S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

03/09/2017 - 22:07

పెంపుడు కుక్కల్ని షికారు తీసుకెళ్లడం వీలవుతుందేమో కానీ, వాటితో రెండు మూడు కిలోమీటర్లు ప్రయాణించాలంటే ఇబ్బందే. చాలామంది కార్లలో తీసుకెళ్తూ ఉంటారు. కార్లు లేనివాళ్లు టూవీలర్స్‌పై కూర్చోబెట్టి తీసుకెళ్తారు కానీ..అది ప్రమాదకరం. పెంపుడు కుక్కల్ని తీసుకెళ్లేందుకు తాజాగా మార్కెట్లోకి ఓ బ్యాక్‌పాక్ వచ్చింది. దాని పేరు కె9 స్టోర్ట్స్ శాక్ ఎయిర్ డాక్ బ్యాక్‌పాక్.

03/09/2017 - 22:05

సునామికా డాల్స్!
అనామిక అనే పేరు విన్నాం. కానీ... ఈ సునామికా ఏంటి?
కాస్త ఆలోచిస్తే అందులో ఉన్న అర్థం...అంతరార్థం బోధపడతాయి.
సునామీలోంచి వచ్చిందే ఈ సునామికా అనే పేరు.
ఒక్క మాటలో చెప్పాలంటే సునామీ బాధితులకు ఈ ప్రాణం లేని బొమ్మ చేయూతనిస్తోంది.
అదెలాగంటే...

03/09/2017 - 22:03

మారథాన్ రన్ అంటే మక్కువ చూపే అథ్లెట్లకు ఈ పేరు సుపరిచితమే. 45 ఏళ్ల వయసులో వరుస మారథాన్లలో విజయపతాకను ఎగురవేస్తున్న బబిత, తాజాగా హైదరాబాద్‌లో ముగిసిన 30వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో 800, 1500, 5000 మీటర్ల విభాగాల్లో పతకాలను గెలుచుకున్నారు.

03/02/2017 - 21:15

ఆత్మరక్షణకు రకరకాల గాడ్జెట్లు అందుబాట్లో ఉన్నాయి. పెప్పర్‌స్ప్రే మొదలుకుని, కీచైన్‌లో దాగి ఉండే పదునైన చాకులాంటి ఆయుధం వరకూ రకరకాల గాడ్జెట్ల గురించి మనకు తెలుసు. అలాంటిదే మరొక గాడ్జెట్- టేజర్ పల్స్. చూడటానికి అచ్చం పిస్టల్‌లానే ఉంటుంది. కాబట్టి దీనిని చూసీ చూడగానే ఎదుటివ్యక్తి భయపడటం ఖాయం. అంతటితో దీని పని అయిపోలేదు.

03/02/2017 - 21:14

రైతుల కష్టాన్ని చూసి అంతా అయ్యో అనేవారే! వారి కష్టాన్ని తన కష్టంగా భావించేవారు మాత్రం ఒకరో ఇద్దరో! అలాంటి ఒకరిద్దరిలో ఒకడు -శివ
పంట పండించలేక, పండించిన పంటను అమ్ముకోలేక యాతన పడుతున్న అన్నదాతను ఆదుకునేందుకు నడుం బిగించాడు- పాతికేళ్ల శివ.

03/02/2017 - 21:12

డిగ్రీ పూర్తయింది మొదలు ప్రతి ఒక్కరికీ కెరీర్ సమస్య. ఉద్యోగ జీవితాన్ని ఎలా ప్రారంభించాలి? అనుకున్న లక్ష్యాలను ఎలా ప్రారంభించాలి? అన్నదే ప్రతి ఉద్యోగార్థికి ప్రధానమవుతుంది. మనం అనుకున్నది అనుకున్నట్లుగా ఏదీ జరగదు. కోరుకున్నదే తడవుగా ఏ ఉద్యోగమూ ఒళ్లో వాలిపోదు. అందుకు సంబంధించి ఎంతో తతంగం ఉంటుంది.

03/02/2017 - 21:09

బాధ్యత మరచి ప్రవర్తించే మనుషుల వల్ల పర్యావరణం పాడవుతోంది. అయితే ఇలాంటి సమాజంలోనూ బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించేవారూ ఉన్నారు. వారివల్లే పర్యావరణం కొన ఊపిరితోనైనా మనగలుగుతోంది.
***

03/02/2017 - 21:05

గాలిలో ఎగిరే బుల్లి బుల్లి విమానాలు...డ్రోన్లు.
వీటివల్ల ప్రయోజనాలు ఎన్నో, అక్రమార్కుల చేతిలో పడితే దుష్ప్రయోజనాలూ అనే్న ఉన్నాయి.
ఉగ్రవాదులు సైతం డ్రోన్లను ఉపయోగించి, విధ్వంసం సృష్టించే ప్రమాదం లేకపోలేదని అగ్రరాజ్యం అమెరికా సైతం తల్లడిల్లుతోంది.

03/02/2017 - 21:04

పెచ్చుమీరుతున్న కాలుష్యం మనిషిని వ్యాధుల బారిన పడేస్తోంది. ఆ మధ్య ఢిల్లీ నగరాన్ని కాలుష్య మేఘాలు కప్పేయడంతో పాఠశాలలకు సైతం సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాతావరణ కాలుష్యాన్ని తట్టుకునేందుకు మార్కెట్లో మాస్క్‌లు అందుబాట్లో ఉన్నా, వాటివల్ల ప్రయోజనం అంతంతమాత్రమే. అయితే ఢిల్లీ-ఐఐటికి చెందిన రీసెర్చర్లు కొందరు ఈ దిశగా చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి.

03/02/2017 - 21:02

రెజ్యూమె పంపించడం...ఇంటర్వ్యూకి హాజరు కావడం పాత పద్ధతి.
సెల్ఫీ వీడియో రెజ్యూమె పంపడం...ఉద్యోగం సంపాదించడం - కొత్త పద్ధతి!

Pages