S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

02/11/2016 - 23:46

సైకిళ్లు మొదలుకొని కార్లవరకూ అద్దెకివ్వడం తెలుసు. ఇళ్లు అద్దెకివ్వడం కూడా తెలిసిందే. కానీ మొబైల్ ఫోన్లను అద్దెకిచ్చే కానె్సప్ట్ గురించి విన్నారా? ఎల్‌జి, శామ్‌సంగ్ వంటి ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీలకు పుట్టినిల్లయిన దక్షిణ కొరియా ఈ సరికొత్త కానె్సప్ట్‌కి తెరతీసింది. అక్కడ ఎస్ టెలికామ్ అనేది అతిపెద్ద వైర్‌లెస్ టెలీకమ్యూనికేషన్స్ ప్రొవైడర్.

02/11/2016 - 23:45

ఇ కామర్స్‌లో అందె వేసిన చేయిగా పేరొందిన అమెజాన్ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. ఇంట్లో పూజ తలపెట్టారా? అయితే పూజారిని కూడా మేమే పంపిస్తామంటూ సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. అఫ్‌కోర్స్! ఈ ఆఫర్ ఇండియాలో కాదు...జపాన్‌లో! జపాన్‌లో బౌద్ధమతస్థుల కోసం ఇలాంటి ఆఫర్ ఇచ్చి అందర్నీ అమెజాన్ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తాజాగా తన వెబ్‌సైట్‌లో ‘ఓబో సాన్-బిన్’ అనే సర్వీస్‌ను మొదలు పెట్టింది.

02/04/2016 - 23:40

ఆత్మవిశ్వాసమే విజయ సోపానం. సవాళ్లు ఎంత
కఠినమైనా వాటిని సునాయాసం చేసుకోవడానికి
తోడ్పడేది మనోధైర్యం. నేటి పోటీ వాతావరణంలో
ఏదీ సునాయాసం కాదు. కష్టసాధ్యమే! మిమ్మల్ని మీరు
తీర్చిదిద్దుకోండి.సవాళ్లకు బెదిరిపోతే అవి మరింతగా భయపెడతాయి. డోలాయమానం వీడండి. పలాయన ధోరణి పక్కన పెట్టండి. అవకాశాల ప్రపంచంలో
విజయాల వేటను సాగించండి.

02/04/2016 - 23:38

100 కిలోమీటర్ల నడక
48 గంటల్లో లక్ష్యసాధన
- అంటే...దాదాపు గంటలో రెండు కిలోమీటర్లుపైనే నడవాలి. ఒకటో రెండో కిలోమీటర్లయితే ఫరవాలేదు. కానీ ఏకధాటిగా వంద కిలోమీటర్లు నడవాలంటే కత్తిమీద సామే! ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళల బృందం.

02/04/2016 - 23:36

ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యాన్‌ను చూశారా? ‘వ్యానే కదా..వింతేముంది’ అనుకుంటున్నారు క దూ! అది మామూలు వ్యాన్ కాదండీ. డ్రైవర్‌లెస్ వ్యాన్. అది కూడా ప్రజా రవాణాకోసం రూపొందించిన వ్యాన్ మరి. స్టీరింగ్ వీల్, పెడల్స్ వంటివేవీ దీనికి ఉండవు. ఆటోమెటిక్ డోర్స్ ఉంటాయి. బ్యాటరీతో నడిస్తుంది. ఒకసారి చార్జ్ చేస్తే ఈ వ్యాన్ 100 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇందులో ఉండేవి ఆరు సీట్లే.

02/04/2016 - 23:36

డ్రోన్స్...తలెత్తి ఆకాశంలోకి చూస్తే చిన్నపాటి లోహ విహంగాలు ఎగురుతూ కనిపిస్తాయి. అవే డ్రోన్స్. ఇండియాలో కాకపోయినా, ఐరోపా దేశాల్లో వీటి అమ్మకాలు లక్షల్లో జరుగుతున్నాయి. తక్కువ ఎత్తులో ఎగిరే హెలికాప్టర్లకు, చిన్నపాటి తేలిక విమానాలకు ఈ డ్రోన్లు అడ్డుపడి ప్రమాదాలు జరుగుతున్న సంఘటనలు నానాటికీ పెరుగుతున్నాయి.

02/04/2016 - 23:35

సమస్యలోంచే పరిష్కారం పుట్టుకొస్తుంది. ఆలోచిస్తేనే సరికొత్త ఆవిష్కరణ వెలుగుచూస్తుంది. ఎంతోమందికి కరదీపికలా మారి వారి జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతుంది. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు విద్యార్థుల విషయంలో అదే జరిగింది!

02/04/2016 - 23:33

జాగింగ్, రన్నింగ్ చేసేవారికి సెల్‌ఫోన్, వాటర్ బాటిల్ వంటివి వెంట తీసుకువెళ్లడం తలనొప్పితో కూడిన పని. రన్నింగ్ చేసేటప్పుడు వాటిని ఎక్కడ పెట్టుకోవాలో తెలీదు. ఎక్కడైనా పెట్టి రన్ మొదలెడితే, దాహం వేస్తే నీళ్లు దొరికేదెలా? ఇలాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని రూపొందిందే రన్టిమేట్. నడుముకు పెట్టుకునే బెల్ట్ ఇది. ఇందులో తాళం చెవులు, క్యాష్‌తోపాటు వాటర్ బాటిల్, స్మార్ట్ ఫోన్ వంటివీ పెట్టుకోవచ్చు.

01/29/2016 - 04:33

నడుం వంచకుండా, నిటారుగా కూర్చోవాలని డాక్టర్లు చెబుతూంటారు. లేదంటే నడుం, మెడ నొప్పితో బాధపడతారని వార్నింగ్ ఇస్తూంటారు. కాని పని ఒత్తిడిలో పడి చాలామంది ఈ సలహాను మరిచిపోతూంటారు. అలాంటివారికి బ్రిడ్జ్ పోజ్ ఓ చక్కటి పరిష్కారం. ఫొటోలో చూస్తున్నారుగా... దానే్న బ్రిడ్జ్ పోజ్ అంటారు. దీనినే యోగాలో సేతుబంధాసనం అంటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా తరచూ ఈ ఆసనం వేస్తారట.

01/29/2016 - 04:31

రైల్వే స్టేషన్లూ, బస్టాండ్లకూ వైఫై సౌకర్యం విస్తరిస్తోంది. కర్నాటక ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి, ఉడిపి బీచ్‌కూ వైఫై సౌకర్యం కల్పించింది. బీచ్‌కు వచ్చినవారు ఎంచక్కా బిఎస్‌ఎన్‌ఎల్ పుణ్యమాని ఇకపై వైఫైను ఉచితంగా వినియోగించుకోవచ్చు. అయితే తిరకాసేంటంటే... ఈ సౌకర్యం ఎవరైనా కేవలం అరగంట మాత్రమే వినియోగించుకోవాలి.

Pages