S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

08/11/2016 - 21:40

సిరులొలికించే చిన్నారుల నవ్వులే తల్లిదండ్రులకు మణిమాణిక్యాలు. ఉయ్యాలలో నిద్రపోతూ, మధ్య మధ్యలో నవ్వులు చిందించే పసికందుల్ని చూసి ఆనందపడని అమ్మా నాన్న ఉంటారా? అలాగే వారి చిలిపి చేష్టలు కూడా ఎంతో ఆనందం కలిగిస్తాయి. అలాగని అన్ని వేళలా చిన్నారులను చూస్తూ ఉండిపోలేం. ఒకవేళ పసికందుల్ని ఆయాకు అప్పగించి బయటకు వెళ్లాల్సి వస్తే, ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారోనని మనసంతా చిన్నారుల చుట్టూనే తిరుగుతుంటుంది.

08/11/2016 - 21:36

‘మార్నింగ్ వాక్’తో మానసిక ప్రశాంతతే కాదు, ఒక్కోసారి మంచి ఆలోచనలు అక్షరరూపం రూపుదిద్దుకుంటాయని హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవిరళ్ విషయంలో నిజమైంది. ఈ మధ్య ఓ రోజు అతను మార్నింగ్ వాక్‌లో ఉండగా- రియో ఒలింపిక్స్‌లో భారతీయ ఆటగాళ్ల నైపుణ్యం ఎలా ఉంటుందోనని అదేపనిగా ఆలోచించాడు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించాలని ఆరాటపడే మన ఆటగాళ్ల కోసం ఏదో ఒకటి చేయాలని పరితపించాడు.

,
08/11/2016 - 21:33

స్కై డైవర్లకు పారాచూటే ప్రాణం. అది లేకుండా దూకమంటే దూకేందుకు వెర్రివాళ్లు ఎవరూ ఉండరు. కానీ అలాంటి సాహసం చేశాడు లూక్ ఐకిన్స్. పారాచూట్ లేకుండా పాతిక వేల అడుగుల ఎత్తునుంచి దూకి, ప్రపంచంలోనే ఇలాంటి ఫీట్ చేసిన మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ సాహసోపేత విన్యాసంలో ఏ మాత్రం తేడా వచ్చినా లూకిన్స్ ప్రాణాలు గాల్లోనే కలిసిపోయి ఉండేవి. ఐకిన్స్ పేరొందిన స్కై డైవర్.

08/11/2016 - 21:29

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి అందరికీ తెలుసు. మరి, ఇంటర్నెట్ ఆఫ్ క్లోత్స్ గురించి తెలుసా? లేదు కదూ! బర్మింగ్‌హామ్ సిటీ యూనివర్శిటీకి చెందిన ఓ పరిశోధకుల బృందం ఆలోచన ఇది. అసలు విషయానికొస్తే... మార్కెట్లో కంటికి నదరుగా కనిపించిన దుస్తులు కనిపిస్తే కొనేయడం చాలామందికి అలవాటు. అలా వార్డ్‌రోబ్ నిండిపోతుంది. వాటిలో రోజూ వేసుకునేవి మాత్రం కొనే్న. ఇది చాలామందికి అనుభవైకవేద్యమే.

08/04/2016 - 22:27

జంతువుల్ని పెంచుకోవడం బాగానే ఉంటుంది గానీ, అర్జెంటు పని మీద ఒకటి, రెండు రోజులు వాటిని ఇంట్లో వదిలి బయటకు వెళ్లాలంటేనే మహా ఇబ్బంది. వాటి బాగోగులు చూసే వారెవరూ ఉండరంటూ మన పనిని పోస్ట్‌పోన్ చేసుకోక తప్పదు. అయితే ‘పెట్ చాట్స్’ (ఔళఆ ష్ద్ఘఆచీ) అనే గాడ్జెట్‌ను కొనుక్కుంటే ఇక ఆ బాధే ఉండదు. ఇదో వీడియో ఫోన్ పరికరం. దీనిని పెంపుడు జంతువుల ఎత్తులోనే గోడకు అమర్చి, వైఫైతో కనెక్ట్ చేయాలి.

08/04/2016 - 22:26

ఈ పేరు చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ అతని గొంతును విననివాళ్లు అంటూ ఎవరూ ఉండరేమో! ముఖ్యంగా నార్త్ ఇండియన్స్‌కి అతని వాయిస్ చిర పరిచయమే.

08/04/2016 - 22:18

సైకిలంటే రెండు చక్రాలు ఉండాల్సిందేనా? ఎందుకంటున్నాడు మాంట్రియేల్‌కు చెందిన కార్ల్ డేజ్‌నయాస్. వింత వింత సైకిళ్లు, మోటార్ సైకిళ్లు డిజైన్ చేయడంలో పేరొందిన కార్ల్, తాజాగా రూపొందించిన ‘మోటో పోగో’ ఎలక్ట్రిక్ సైకిల్ సంచలనం సృష్టిస్తోంది. బ్యాటరీతో నడిచే ఈ సైకిల్‌కు ఒకే ఒక చక్రం ఉంటుంది. దానిని బ్యాలెన్స్ చేస్తూ నడపగలిగితే చాలు.

08/04/2016 - 22:16

ఎదులుదెబ్బలు..అందరికీ సహజం. వాటిని తట్టుకుని నిలబడటమే జీవితం. పని వత్తిళ్లూ నేటి చికాకుల మయమైన ప్రపంచంలో సహజం. నిరాశ నిస్పృహలకు లోనుకాకుండా..నిస్తేజం..నిట్టూర్పులు వ్యక్తిత్వాన్ని మింగేయకుండా ముందుకు సాగడంలోనే ఆనందం ఉంది. అందులోనే మనం ఎంచుకున్న లక్షసాధనా మార్గమూ ఉంటుంది.మనం చేయాలనుకున్న పని చేయలేక పోయినా..అది అందినట్టే అంది చేజారినా..ఒకరకమైన నిస్తేజం ప్రతి ఒక్కరినీ ఆవహిస్తుంది.

08/04/2016 - 22:12

ఇతర దేశాలకంటే ఇండియాలో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు జోరుగా సాగిపోతున్నాయట. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో జరిగిన అమ్మకాలనే నిపుణులు ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఇతర దేశాల్లో మూడు శాతమే ఉన్న అమ్మకాలు ఇండియాలో మాత్రం 15శాతంగా నమోదయ్యాయట. అందులోనూ 3జి, 4జి స్మార్ట్ ఫోన్లంటే భారతీయులు మక్కువ చూపిస్తున్నారని మార్కెట్ రీసెర్చ్ సంస్థ ‘కౌంటర్‌పాయింట్ రీసెర్చ్’ చెబుతోంది.

08/04/2016 - 22:13

కాలుష్యం పెచ్చుమీరిపోతున్న ఈ రోజుల్లో ఏం తినాలన్నా భయంగానే ఉంది. పండ్లు తినాలంటే ఎక్కడ కృత్రిమ రసాయనాలతో మగ్గబెడుతున్నారోననే భయం. కూరగాయలు కొనాలంటే పురుగు మందుల ప్రభావం ఉంటుందేమోనని బెంగ. ఇక జంక్‌ఫుడ్ సంగతి సరేసరి. అయితే ఇప్పుడిక ఇలాంటి బెంగలు, భయాలు అక్కర్లేదు. ఎందుకంటే...ఏ ఆహార పదార్థంలో ఎంత శాతం కొవ్వులు, ప్రొటీన్లు, చక్కెర ఉన్నాయో లెక్కగట్టి చెప్పే గాడ్జెట్ వచ్చేసింది.

Pages