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ల... కాదేదీ కవిత్వానికి అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. అదే అందం విషయానికొస్తే నారింజ తొక్క, యాపిల్ ముక్క, అలొవెరా చుక్క కూడా అనర్హం కావు. మిగతా రెండింటి మాటా ఎలా ఉన్నా నారింజ తొక్కలో మాత్రం అందాన్ని ద్విగుణీకృతం చేసే గుణాలు చాలానే ఉన్నాయట. విటమిన్ సి, విటమిన్ ఏ, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఈ తొక్కలో పుష్కలంగా ఉంటాయి.

01/29/2016 - 00:22

సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. సరికొత్త ఆవిష్కరణలు వెలుగుచూస్తున్నాయి. మొబైల్ ఫోన్ వెలుగుజూసిన రెండున్నర దశాబ్దాల్లో టెక్నాలజీ మానవ జీవితంపై చూపిన ప్రభావం మాటల్లో వర్ణించలేనిది. ఒకప్పుడు బ్యాంక్ ఖాతాలోంచి డబ్బు డ్రా చేయాలన్నా గంటల కొద్దీ క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి. మరోచోటికి డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయాలంటే చెక్కులో, మనీయార్డర్లో గతి.

01/29/2016 - 00:21

జాగృతి యాత్ర!
కొత్త విషయాలు నేర్చుకునేందుకు...
మనసులు కలబోసుకునేందుకు...
పరిచయాలు పెంచుకునేందుకు...
స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల్ని
కలుసుకునేందుకు...
ఉపయోగపడే యాత్ర!
విద్యార్థుల జాతర!
కాలేజీ అవర్స్ మధ్య కాస్తంత ఖాళీ దొరికితే సినిమాకు చెక్కేసే యువత!
స్టడీ అవర్స్‌లో వార్డెన్ కళ్లు కప్పి నెట్‌లో అవీ ఇవీ చూసే యువత!

01/19/2016 - 06:31

సిఇఎస్...కన్జూమర్ ఎలక్ట్రానిక్ షో. ఏటా జరిగే ఈ షోలో ప్రపంచంలోని ఎలక్ట్రానిక్ దిగ్గజాలంతా తమ ప్రోడక్ట్స్‌ను ప్రదర్శించడం మామూలే. లాస్‌వేగాస్‌లో ఇటీవలే ముగిసిన సిఇఎస్ కూడా ఇందుకు భిన్నం కాదు. స్మార్ట్ ఫ్రిజ్‌లు మొదలు 8కె టివీల వరకూ అన్నిటినీ ఇక్కడ ప్రదర్శించారు. అయితే కొన్ని లాప్‌టాప్స్...మరికొన్ని హేండ్‌సెట్స్..ఇంకొన్ని గాడ్జెట్స్ సందర్శకుల్ని కట్టిపడేశాయి. వీటిలో చాలావరకూ సరికొత్త ఆవిష్కరణలే.

01/19/2016 - 05:57

విండోస్ ఉండవు...డోర్లు ఉండవు...అద్దాలు ఉండవు... ఆపై టాప్‌లెస్- ఇవన్నీ ఓ సూపర్ కార్ ఫీచర్లు! ఏవీ లేకపోతే అది కారెలా అవుతుందనేగా మీ సందేహం? బిఎండబ్ల్యు సిరీస్‌లో తాజాగా వస్తున్న.. కాదు, ఊరిస్తున్న ఐ విజన్ కారు గురించి వింటే ఈ సందేహం రాక మానదు. కానీ చూస్తే మాత్రం అది కారేనని ఒప్పుకుని తీరాలి.

Pages