S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

09/01/2016 - 21:41

హెడ్‌ఫోన్స్‌ను తలకుపెట్టుకుని వింటే బాగానే ఉంటుంది. కానీ, మ్యూజిక్ విన్నాక, వాటిని ఎక్కడ, ఎలా భద్రపరచాలో తెలీదు. టీపాయ్‌మీదో, వార్డ్‌రోబ్‌లోనే పారేస్తాం. అయితే హెడ్‌ఫోన్స్‌ను పెట్టుకునేందుకు తాజాగా ఓ స్టాండ్ మార్కెట్లోకి వచ్చింది. ప్లై ఉడ్‌తో తయారు చేసిన ఈ హెడ్‌ఫోన్స్ హోల్డర్ చూడటానికి అందంగా ఉంటుంది. హెడ్‌ఫోన్స్‌ను దానికి తగిలిస్తే మరింత అందాన్ని సంతరించుకుంటుంది.

09/01/2016 - 21:39

టెక్నాలజీ విస్తృతి పెరిగాక అనేక వస్తువుల ఆకృతిలోనూ మార్పు వచ్చింది. వాక్యూమ్ క్లీనర్లూ అందుకు మినహాయింపు కాదు. ఫోటోలో కనబడుతున్నది కూడా వాక్యూమ్ క్లీనరే. చూస్తే అలా లేదు కదూ! కానీ, అతి చిన్న ఈ పరికరం తనంతట తానుగా బొంగరంలా తిరుగుతూ ఇల్లంతా శుభ్రం చేసేస్తుంది. పైగా చప్పుడు చేయకుండా పనిచేయడం దీని ప్రత్యేకతట. శక్తిమంతమైన బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ వాక్యూమ్ క్లీనర్ పేరు ఐలైఫ్ వి7 (Ilife V7)

09/01/2016 - 21:36

గతంలో ఎన్నడూ లేని విధంగా దేశవ్యాప్తంగా ఐదేళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకూ క్రీడల పట్ల ఎనలేని ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా సింధూ, కర్మాకర్, దీపలు సాధించిన ఒలింపిక్ విజయాలు యువతుల్లో తాము భిన్న క్రీడా రంగాల్లో రాణించాలన్న పట్టుదలను పెంచాయ. జీవితంలో చదువెంత ముఖ్యమో ఆటలు అంతే ముఖ్యం ఒకప్పుడు చదువుకుంటేనే ఉద్యోగమన్న భావన బలంగా ఉండేది.

08/25/2016 - 23:47

చూడటానికి మామూలు గొడుగులా ఉన్నా, ఈ రంగురంగుల అంబ్రెల్లా టెక్నాలజీనే పొదివి పట్టుకుందంటే ఆశ్చర్యపోతారు. ఇది ఇంటర్‌నెట్‌తో కనెక్ట్ అయిన గొడుగంటే నమ్మగలరా? అవునండీ...నిజం. దీని పేరు హజ్ అంబ్రెల్లా (్హయ శ్రీౄఇళ్ఘ). తైవాన్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ‘హజ్’ రాపొందించిన గొడుగు ఇది. స్మార్ట్ఫోన్‌తో దీనిని ఆపరేట్ చేయొచ్చు. ఒక్కసారి క్లిక్ చేస్తే తెరుచుకుంటుంది. మూసుకుంటుంది.

08/25/2016 - 23:46

సైన్స్ ఫిక్షన్ సినిమాలు గానీ, జేమ్స్ బాండ్ మూవీస్ గానీ చూసేవారికి వాటిలో వాడే
చిత్ర విచిత్రమైన గాడ్జెట్లు అబ్బురపరుస్తాయి. అవి సినిమాలకే పరిమితమనుకుంటాం.
కానీ, నిజ జీవితంలోనూ అలాంటివి ఉన్నాయంటే నమ్మలేం. టెక్నాలజీ మహిమ మరి!
ముఖ్యంగా వేరబుల్ డివైసెస్‌లో ఇటీవలి కాలంలో ఎన్నో అద్భుతమైన గాడ్జెట్లు మార్కెట్లోకి

