S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

04/20/2017 - 21:45

నేలను శుభ్రం చేసే వాషింగ్ రోబోల గురించి విన్నాం. ఇప్పుడు విండో క్లీనింగ్ రోబోలు కూడా వచ్చేశాయి. ఎకోవాక్స్ రోబోటిక్స్ సంస్థ తయారు చేసిన విన్‌బాట్ డబ్ల్యు 830 అనే రోబో గ్లాస్ విండోస్‌పైకి ఎగబాకుతూ చకచకా గ్లాస్ విండోస్‌ను శుభ్రం చేసేస్తుందట. ఇందులో ఉండే సెన్సర్ల సాయంతో ఇది తన దిశను కూడా మార్చుకునే వీలు ఉందట.

04/20/2017 - 21:39

తేనె చాలామందికి ఇష్టం..
కానీ ఓ పనె్నండేళ్ల అమ్మాయికి తేనెటీగలంటే ప్రాణం.

04/13/2017 - 21:59

ఇప్పుడు రోబోలదే హవా. ఆఫీసులోనే కాదు... ఇంట్లో ఏ పని చేయాలన్నా వాటికి చెబితే చాలు. దీనికి గార్డెనింగ్‌కూడా మినహాయింపు కాదు. కోబి రోబోటిక్ లాన్ మోవర్ అనే ఓ బుల్లి రోబో ఇప్పుడు మార్కెట్లో హల్‌చల్ చేస్తోంది. దీనిని మన స్మార్ట్ఫోన్‌లోని యాప్‌కు అనుసంధానిస్తే, ఎక్కడ కావాలంటే అక్కడకు వెడుతుంది...లాన్‌ను సరి చేస్తుంది. అదీ సంగతి.

04/13/2017 - 21:57

ఆకలితో అలమటించేవారికి అన్నంపెట్టే అన్నదాతల్ని చూశాం.
ఇల్లు లేకపోతే ఇళ్లు కట్టించే దానగుణశీలురినీ చూశాం.
అంతేగానీ...రోడ్డు లేకపోతే స్వయంగా రోడ్డు వేసేవారిని ఎక్కడైనా చూశామా?
చూడాలనుకుంటే మణిపూర్ వెళ్లొచ్చు. ఎవరా వ్యక్తి? ఏమా రోడ్డు కథ? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మాత్రం ఈ కథనం చదవాల్సిందే.

04/13/2017 - 22:05

అనగనగా ఓ తాత...ఓ మనవడు!
పదేళ్ల మనవణ్ని 76 ఏళ్ల తాత రోజూ పొలానికి తీసుకెళ్లేవాడు. పంటలు పండించడంలో ఉన్న తృప్తినీ, పదిమందికీ అన్నం పెట్టే రైతన్న గొప్పదనాన్ని విడమరచి చెప్పేవాడు.

04/13/2017 - 21:45

తీవ్రమైన పని ఒత్తిడినుంచి బయటపడాలంటే కాసేపు కునుకు తీస్తే బాగుంటుంది. కానీ అలా కునుకు తీసేందుకు కావలసిన సదుపాయాలు ఎక్కడబడితే అక్కడ ఉండవు. ఫోటోలో కనబడుతున్న అమ్మాయి తలకు తగిలించుకున్న గాడ్జెట్ పేరు కింగ్ ఐ మాస్క్ న్యాపింగ్ పిల్లో. తలకు, మెడకు కుషన్‌ను ఇచ్చే ఈ పిల్లోను తగిలించుకుని, ఫోటోలో ఆ చిన్నది కునుకు తీస్తున్నట్టుగా మనం కూడా కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చన్నమాట. ఈ పిల్లో ధర 45 డాలర్లు.

04/13/2017 - 21:44

రాకేశ్ ఆనంద్ బక్షి...!
ఈ పేరు వినగానే ప్రఖ్యాత బాలీవుడ్ పాటల రచయిత ఆనంద్ బక్షి గుర్తుకువస్తే తప్పేం లేదు! ఎందుకంటే ఈ రాకేశ్, ఆ పాటల రచయిత తనయుడే. అతని గురించి ఇప్పుడెందుకు చెప్పుకోవలసి వస్తోందంటే అతను చేస్తున్న సమాజ సేవ వల్ల!

04/13/2017 - 21:40

అమీర్ ఖాన్ సినిమా త్రీ ఇడియట్స్‌లో అందర్నీ ఆకట్టుకునే ఓ సన్నివేశం ఉంది. అదేమిటంటే- హీరోయిన్ కరీనా కపూర్ సోదరికి అర్థరాత్రి వేళ పురిటి నొప్పులు మొదలవుతాయి. జోరున వర్షం. అంబులెన్స్ సౌకర్యం ఉండదు. కరీనా డాక్టరే అయినా ఆ సమయంలో ఇంట్లో ఉండదు. ఈ విషయం తెలిసి, అమీర్ ఖాన్ స్వయంగా ఫోన్‌లో కరీనాను సంప్రదిస్తూ విజయవంతంగా డెలివరీ చేస్తాడు.

04/07/2017 - 05:08

మొక్కల పెంపకానికి వినూత్న పద్ధతి
ముంబయికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ కృషి

04/07/2017 - 05:06

ఎలక్ట్రిక్ స్కూటర్లు రూపు రేఖలు మార్చుకుని చాలాకాలమే అయింది. ఈ మధ్య రకరకాల స్కూటర్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. పై ఫొటోలో ఉన్నది అలాంటిదే. పేరు ఓజో కమ్యూటర్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఒకసారి చార్జ్ చేస్తే 20 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇందులో ఉండే బిల్టిన్ బ్లూటూత్ స్పీకర్ల సాయంతో మ్యూజిక్ వినవచ్చు లేదా జీపీఎస్ డైరెక్షన్లను ఫాలో కావచ్చు. ధర రెండువేల డాలర్లు.

Pages