S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

09/29/2016 - 21:45

‘పుట్టి పెరిగిన ఊరు మనకు ఎంతో ఇచ్చింది...ఎంతో కొంత తిరిగి ఇవ్వకపోతే లావైపోమూ!’

09/29/2016 - 21:43

కిక్-2 సినిమా ఫ్లాప్ అయినా అందులో ‘కుక్కురుకు’పాటను మాత్రం మ్యూజిక్ లవర్స్ మరిచిపోలేరు. ఆ పాట పాడింది పదహారేళ్ల అమ్మాయంటే ఎవరూ నమ్మలేరు కూడా. హైదరాబాద్‌కు చెందిన స్ఫూర్తి యాదగిరి ఇప్పుడు తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ఓ తాజా సంచలనం. ఆ మాటకొస్తే పదకొండేళ్ల వయసులోనే ‘యమహో యమ’ చిత్రంలో పాట పాడటం ద్వారా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది స్ఫూర్తి.

09/29/2016 - 21:39

గోరంత దీపం...కొండంత వెలుగు. ఈ నానుడిని నిజం చేస్తోంది లూమిర్ సి (జఖౄజూ ళ) లాంప్. కొవ్వొత్తి వెలిగేటప్పుడు ఎంతో శక్తి ఉత్పన్నమవుతుంది. ఇందులోంచి వెలువడే ఎలక్ట్రో మాగ్నటిక్ తరంగాలను గ్రహించి, వాటి సాయంతో వెలుతురు ప్రసరింపజేసే ఎల్‌ఇడి ల్యాంప్ ఒకటి త్వరలో మార్కెట్లోకి రాబోతోంది. కొవ్వొత్తిని వెలిగించి, దానిపై ఈ ల్యాంప్‌ను ఉంచితే మరింత కాంతి వెలువడుతుంది.

09/29/2016 - 21:38

హాయిగా సాగిపోతున్న వారి స్కూల్ జీవితంలో మిత్రుని అకాల మరణం తీవ్ర మనోవేదన మిగిల్చింది. అంతవరకూ చదువు, స్నేహం ఈ రెండే జీవితమన్నట్లు గడిపిన ఆ మిత్రబృందం తమలో ఒకరు ఇక లేరన్న బాధ, అందరూ కలిసి ఉన్నా అంతా ఒంటరన్న భావనలోకి చేరారు. అలా కొన్నాళ్లు గడిచాక మళ్లీ చదువు ధ్యాసలో పడినా, కోల్పోయిన మిత్రుని కోసం ఏదైనా చేయాలన్న తపన వారిలో మొదలైంది. ఈలోగా స్కూల్ దశ నుంచి కళాశాలకు మారింది జీవితం.

09/29/2016 - 21:33

షూ వేసుకు తిరగాలని అందరికీ ఉంటుంది. కానీ లేసుల దగ్గరే ఇబ్బంది. అర్జెంటు పనిమీద వెడుతున్నప్పుడు షూ వేసుకుని, లేసులు కట్టుకోవడమంటే చాలామందికి మహా చెడ్డ చిరాకు. అయితే మార్కెట్లోకి వచ్చిన ‘జూబిట్స్ షూ క్లోజర్స్’ (్చఖఇజఆఒ ఒ్ద్యళ ష్యఒఖూళఒ) కొనుక్కుంటే ఇక లేసులు కట్టుకోవడం పెద్ద పనే కాదు. లేసుల కొసల్ని ఈ మాగ్నెట్స్‌కి అమర్చుకోవచ్చు. మాగ్నెట్స్‌ని షూకి ఉండే చివరి మూడు హోల్స్‌కి అమరుస్తారు.

09/22/2016 - 22:13

ఫోటోలో మీరు చూస్తున్నది సోలార్ సన్ ట్రీ. చెక్కతో తయారు చేసిన ఈ బుల్లి చెట్టుపై కనిపిస్తున్నవి సోలార్ పేనల్స్. ఈ తొమ్మిది సోలార్ పేనల్స్‌తో మొబైల్ ఫోన్, ఎంపి3 ప్లేయర్ వంటి తొమ్మిది గాడ్జెట్లను ఒకేసారి చార్జ్ చేసుకోవచ్చు. కిటికీలో సూర్యకాంతి పడేచోట దీనిని ఉంచితే, ఇంటీరియర్ డిజైన్‌లో ఓ భాగమవుతుంది. చార్జర్‌గానూ ఉపయోగపడుతుంది. ధర 119 డాలర్లు.

09/22/2016 - 22:11

డెస్క్ వర్క్ చేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు సీటింగ్ అరేంజ్‌మెంట్ సరిగ్గా లేకపోతే మహా చెడ్డ చిరాకు. పక్క ఫోటోలో కనపడుతున్న సీట్ చూశారు కదా? ఇది ఎర్గోనోమిక్ డెస్క్ చైర్. చక్కటి సీటు... కాళ్లను హాయిగా ముడుచుకునేందుకు సీట్ కింద మరో సీట్. కూర్చునే సీట్‌కు బ్యాక్ సపోర్ట్ లేకపోవడం గమనించే ఉంటారు. ఇలా ఎందుకంటే...వెనక్కి వాలి కూర్చుంటే పోస్చర్ (్భంగిమ) సరిగ్గా ఉండక, వెన్నునొప్పి వస్తుంది.

09/22/2016 - 22:09

నారుపోసి, నీరుపోస్తే ఏ మొక్కయినా పెరిగి పెద్దదవుతుంది!
చేరదీసి, చేయూతనిస్తే మోడువారిన ఏ జీవితమైనా గాడిన పడుతుంది!
కావలసిందల్లా స్పందించే గుణం.
వెన్నుతట్టి, వెనకుండి నడిపించే మానవతా హృదయం!
జయవేల్ జీవితాన్ని తరచి చూస్తే.. అదే విషయం బోధపడుతుంది.
ఇంతకీ ఎవరీ జయవేల్!

09/22/2016 - 22:05

టెక్నాలజీ...రెండువైపులా పదునున్న ఓ ఆయుధం. మంచైనా, చెడైనా దీనితో సాధ్యమే. రోబోలు వస్తున్నాయి...మానవ జీవితంలో భాగమవుతున్నాయని సంబర పడినన్ని రోజులు పట్టలేదు...వాటి వల్ల వినాశం తప్పదని తెలుసుకోవడానికి.

09/22/2016 - 22:00

మనసు పొరల్లో నైరాశ్యం చీకట్లు ఆవరించినపుడు ఆత్మహత్య ఎలాంటి పరిష్కారం కాదని, కాసేపు స్థిమితంగా ఆలోచిస్తే కుంగుబాటుపై తిరుగుబాటు బావుటా ఎగరేయ వచ్చని గౌహతి ఐఐటి పూర్వ విద్యార్థిని రిచా సింగ్ భరోసా ఇస్తున్నారు. మానసిక ఒత్తిళ్లతో సతమతమయ్యే వారిలో భావోద్వేగాలను నియంత్రించి, వారికి ఆసరాగా నిలిస్తే ఆత్మహత్యలను నివారించడం అసాధ్యమేమీ కాదని ఆమె అంటున్నారు.

Pages