08/25/2016 - 23:45

హడావిడిగా ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు స్మార్ట్ఫోనో, పెన్నో, పర్సో ఏదో ఒకటి మరచిపోతుంటాం. మధ్య దారిలో గుర్తొచ్చినా, ఇక ప్రయోజనం ఉండదు. అలా మరిచిపోతే మనకు గుర్తు చేసే గాడ్జెట్ పేరే ‘ట్రాకీస్’ (్ఘరీరీజళఒ). చిన్న సైజు కాయిన్‌లా ఉండే ట్రాకీస్‌ను ముఖ్యమైన వస్తువులకు అటాచ్ చేస్తే సరి. వాటిని మరచిపోతే వెంటనే ‘సౌండ్’ చేయడం ద్వారా మనల్ని అలెర్ట్ చేస్తుంది.

08/25/2016 - 23:44

మనం భుజానికి తగిలించుకునే బ్యాగ్‌కే సోలార్ పేనల్స్ ఉంటే ఎంత బాగుంటుంది? స్మార్ట్ఫోన్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు చార్జ్ చేసుకోవచ్చు కదా! సరిగ్గా ఓ కంపెనీకి ఇదే ఆలోచన వచ్చింది. ‘సన్ స్ట్రాప్’ అనే విలక్షణమైన గాడ్జెట్‌కు రూపకల్పన చేసింది. వీటిని బ్యాగ్ హ్యాండిల్స్‌లో అమర్చారు.

08/25/2016 - 23:42

దీర్ఘకాలిక వ్యాధులతో మంచానికే పరిమితమైనవారికి ఉపచారాలు చేయడం కష్టమే. ముఖ్యంగా వారిని ఎత్తుకుని బాత్‌రూమ్‌కి తీసుకెళ్లడం వంటివి మరీ కష్టం. ఇలాంటి పనులు చేసేందుకు ‘రీకెన్’, సుమిటోమో రికో కంపెనీలకు చెందిన ఉమ్మడి శాస్తవ్రేత్తల బృందం ‘రోబేర్’ (్గ్యఇళ్ఘూ) అనే రోబోను తయారు చేసింది. రోగులను మంచంమీదనుంచి లేపి, వీల్‌చైర్‌లో కూర్చోపెట్టడం, నడిచేటప్పుడు సాయం చేయడం వంటివన్నీ ఈ రోబోయే చేస్తుంది.

08/25/2016 - 23:40

ఫోటోలో చూస్తున్న సాక్స్‌ను ఏదో ఆషామాషీ సాక్స్ అనుకుంటే పొరబడినట్టే. ‘డైనీమా’ అనే ఫ్యాబ్రిక్‌తో చేసిన విశిష్టమైన సాక్స్ ఇవి. చూడటానికి సాదారణమైనవే అనిపించినా, నీళ్లలో తేలే గుణం కలిగి ఉంటాయి. అలాగే ఎండకు, తేమకు, రసాయనాలకు పాడవవు. ఉక్కుకంటే 15 రెట్లు గట్టివి. స్విట్జర్లాండ్‌కు చెందిన బేర్‌ఫుట్ కంపెనీ తయారు చేసిన ఈ సాక్స్ పూర్తి పేరు ‘ఫ్రీ యువర్ ఫీట్’.

08/25/2016 - 23:37

చూడటానికి హెడ్‌బ్యాండ్‌లా ఉన్న ఈ గాడ్జెట్‌లో చాలా విశేషాలే ఉన్నాయి. వాస్తవానికి ఇవి హెడ్‌ఫోన్స్. కానీ అలా కనిపించవు. అంతేకాదు... మీ స్మార్ట్ఫోన్‌కు వచ్చే కాల్స్‌ను ఆన్సర్ చేస్తుంది. ఈ గాడ్జెట్‌లో ఉండే సెన్సర్లు సౌండ్‌ను చెవికి చేరవేస్తాయి. బ్లూటూత్ సాయంతో వైర్‌లెస్ ఆడియో స్ట్రీమింగ్‌కోసం స్మార్ట్ఫోన్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇంతకీ ఈ గాడ్జెట్ పేరు చెప్పలేదు కదూ... బ్యాట్‌బ్యాండ్.

Pages