S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

05/12/2016 - 21:16

ఎలక్ట్రిక్ పరికరాలతో జాగ్రత్తగా ఉండాల్సిందే. పసిపిల్లల విషయంలో అయితే మరీనూ! పిల్లలు ఆడుకుంటూ వెళ్లి అందుబాట్లో ఉన్న ప్లగ్‌లో ఎక్కడ వేలు పెడతారోనని కంగారు పడని పేరెంట్స్ ఉండరు కదా! అయితే దీనికో చక్కటి పరిష్కారం మార్కెట్లో లభిస్తోంది. దీని పేరు ‘ప్లగ్ పర్‌ఫెక్ట్’. ఇదో చిన్న పరికరం. వాడకంలో లేని ప్లగ్‌కు దీనిని ఇట్టే అమర్చేయొచ్చు. ఇది పూర్తిగా ప్లగ్‌ను మూసిఉంచుతుంది.

05/12/2016 - 21:15

రోజూ వర్కవుట్స్ చేయాలనే ఉంటుంది అందరికీ! కానీ టైమే దొరకదు. అలాంటివారు హా యిగా ఇంట్లోనే చేసుకునే ఎక్సర్‌సైజులు బోలెడున్నాయి. వాటి గురించి తెలిస్తే చాలు. అలాంటివి కొన్ని....
బోట్ పోజ్

05/05/2016 - 21:45

బాలచంద్ర హెగ్డే, సన్నీ అరోకియా స్వామి, కుమారస్వామి, కొట్రేశ్ వీరాపూర్...నలుగురు కుర్రాళ్ల పేర్లు ఇవి. కర్ణాటకలోని ఎంఎస్ రామయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బిటెక్ చదివారు. ఆ తర్వాత ఉద్యోగాలు చేసుకుని స్థిరపడిపోదామని ఆలోచించకుండా దేశానికి ఏం చేయాలా అని ఆలోచించారు. అలాంటి ఆలోచనల్లోనే ఓసారి ఈ నలుగురూ ఉత్తర కన్నడ జిల్లా అయిన జోయిడాలోని మారుమూల గ్రామాలకు వెళ్లారు.

05/05/2016 - 21:43

చాలామంది పేపర్ చదువుతూనో లేదా ఏదో ఆలోచిస్తూనో పక్కనే పొగలు కక్కుతున్న కాఫీ/టీ మగ్గును చేతిలోకి తీసుకుని సిప్ చేస్తారు. మూతి కాలాకగాని అందులో ఉన్న ద్రవం వేడిగా ఉందని గమనించరు. అయితే రైజ్ అండ్ షైన్ హీట్ ఛేంజింగ్ మగ్ గనుక మీ చేతిలో ఉంటే, సిప్ చేయకుండానే అందులో ఉన్న కాఫీ లేదా టీ వేడిగా ఉందో, చల్లగా ఉందో చెప్పేస్తారు. ఎలాగంటారా? ఈ కప్‌పై ఉన్న బొమ్మ సీరియస్‌గా ఉంటే అందులో ఉన్న ద్రవం చల్లగా ఉన్నట్టు.

05/05/2016 - 21:42

హైదరాబాద్‌కు చెందిన ఈ అమ్మాయి విజయాలను తన కేరాఫ్ అడ్రస్‌గా మార్చుకుంది. త్రీడి టెక్నాలజీని ఔపోసన పట్టి, రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన ముద్ర వేసింది. ముప్ఫయి ఏళ్లయినా దాటకముందే అనేక అవార్డుల్ని తన ఖాతాలో వేసుకుంది. తన స్నేహితుడు హసన్ అలీ ఖాన్‌తో కలసి ఐదేళ్ల కిందట ‘మెర్షియస్ సాఫ్ట్‌వేర్’ పేరిట వర్చువల్ రియాలిటీ కంపెనీ నెలకొల్పిన వైశాలి, అనతికాలంలోనే ఈ రంగంలో తనదైన ముద్ర వేసింది.

05/05/2016 - 21:39

ఎదుటివారి మూడ్‌ను బట్టి మాట్లాడటం ఓ కళ. అయితే వారి హావభావాలను బట్టి వారి మూడ్‌ను అంచనా వేయడం అందరికీ సాధ్యం కాదు. హో చి మిన్ సిటీలోని వియత్నాం నేషనల్ యూనివర్శిటీ, దక్షిణ కొరియాలోని సూంగ్‌సిల్ యూనివర్శిటీలకు చెందిన ప్రొఫెసర్లు కొందరు ఈ విషయాన్ని ఓ ఛాలెంజ్‌గా తీసుకుని, మొహంలోని హావభావాలను కనుగొనే ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ రికగ్నిషన్ సిస్టమ్‌ను కనుగొన్నారు.

05/05/2016 - 21:37

ఐడియా...ఒక్క ఐడియాతో కొన్ని జీవితాలకు మహర్దశ పడుతుంది. ఆ ఐడియా రావడమే కష్టం. వచ్చాక దానిని అమలు చేస్తే వచ్చే ఫలితం...అదిచ్చే కిక్కు వేరు. ఆ మజా ఎలా ఉంటుందో హైదరాబాద్‌కు చెందిన మిత్రత్రయం -డాక్టర్ చంద్రశేఖర్, శివ, సునీల్ కుమార్‌లకు ఇప్పుడు అనుభవైకవేద్యమైంది.

05/05/2016 - 21:34

చేసే పనిలో కాస్త కిక్ ఉండాలి. అప్పుడే చేస్తున్న పనిని ఎంజాయ్ చేయొచ్చు. సైకిళ్లు ఎక్కడపడితే అక్కడ ఉంటాయి. వాటిలో రకరకాలు. కానీ సైకిల్ తొక్కుతుంటే మజా రావాలంటే ఏం చేయాలి? ‘లీ సివ్రాక్’ను కొనుక్కోవాలి. అవును మరి!

04/28/2016 - 21:24

ఇక్రిశాట్‌లో సైంటిస్ట్‌గా పనిచేసేవారు. ఓసారి విమానంలో వెడుతుంటే ఆయనకు ఈడిబుల్ స్పూన్స్ ఐడియా వచ్చింది. దాన్ని ఆచరణలో పెట్టేందుకు ఉద్యోగానే్న వదిలేశారు. ప్రాథమిక దశలో తన ఇంట్లోని వంటగదే ప్రయోగశాల అయింది. రకరకాల ప్రయోగాల అనంతరం జొన్నపిండితో చెంచాల తయారీని ఫైనల్ చేశారు. దానికి కావలసిన మెషీన్ల తయారీకోసం తన ఆస్తులన్నీ అమ్మేశారు.

04/28/2016 - 21:22

ఈడిబుల్ స్పూన్స్!
చెంచాల్ని తినడమేంటి అనేగా
మీ సందేహం?
నిజమే. చెంచాల్ని ఎలా తింటాం? కానీ, దీని వెనుకున్న అసలు కథ అర్థమైతే ‘అవును...చెంచాల్నీ తినేయాలి’ అని మీరూ ఒప్పుకుంటారు.

Pages