S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

02/16/2017 - 22:26

ఏం పని చేయాలో నిర్ణయించుకోండి...ఆ నిర్ణయం ప్రకారం పని చేయండి
- ఈతి అగర్వాల్
సిఎ ఆలిండియా టాపర్
**

02/16/2017 - 22:24

ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఓనమాలు నేర్చుకుంటున్న తరుణంలోనే అంతర్జాతీయ వేదికపై ప్రతిభాపాటవాలు కనబరిచే అవకాశం రావడం అరుదైన విషయం. అలాంటి అరుదైన అవకాశాన్ని హైదరాబాద్‌కు చెందిన పంథొమ్మిదేళ్ల సలోనీ జైన్ చేజిక్కించుకుంది. హిమాయత్‌నగర్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్‌లో రెండో ఏడాది చదువుతున్న సలోనీ, ఓవైపు చదువుకుంటూనే మరోవైపు తన ప్రతిభకు సానపెట్టుకుంటోంది.

02/16/2017 - 22:20

స్మార్ట్ఫోన్‌కు రకరకాల స్క్రీన్‌గార్డ్స్ అందుబాట్లో ఉన్నాయి. అయినా వాటి పని అంతంతమాత్రమే. కాస్త పైనుంచి పడితే స్క్రీన్ గ్లాస్ అంతే సంగతులు. అయితే ప్రొటెక్ట్‌పాక్స్ ఇన్విజబుల్ స్క్రీన్ ప్రొటెక్టర్‌ను ఉపయోగిస్తే స్మార్ట్ఫోన్ గ్లాస్‌ను సుత్తితో బాదినా పగలదట. ప్రొటెక్ట్‌పాక్స్ అనేది నానోటెక్నాలజీతో రూపొందించిన లిక్విడ్ గ్లాస్.

02/16/2017 - 22:18

చూడటానికి బ్రేస్‌లెట్‌లా కనిపిస్తున్న ఈ గాడ్జెట్ ఓ పవర్ బ్యాంక్ అంటే నమ్ముతారా? దీని పేరు నిఫ్టీ ఎక్స్ (నికూతి). యువతను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ గాడ్జెట్ ఎంత స్టైలిష్‌గా ఉందో చూశారు కదా. దీనికి ఉండే కనెక్టర్ సాయంతో ఏ డివైస్‌కైనా నిఫ్టీఎక్స్‌ను సునాయాసంగా కనెక్ట్ చేయొచ్చు. దీని సాయంతో ఒకసారి స్మార్ట్ఫోన్‌ను చార్జ్ చేస్తే 50 నిమిషాలసేపు నిరాఘాటంగా మాట్లాడుకోవచ్చు.

02/10/2017 - 00:33

వేరెవర్ యు గో...అవర్ నెట్‌వర్క్ ఫాలోస్!- ఒకప్పటి హచ్ నెట్‌వర్క్ స్లోగన్ ఇది. ఓ కుర్రాడు ముందు వెడుతుంటే అతన్ని అనుసరించి పగ్ వెళ్లే ఈ అడ్వర్టయిజ్‌మెంట్ అప్పట్లో ఓ సంచలనం. పగ్‌లాగే మిమ్మల్ని అనుసరించి, మీ సూట్‌కేస్ వెనకాలే వస్తుంటే ఎలా ఉంటుంది? మజాగా ఉంటుంది కదూ. ఫొటోలో ఆ వ్యక్తి కూర్చున్నది అలాంటి సూట్‌కేస్‌పైనే. దీని పేరు ట్రావెల్‌మేట్ రోబో సూట్‌కేస్.

02/10/2017 - 00:31

పక్షి... తన పిల్లలకు రెక్కలొచ్చి, ఎగిరే శక్తి సమకూరేవరకూ ఆహారం ముక్కున కరచి తెచ్చి, నోటికి అందిస్తుంది.
కన్న బిడ్డ కాకపోయినా పాలకోసం ఏడ్చే పిల్లిపిల్లకు పాలిచ్చి ఆదరించే గ్రామసింహాలను చూసి ఉంటాం.
శత్రువైనా, తల్లి కనిపించక తల్లడిల్లిపోయే జింక కూనను పోనీలే పాపం అని వదిలిపెట్టే మృగరాజుల గురించీ విని ఉంటాం.

02/10/2017 - 00:27

జయవేల్... చెన్నై రోడ్లపై బిచ్చమెత్తుకునే కుర్రాడు. అతని తల్లిదండ్రులది ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు. చేసిన అప్పులు తీర్చలేక, ఉపాధిని వెతుక్కుంటూ ఆ కుటుంబం చెన్నైకి వలసవెళ్లింది. అక్కడ ఉపాధి లభించక బిచ్చమెత్తుకోవడం మొదలుపెట్టారు. చిన్నారి జయవేల్ ముగ్గురు అక్కలూ, తమ్ముళ్లతో కలసి రోడ్లపై సిగ్నల్స్‌వద్ద బిచ్చమెత్తుకునేవాడు. జయవేల్‌కు మూడేళ్ల వయసు వచ్చేసరికి తండ్రి మరణించాడు.

02/10/2017 - 00:24

తమిళనాడుకు చెందిన దశరథన్, ధన్‌రాజ్ అన్నదమ్ములు. దశరథన్ రష్యాలో ఎంబిబిఎస్ చదువుతుంటే తమ్ముడు ధన్‌రాజ్ జబల్పూర్ ట్రిపుల్ ఐటీలో చదువుతున్నాడు. ఇందులో విశేషమేముందీ అనుకుంటున్నారా? వీరిద్దరూ ఒకప్పుడు ఇటుకల బట్టీలో పనిచేసే కూలీలు. అదే విశేషం! బాల కార్మికులను వెతికి పట్టుకుని వారికి విముక్తి కల్పించేందుకు శ్రమించే ఉమ, ఓ సందర్భంలో ఓ ఇటుకల బట్టీకి వెళ్లినప్పుడు అక్కడ ఈ ఇద్దరు సోదరుల్నీ చూసింది.

02/10/2017 - 00:21

దేశ జనాభాలో గణనీయ పరిమాణంలో ఉన్న యువతకు అవకాశాలకు కొదవలేదు. సవాళ్లు, సమస్యలు ఎన్నో ఉన్నా కెరీర్‌పరంగా నిర్ధుష్టమైన వ్యూహంతో నిర్ధిష్టమైన మార్గంలో ముందుకు వెళ్లగలిగితే అవకాశాలు అవే అందివస్తాయి. ఏ విధంగా చూసినా ఇది పోటీ ప్రపంచం. హద్దులు లేని అవకాశాల ఆవని. చదువుకున్న చదువుకు సార్ధకత ఉండాలంటే అందుకు తగ్గ రీతిలోనే కెరీర్‌ను పెంపొందించుకోవాలి.

02/10/2017 - 00:19

ఫొటోలో కనిపిస్తున్నవి హీట్ 3 స్పెషల్ గ్లోవ్స్. చలికాలంలో వెచ్చదనాన్ని ఇచ్చే ఈ చేతి తొడుగులను వాస్తవానికి యురోపియన్ సైనికులకోసం తయారు చేశారట. వీటి పనితీరు అద్భుతంగా ఉండటంతో సాధారణ మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. మామూలు గ్లోవ్స్‌కన్నా ఇవి పలుచగా ఉంటాయి. వేడిమి కలిగించేందుకు వీటిలోహీట్ పాక్స్ ఉంటాయి.

Pages