S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

07/28/2016 - 21:36

ఫ్లిర్టీ... ఇది ఆస్ట్రేలియాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ. అమెరికాలో పాగా వేసేందుకు వేచి చూస్తున్న కంపెనీ.

07/28/2016 - 21:35

వింబుల్డన్, ఫ్రెంచ్, అమెరికన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్స్‌ను గ్రాండ్‌శ్లామ్ టోర్నమెంట్స్ అంటారు కదా. ఏటా ఈ నాలుగు టోర్నమెంట్లలో ఉపయోగించిన తర్వాత సుమారు 2,30,000 బంతులు వృథా అవుతున్నాయట. లండన్‌కు చెందిన ప్రముఖ డిజైన్ కంపెనీ రోగ్ ప్రాజెక్ట్స్ ఇలా వృథాగా పడేస్తున్న టెన్నిస్ బంతుల్ని తిరిగి ఉపయోగంలోకి తేవాలనుకుంది.

07/28/2016 - 21:33

తమ స్మార్ట్ఫోన్ స్క్రీన్ పదిలంగా ఉండాలనే అంతా కోరుకుంటారు. అందుకోసం వారు ముందుగా చెక్ చేసేది గొరిల్లా గ్లాస్ ఉందా లేదా అనే. ఇప్పుడు గొరిల్లా గ్లాస్‌లో మరింత అడ్వాన్స్‌డ్ వెర్షన్ వచ్చేసింది. అదే గొరిల్లా గ్లాస్ 5. ఈ వెర్షన్‌తో వచ్చిన స్మార్ట్ ఫోన్‌ను ఐదడుగుల ఎత్తునుంచి పడేసినా స్క్రీన్ చెక్కు చెదరట.

07/28/2016 - 21:32

వినూత్నంగా ఆలోచిస్తూ.. కొత్తరంగాన్ని ఎన్నుకుని ధీరోదాత్తంగా ముందడుగు వేసేవారు ఈ కాలంలో తక్కువే. ఆ కోవకు చెందిన ధీరవనిత దివ్య శ్రీవాత్సవ.
దివ్య కార్పొరేట్ ఉద్యోగి. ప్రేమించి పెళ్లిచేసుకుని గృహిణిగా, ఉద్యోగిగా, ముద్దులొలికే బిడ్డకు తల్లిగా హాయిగా బతికేస్తున్న దివ్య జీవితాన్ని సామాజిక సేవ చేయాలనే తపన కొత్త మలుపు తిప్పింది.

07/28/2016 - 21:30

వ్యవసాయం... ఈ పేరు చెబితేనే బెంబేలెత్తే పరిస్థితులు నెలకొంటున్న రోజులివి. పేపర్లు తిరగేస్తే, రోజూ అన్నదాతల ఆత్మహత్యల వార్తలే. రైతులు సైతం వ్యవసాయాన్ని వదిలేసి, కూలీ పనులకోసం పట్టణాలకోసం వలస పోతున్నారు. అలాంటి రోజుల్లో ఇంజనీరింగ్ చదివిన ఓ కుర్రాడు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి, పొలం బాట పట్టాడు. సేద్యానికి తన తెలివితేటలతో పదును పెట్టి, లాభాల దిగుబడిని సాధించాడు.

07/28/2016 - 21:26

సెరెబ్రల్ పాల్సీ, మస్కులార్ డిస్ట్ఫ్రొ, పార్కిస్సన్స్ సిండ్రోమ్...ఇవన్నీ మహమ్మారి వ్యాధులే. వీటితో బాధపడుతున్న రోగులు తమ పనుల్ని తాము చేసుకోలేరు. చివరకు అన్నం తినడమూ చేతకాక, అవస్థ పడుతూ ఉంటారు. అలాంటివారికోసం రోబో ఆర్మ్ ఒకటి అందుబాట్లోకి వచ్చింది. ఈ రోబో ఆర్మ్‌కి స్పూన్ అమర్చి ఉంటుంది. అలాగే నాలుగు బౌల్స్ ఉంటాయి.

07/28/2016 - 21:23

నడిపేది సైకిలే అయినా బైక్ నడుపుతున్న ఫీలింగ్ కావాలా? అయితే త్వరలో మార్కెట్లోకి రానున్న సైక్లోట్రాన్ సైకిల్‌ను కొనుక్కోవలసిందే. మరోమాటలో చెప్పాలంటే...సైకిళ్ల రంగంలో ఇదో విప్లవాత్మకమైన మార్పునకు నాంది పలుకుతున్న సైకిల్. ఆధునిక టెక్నాలజీ సాయంతో తయారైన సైక్లోట్రాన్‌లో కేవలం షేప్ మాత్రం సైకిల్‌లా ఉంటుందంతే. మిగతా పార్టులేవీ ఉండవు. ఉదాహరణకు చక్రాలుంటాయి గానీ, వాటికి హబ్‌గానీ, స్పోక్స్ గానీ ఉండవు.

07/21/2016 - 23:21

ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌ను నెలవారీ ప్రాతిపదికగా ఉపయోగిస్తున్న వారి సంఖ్య వంద కోట్లకు చేరిందట! ఫేస్‌బుక్‌కే చెందిన వాట్సాప్ వినియోగదారులు కూడా ఇప్పటికే వంద కోట్లకు మించారన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ చీఫ్ డేవిడ్ మార్కస్ స్పందిస్తూ..

07/21/2016 - 23:19

మానవాళి పచ్చగా పదికాలాలపాటు ఉండాలంటే...
పచ్చటి మొక్కలూ ఉండాలి.
అవి ఉంటేనే మనిషి మనుగడ.
చెట్లు లేకపోతే...?
కాలుష్య భూతం కోరలు సాచి
మానవాళిని కబళిస్తుంది.
ఇన్ని తెలిసినా, చెట్టును ఎవరూ
బతకనివ్వడం లేదు.
కలపకోసం, భారీ నిర్మాణాలకోసం,
సాగుకోసం...ఇలా ఒకటేమిటి రకరకాల కారణాలతో
చెట్లను పొట్టనబెట్టుకుంటున్నారు.

07/21/2016 - 23:16

ఆమె పేరు శ్రావ్య. పేరుకు తగ్గట్టే శ్రావ్యంగా పాడుతుంది. ‘స రి గ మ ప’, ‘బ్లాక్’ వంటి పాటల ప్రోగ్రామ్‌లలో పాడి, అందరి దృష్టినీ ఆకట్టుకున్న శ్రావ్యది హైదరాబాద్. తాజాగా ‘పాడుతా తీయగా’కు ఎంపికైన శ్రావ్య జీవితంలో ఓ విషాదమూ ఉంది. ఆమె- అంధురాలు. పుట్టుకతోనే కంటి చూపు లేకుండా పుట్టినా, పాడటం ఆమె స్పెషాలిటీ అన్న విషయాన్ని ఆమె నాలుగో ఏటే తల్లిదండ్రులు గుర్తించారు. సంగీతం నేర్పించాలనుకున్నారు.

Pages