S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

02/12/2016 - 03:17

ఇది రోబోల కాలం. ఐరోపా దేశాల్లో షాపింగ్ మాల్స్‌లోనూ, ఆఫీసులలోనూ ఎక్కడ చూసినా రోబోలే దర్శనమిస్తున్నాయి. ఇందులో వింతేం లేదు. అయితే ఇకపై ఇండస్ట్రియల్ రోబోలు రాబోతున్నాయి. అదే అసలు వింత. ఇండస్ట్రియల్ రోబోలంటే పరిశ్రమల్లోనూ, వ్యవసాయ క్షేత్రాల్లోనూ పనిచేసే రోబోలన్నమాట. జపాన్‌లోని క్యోటోకు చెందిన స్ప్రెడ్ అనే సంస్థ రోబోలతోనే సాగు చేయించే పద్ధతికి శ్రీకారం చుడుతోంది కూడా.

02/12/2016 - 03:16

మన దేశంలో మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ ఏడాది జూన్ నాటికి వీరి సంఖ్య 37కోట్లకు చేరుకున్నట్టు అంచనా. గత ఏడాది జూన్ నాటికి 23 కోట్లుగా ఉన్న ఈ సంఖ్య ఏడాది కాలంలోనే 14 కోట్లు పెరగడం విశేషమే. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎఎంఎఐ) నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోనూ మొబైల్ ఇంటర్నెట్ వాడకం పెరుగుతోంది.

02/12/2016 - 03:15

ఇంజన్‌కి అడపాదడపా ఓవరాలింగ్ ఎలా చేస్తారో అలాగే మన శరీరానికీ ఓవరాలింగ్ అవసరమే. అందుకు సరైన పద్ధతి వ్యాయామం. ఎక్సర్‌సైజులు ఇలాగే చేయాలీ అనేం లేదు. కొందరు జాగింగ్‌ను ఎంచుకుంటే మరికొందరికి రన్నింగ్ అంటే ఇష్టం ఉండొచ్చు. ఇంకొందరికి యోగాపై మక్కువ కావచ్చు. ఏదైనా ఎంచుకోవచ్చు. అయితే వయసును బట్టి వ్యాయామం ఉండాలి. సాధారణంగా యాభయ్యేళ్లకు పైబడినవారు రన్నింగ్ చేస్తే గుండె సంబంధిత జబ్బులకు లోనుకావచ్చు.

02/12/2016 - 03:14

రోజంతా బిజీబిజీగా ఉంటాం. కాస్తయినా టైమ్ దొరకదు. అయినా వీలు చూసుకుని మనకంటూ ఓ హాబీని ఏర్పరచుకుని కనీసం రోజుకు పావుగంటయినా దానికోసం సమయం వెచ్చిస్తే, అది ఇచ్చే మానసిక ఆనందం అంతా ఇంతా కాదు. మీకు వండటమంటే ఇష్టమనుకోండి. రోజంతా అలసి సొలసి ఇంటికొచ్చినా, కాసేపు మీ శ్రీమతికి వంటిట్లో సాయపడితే ఎంతో మానసికోల్లాసం కలుగుతుంది.

02/12/2016 - 03:13

మన శరీరంలో నీటి శాతమే ఎక్కువ. కానీ బిజీ లైఫ్‌లో పడి నీళ్లు తాగడమే మర్చిపోతూంటాం. శరీరాన్ని స్వచ్ఛంగా, ఆరోగ్యంగా, తాజాగా ఉంచడంలో నీళ్లదే ప్రధానపాత్ర. నీళ్లు ఎక్కువగా తాగితే చర్మం కూడా నిగారింపు సంతరించుకుంటుంది.

02/12/2016 - 03:12

శారీరిక దృఢత్వానికి వ్యాయామం ఎంత ముఖ్యమో మానసిక ప్రశాంతతకు, మానసిక దృఢత్వానికి ధ్యానం కూడా అంతే ముఖ్యం. రోజూ కనీసం పది నిమిషాల సేపు తదేక దీక్షతో ధ్యానం చేస్తే చాలు. కావలసిందల్లా అందుకోసం మీరు టైమ్ కేటాయించగలగడమే.

02/12/2016 - 03:11

శారీరికంగా సంక్రమించే అనేక వ్యాధులకు కారణం మనం తీసుకునే ఆహారమే. జిహ్వ ఎంత గోలపెట్టినా జంక్ ఫుడ్ జోలికి పోకూడదు. అలాగే స్వీట్లు, కొవ్వు పదార్ధాలు ఉండే ఆహారం జోలికి వెళ్లకూడదు. తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవడం ముఖ్యం. పండ్లు, కూరగాయలతో చేసిన సలాడ్లు భోజనంలో ఉండేలా చూసుకోవాలి.

02/12/2016 - 03:10

రోజూ మనమేం చేశామో డైరీ రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. మనం చేసిన తప్పుల్ని, వాయిదా వేసిన పనుల్ని కూడా రాసుకోవడం వల్ల అవి ఓ హెచ్చరికలా పనిచేస్తాయి. మరోసారి ఆ తప్పు చేయకుండా నిరోధిస్తాయన్నది మానసిక శాస్తవ్రేత్తలు పదేపదే చెప్పే మాట. కొన్ని రోజులు పోయా క, పాత పేజీలను తిరగేస్తే మీలో వచ్చిన మార్పు మీకే ఆశ్చర్యం కలి గిస్తుంది. కాబట్టి మనకోసం మనం కొత్త సంకల్పం చెప్పుకుందామా?

02/11/2016 - 23:46

సైకిళ్లు మొదలుకొని కార్లవరకూ అద్దెకివ్వడం తెలుసు. ఇళ్లు అద్దెకివ్వడం కూడా తెలిసిందే. కానీ మొబైల్ ఫోన్లను అద్దెకిచ్చే కానె్సప్ట్ గురించి విన్నారా? ఎల్‌జి, శామ్‌సంగ్ వంటి ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీలకు పుట్టినిల్లయిన దక్షిణ కొరియా ఈ సరికొత్త కానె్సప్ట్‌కి తెరతీసింది. అక్కడ ఎస్ టెలికామ్ అనేది అతిపెద్ద వైర్‌లెస్ టెలీకమ్యూనికేషన్స్ ప్రొవైడర్.

02/11/2016 - 23:45

ఇ కామర్స్‌లో అందె వేసిన చేయిగా పేరొందిన అమెజాన్ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. ఇంట్లో పూజ తలపెట్టారా? అయితే పూజారిని కూడా మేమే పంపిస్తామంటూ సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. అఫ్‌కోర్స్! ఈ ఆఫర్ ఇండియాలో కాదు...జపాన్‌లో! జపాన్‌లో బౌద్ధమతస్థుల కోసం ఇలాంటి ఆఫర్ ఇచ్చి అందర్నీ అమెజాన్ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తాజాగా తన వెబ్‌సైట్‌లో ‘ఓబో సాన్-బిన్’ అనే సర్వీస్‌ను మొదలు పెట్టింది.

Pages