S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

05/05/2016 - 21:37

ఐడియా...ఒక్క ఐడియాతో కొన్ని జీవితాలకు మహర్దశ పడుతుంది. ఆ ఐడియా రావడమే కష్టం. వచ్చాక దానిని అమలు చేస్తే వచ్చే ఫలితం...అదిచ్చే కిక్కు వేరు. ఆ మజా ఎలా ఉంటుందో హైదరాబాద్‌కు చెందిన మిత్రత్రయం -డాక్టర్ చంద్రశేఖర్, శివ, సునీల్ కుమార్‌లకు ఇప్పుడు అనుభవైకవేద్యమైంది.

05/05/2016 - 21:34

చేసే పనిలో కాస్త కిక్ ఉండాలి. అప్పుడే చేస్తున్న పనిని ఎంజాయ్ చేయొచ్చు. సైకిళ్లు ఎక్కడపడితే అక్కడ ఉంటాయి. వాటిలో రకరకాలు. కానీ సైకిల్ తొక్కుతుంటే మజా రావాలంటే ఏం చేయాలి? ‘లీ సివ్రాక్’ను కొనుక్కోవాలి. అవును మరి!

04/28/2016 - 21:24

ఇక్రిశాట్‌లో సైంటిస్ట్‌గా పనిచేసేవారు. ఓసారి విమానంలో వెడుతుంటే ఆయనకు ఈడిబుల్ స్పూన్స్ ఐడియా వచ్చింది. దాన్ని ఆచరణలో పెట్టేందుకు ఉద్యోగానే్న వదిలేశారు. ప్రాథమిక దశలో తన ఇంట్లోని వంటగదే ప్రయోగశాల అయింది. రకరకాల ప్రయోగాల అనంతరం జొన్నపిండితో చెంచాల తయారీని ఫైనల్ చేశారు. దానికి కావలసిన మెషీన్ల తయారీకోసం తన ఆస్తులన్నీ అమ్మేశారు.

04/28/2016 - 21:22

ఈడిబుల్ స్పూన్స్!
చెంచాల్ని తినడమేంటి అనేగా
మీ సందేహం?
నిజమే. చెంచాల్ని ఎలా తింటాం? కానీ, దీని వెనుకున్న అసలు కథ అర్థమైతే ‘అవును...చెంచాల్నీ తినేయాలి’ అని మీరూ ఒప్పుకుంటారు.

04/28/2016 - 21:20

‘ఇక ఫేస్‌బుక్ మొహం కూడా చూడకూడదు’ అని ఒట్టేసుకున్నారా? ఫర్వాలేదు...మీ లాంటివారు చాలామందే ఉంటారు. ఇలాంటివారిలో నూటికి 99శా తం మంది వారమో, పది రోజులో పోయాక ఆ ఒట్టు తీసి గట్టు మీద పెట్టి, మళ్లీ ఫేస్‌బుక్‌లోకి ఎంటరైనవాళ్లే ఉంటారు.

04/28/2016 - 21:18

ఇప్పుడు స్పేస్ మేనేజ్‌మెంట్‌పైనే అందరి దృష్టీ! ఏ వస్తువైనా స్పేస్‌ను తక్కువగా వినియోగించుకునేలా ఉండాలి. అదే వస్తువు ఉభయతారకంగా ఉంటే మరీ మంచిది. ఆ కోవలోకే వస్తుంది-ఇఫోల్డీ. ఇదో చిన్న స్కూటర్ కమ్ సూట్‌కేస్! అదెలా కుదురుతుందనేగా మీ సందేహం? ఈ అసాధ్యాన్ని లండన్‌కు చెందిన తండ్రీకూతుళ్లు జియాన్‌మిన్, సుమీవాంగ్ సుసాధ్యం చేశారు.

04/28/2016 - 21:15

బాస్ ఈజ్ రైట్! ఇది ఉద్యోగులందరికీ అనుభవైక వేద్యం. మీ నుంచి పని ఎలా రాబట్టాలో..ఎంతగా మీ సమర్ధతను వినియోగించుకోవాలో బాసులకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. మీ చేత పని చేయించుకోవడంలో అతడి ప్రతిష్ఠ ఇమిడి ఉంటుంది. అందుకే సిబ్బందిని ఎనలేని వత్తిళ్లకు గురిచేస్తారు! బాసులందు కొందరు బాసుల తీరు వేరయా అంటోంది తాజాగా జరిగిన ఓ సర్వే. దీని వివరాల్లోకి వెళితే ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెత్తడమే ఆలస్యం!

04/28/2016 - 21:11

ఇప్పుడందరూ వాడేదీ స్మార్ట్ఫోనే్ల. టచ్‌స్క్రీన్‌పై టైపింగ్ అంత వీజీ కాదు. నాలుగు లైన్లు మెసేజ్ టైప్ చేయాలన్నా ఇబ్బందే. ఇక ఏదైనా పని పడి, ఎవరికైనా అర్జెంటుగా ఓ పది లైన్లు టైప్ చేసి పంపాలంటే తాతలు దిగిరావాల్సిందే. చేతిలో ఇమిడే స్మార్ట్ఫోన్లపై టైప్ చేయడం కూడా అంత సులువేం కాదు. మరి ఈ సమస్యనెలా అధిగమించడం? *

04/21/2016 - 21:41

మన దైనందిన జీవితంలో టెక్నాలజీ ఓ భాగమై పోయింది. ఇమెయిల్స్ చెక్ చేసుకోవడం మొదలు డెస్క్‌టాప్ ముందు కూర్చుని గంటల తరబడి పనిచేయడం వరకూ, కంప్యూటర్ లేనిదే క్షణం గడిచే పరిస్థితి లేని దశకు చేరుకున్నాం. స్మార్ట్ఫోన్ వాడకం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు పరిశీలిస్తే, మింగుడుపడని నిజాలెన్నో కనిపిస్తాయి.

04/21/2016 - 21:36

ఎవరు?
పేరు సైదా ఫలక్
ఊరు హైదరాబాద్
వయసు 21 ఏళ్లు

ఏం చదువుకుందో?
డిగ్రీ చేసింది.
ఎంఎ ఇంగ్లీష్ చదువుతోంది

Pages