S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

03/03/2016 - 23:03

అనగనగా ఓ సైకిళ్ల కంపెనీ. పేరు కాల్ఫీ డిజైన్. ఎప్పుడూ ఒకే రకం సైకిళ్లే తయారు చేసి...చేసి విసుగొచ్చిందట ఈ కంపెనీవారికి. ఈసారి ఏకంగా వెదురుతోనే సైకిల్ చేసి మార్కెట్లోకి వదిలారు. ఇంకేముంది...ఈ కొత్త తరహా సైకిల్‌కు బోలెడు గిరాకీ వచ్చేసిందట. ఇంతకీ ఈ సైకిల్ పేరేమిటనుకున్నారు...కార్ కిల్లర్. ఇదేం పేరు అనేగా మీ సందేహం?

03/03/2016 - 23:02

‘జాస్’ సినిమా చాలామంది చూసే ఉంటారు. తీరంలో జలకాలాడేవారే లక్ష్యంగా ఓ షార్క్ వేట కొనసాగించడం, చివరకు హీరో దాని పనిపట్టడం ‘జాస్’ కథాం శం. ఆస్ట్రేలియా తీరవాసులకు కూడా ఇప్పుడు ఇలాంటి కష్టమే వచ్చిందట. కొన్ని షార్క్‌లు తీరానికి వచ్చి మనుషుల్ని నోట కరచుకుని పోతున్నాయట. దీంతో డ్రోన్లను రంగంలోకి దించేందుకు అక్కడి స్థానిక ప్రభుత్వం నిర్ణయించిందట.

03/03/2016 - 23:00

ఎలక్ట్రిక్ కార్లంటే అమ్మబాబోయ్ అనే వారే ఎక్కువమంది. చీటికీ మాటికీ చార్జింగ్ చేయడం ఓ తలనొప్పి. అంతేనా? స్పీడ్ విషయంలో రెండెడ్ల బండి కంటే కాస్త మెరుగు. ఇవే చాలామందిలో ఉన్న స్థిరాభిప్రాయాలు. అయితే వీటిని పటాపంచలు చేస్తూ క్రొయోషియాకి చెందిన రిమాక్ కంపెనీ ఓ సరికొత్త ఎలక్ట్రిక్ కార్‌ను మార్కెట్‌కి పరిచయం చేయబోతోంది.

03/03/2016 - 22:58

మార్కెట్లోకి తాజాగా వచ్చిన కొత్తరకం ఎల్‌ఇడి పోర్టబుల్ స్ట్రిప్ వినియోగదారుల్ని ఆకట్టుకుంటోంది. 96 మినీ పోర్టబుల్ ఎల్‌ఇడి లైట్లతో కూడిన 96 సెంటీమీటర్ల పొడవున్న ఈ స్ట్రిప్ పేరు- లైట్ మై టాయ్. ఈ స్ట్రిప్‌ను దేనికైనా అమర్చుకోవచ్చు. ఇంట్లో ఉన్న బొమ్మలకైనా, లేదా నడుము చుట్టూ పెట్టుకునే బెల్ట్‌కైనా, తలపై టోపీకైనా ఇట్టే అమర్చుకోవచ్చు. ఈ స్ట్రిప్‌లోనే బ్యాటరీ ఉంటుంది.

03/03/2016 - 22:56

ప్రధాని స్వచ్ఛ భారత్ పిలుపు మేరకు చేటలు, చీపుళ్లు పట్టిన నేతలు ఎంతోమంది! శుభ్రంగా ఉన్న రోడ్ల మీద చెత్త ఊడుస్తున్నట్టు నటించి ఫోటోలు తీయించుకున్న వారే వీరిలో ఎక్కువ మంది! కానీ, స్వచ్ఛ భారత్ పిలుపు వెనక అంతరార్థం గ్రహించి, పరిసరాల పరిశుభ్రతకు ఒంటరి పోరాటం చేస్తున్నాడో యువకుడు.

03/03/2016 - 22:53

రన్ ఫన్!
బెంగళూరు టు హైదరాబాద్
పది రోజులు...600 కిలోమీటర్లు
రోజుకు 60 కిలోమీటర్లు
ఫిబ్రవరి 23న ప్రారంభం
హైదరాబాద్‌కు చేరుకునే రోజు: మార్చి 3 లేదా 4

02/26/2016 - 07:56

పనే దైవం
పనే నాకు దైవం. ఆఫీసుకు వచ్చిన వెంటనే అని గదుల్నీ కలియదిరగడం నాకు అలవాటు. మెషీన్లు చేసే చప్పుళ్లను నిశితంగా వింటాను. శబ్దాన్ని బట్టి వాటిలో లోపాలేమిటో గ్రహించడం నాకు దేవుడిచ్చిన వరం.
-శ్రీకాంత్

02/26/2016 - 07:47

ప్రస్తుతం భారత్‌తో పాటు పలు దేశాల్లో ఏ నోట విన్నా ‘ఫ్రీడం-251’ స్మార్ట్ఫోన్ మాటే వినిపిస్తోంది. ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్న ఈ స్మార్ట్ఫోన్ ఫోటోలు దిగువ మధ్యతరగతి ప్రజలు మొదలుకొని అట్టడుగు స్థాయి వరకు అన్ని వర్గాల ప్రజలను ఊరిస్తున్నాయి.

02/26/2016 - 07:46

ఎల్జీ రోలింగ్ బాల్ ఇంట్లో ఉంటే చిన్నా చితకా పనులన్నీ చేసి పెట్టేస్తుంది. పైగా పిల్లలకు దీంతో బోలెడు వినోదం. బౌలింగ్ బాల్‌లో సగం సైజుండే ఈ రోలింగ్ బాల్ ఇల్లంతా తిరుగుతూ, చిత్ర విచిత్రమైన శబ్దాలు చేస్తూ ఉంటుంది. అంతేనా, అదే టీవి, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంది కూడా. అంతటితో దీని పని ఆగదు. ఇంట్లోకి ఎవరొస్తున్నారో, ఎవరు వెడుతున్నారో ఓ కనే్నసి ఉంచుతుంది.

02/26/2016 - 07:46

బ్యాటరీల సాయంతో ఎగిరే డ్రోన్ల శక్తిసామర్థ్యాలు తక్కువే. అయితే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డ్రోన్లమీద ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని జనజీవనంలో భాగం చేసేందుకు ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్‌కు చెందిన వాణిజ్య డ్రోన్ల తయారీ సంస్థ ఒక్యూఎయిర్ ...ఎండ్యురో అనే డ్రోన్‌ను ప్రత్యేకంగా తయారు చేసి ఇంగ్లీష్ ఛానెల్‌పై ఎగురవేసింది. ఈ డ్రోన్‌ను ఎక్యుఎయిర్ బృందం బోట్‌లో అనుసరించింది.

Pages